Monday, February 11, 2013

మమత ఆవేశం అర్థం చేసుకోదగినదే!

పదవుల్లో ఉన్నవారు బీ పీ పెంచుకోకూడదు, కోపాన్ని ప్రదర్శించకూడదు...అన్నవి నిజమే అయినా...ఒకొక్కసారి జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్ల విషయంలో కొందరు నేతలు నిగ్రహాన్ని కోల్పోయి ఆగ్రహం కనపరిచి మీడియా దాడికి గురవుతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిన్న ఫోటోగ్రాఫర్లపై కనబరిచిన కోపం ఈ కోవలోనిదే. 

'మాతి ఉత్సవ్' పేరిట పభుత్వం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో Panaragh అనే చోట ఇది జరిగింది. అక్కడ వంట ఏర్పాటు ఎలా వుందో చూడడానికి దీదీ వంటశాలకు వెళ్ళినప్పుడు...భద్రతా వలయాన్ని చేదించుకుని ఒక ఫోటోగ్రాఫర్ మంట మీద ఉన్న పాత్రకు అవతలి వైపు వెళ్లి కింద వున్న వస్తువులను తొక్కుతూ...ఆ యాంగిల్ నుంచి  మమత ఫోటో తీయాలని ప్రయత్నించినప్పుడు ఆమెకు ఒళ్ళు మండింది. "ఒక్కటి చరుస్తా. బుద్దిలేదా? ఒక పక్క మంట మీద అన్నం వుడుకుతున్నది కనపడడం లేదా?" అని మమత అన్నారట. ఆమె తన మాతృభాషలో అన్న మాటలు ఇలా వున్నాయి. 
"Ek thappar debo. Ashabhyagulo. Dekhchen na agune ranna hochhe (I will give you a tight slap. You are all uncivilized. Can't you see that food is being cooked on the fire?)."

ఈ ఘటనతో ఒళ్ళు మండిన పత్రికలు మమతపై దాడి ఆరంభించాయి. నా లెక్క ప్రకారం...ఒకటి రెండు రోజుల పాటు బెంగాల్లో జర్నలిస్టులు ప్రదర్శనలు కూడా చేస్తారు. ఆమె 'దురహంకారాన్ని దునుమాడుతారు. తన కారు తీసుకు రావడంలో జరిగిన జాప్యానికి కోపగించుకుని..."ఏమిటీ లేటు? తోలు తీస్తా..." అని తన భద్రతా సిబ్బందిని అన్న ఒక వారం తిరగక ముందే మమత ఇలా జర్నలిస్టులపై నోరు పారేసుకున్నారని కొన్ని పత్రికలు విమర్శలు మొదలు పెట్టాయి.  కనిపించిన అందరినీ కరవడం జబ్బు కిందకు వస్తుంది కానీ...నిన్నటి ఘటనలో మమతను తప్పు పట్టలేం. ఫోటో జర్నలిస్టు ప్రవర్తనను మాత్రం ఖండించక తప్పదు. 

పాపం...మంచి ఫోటోలు తీయాలని, ఇతర పత్రికల కన్నా మంచి యాంగిల్స్ కావాలని ఫోటో గ్రాఫర్లు తాపత్రయ పడతారు. దానివల్ల  అధికారిక కార్యక్రమాలలో ఫోటో జర్నలిస్టులు తోపులాటకు, తగువులాటకు దిగక తప్పని పరిస్థితి. ఒకొక్కరు వందల కొద్ది ఫోటోలు తీసుకోక తప్పడం లేదు. 

మొన్నీ మధ్యన ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం జరిగితే....డాక్టరేట్ పట్టా తీసుకోవడానికి నేను తెల్లబట్టలు వేసుకుని 
టాగోర్ ఆడిటోరియం కు వెళ్లాను. అక్కడ నా సీటు నంబర్ ఏడు. అంటే..ముందు వరసలో వుంటుంది. అక్కడి నుంచి స్టేజ్ మీద ఉన్న వారిని చూడడం కుదరలేదు. కారణం...మన ఫోటో జర్నలిస్టు మిత్రులు...చాలా సేపటి వరకూ...వాళ్ళ ముడ్లు చూస్తూ గడపటంతోనే  సరిపోయింది. వాటిని నిరంతరం చూస్తూ...అపుడప్పుడు నిలబడి గెస్టులను చూస్తుంటే...చాలా ఇబ్బంది అనిపించింది. నా పక్కనే కూర్చున్న..అరబిక్ లో పట్టా పొందిన ఒక మహిళ వాటిని చూడలేక మొహం వేరే వైపు తిప్పుకుని అవస్థ పడింది. ఇక్కడ ఎవ్వరినీ తప్పుపట్టలేని దుస్థితి. ఎవళ్ళ డ్యూటీ వాళ్ళది. 

ఈ రోజుల్లో వివిధ ప్రోగ్రాంలు కవర్ చేస్తున్న జర్నలిస్టుల సంగతి దారుణంగా ఉంది. గొట్టాలు (చానెల్స్) ఎక్కువయ్యాయి, మంచీ మర్యాద తగ్గిపోయాయి. స్టేజ్ మీద ఉన్న నేతలు/ అధికారులు/ ముఖ్యుల ఎదురుగా వీడియో గ్రాఫర్లు, పోటో గ్రాఫర్లు ఒక దడి కడుతున్నారు. వాళ్ళు నిలబడతారు. దాంతో స్టేజ్ మీద ఏమి జరుగుతుందే తెలియడం....అభిముఖంగా కూర్చున్న వారికి కష్టం. 

"బ్రదర్...ఒక రెండు ఫోటోలు తీసుకుని జరగవచ్చు కదా..." అని ఎవరైనా అంటే...వాళ్ళంతా కలిసి గయ్యిన లేస్తారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే...మీడియా స్వాతంత్ర్యంను దెబ్బ తీస్తున్నారని ధర్నా చేస్తారు. ఇదొక క్లిష్ట సమస్య. జర్నలిస్టుల ఉద్యోగాలు పోతున్నా...దున్నపోతు మీద వాన కురిసినట్లు ఉన్న జర్నలిస్టు సంఘాలు పలువురికి (జర్నలిస్టులకు కూడా) అసౌకర్యంగా ఉన్న ఈ సమస్యపై ఒక ఆలోచన చేస్తే బాగుంటుంది.

3 comments:

JE said...

జర్నలిస్ట్లు..విలువలు..మాట్లాడుకోవడానికి ఇదో గొప్ప టాపిక్ కానీ..వదిలేస్తే మన ఆరోగ్యం బావుంటుంది

అతి తక్కు వ జీతాలతో మంచి పోసిషన్ కి చేరింది సీవీఅర్ న్యూస్...ఓ నలుగురు షిఫ్ట్ ఇంచార్గేస్ తో ఛానల్ ని
నడుపుతున్న ఔట్పుట్ చాల బాగా వస్తోంది..వెటకారం ఏమి లేదు..అయితే వాళ్ళలో కొంతమంది వేరే దరి
వెతుక్కున్నారని తెలుస్తోంది..
సీవీఅరె పంథా వేరు..అడ్డదిడ్డం గ పెద్ద పెద్ద వాళ్ళ ని బ్లాకు మెయిల్ చేయడానికే ఛానల్ ని యాజమాన్యం వాడుకుంటోందని
అసలు అల వాడుకోవదనికే ఇలా ఛానల్ పెట్టారని టాక్..అది నిజమో కాదో

కళామందిర్ IPO వ్యవహారం లో వాళ్ళు అనుసరిస్తున్న తిరు చుసిన తెలిసిపోతుంది...నిన్న ఆదివారం ...ప్రోమో , కమింగ్ అప్ ఇచి
వేసిన స్టొరీ చుస్తే జర్నలిస్ వాల్యూస్ పై ఆ యాజమాన్యానికి వున్నా అభిప్రాయం అర్ధం అవుతుందని ....మిత్రులు చెప్తున్నారు...నిజంగా
ఆ స్టొరీ చుసిన అర్ధం అవుతుంది...వరసగా...శ్రీరామ్ చిట్స్, అభయ గోల్డ్, కళామందిర్, రాయపాటి, లగడపాటి...ఇలా వరస స్టొరీ లతో
వాళ్ళెం సాధించాదలుచుకున్నారో అర్ధమైపోయింది...లోపల రిపోర్టర్స్, ఇదే విషయం పై తెగ చర్చించుకుని..ఇక ఇలాంటి ఛానల్ లో పని చేస్తే బయట
సంస్తలు. వ్యక్తులు ప్రెస్ మీత్స్ కి boycott చేస్తారేమో అని తెగ ఫీల్ అవుతున్నారట...అసలు మన ఇమేజ్ లో జరిగే దారుణాలని ఎవరిఅన స్ట్రింగ్ ఆపరేషన్
చేస్తారేమో అని హాస్పిటల్ ఎంప్లాయిస్ భయపడుతున్నారట...

ఇంకో అప్డేట్..సీవీఅర్ లో శాల రీలు వీలైనంత లేట్ అవడానికి చైర్మన్ టూర్స్ పెట్టుకున్తునదని అక్కడి రిపోర్టర్స్ చెప్తున్నారు. ఒక్క రిపోర్టర్ ( జిల్లాల్లో) రోజుకి
ఒక హెల్త్, ఒక devotional , ఒక రెగ్యులర్ , ఓ పొలిటికల్ స్టొరీ పంపమంటూ చవగోడుతున్నర్త..ఈ విషయాలు ఒకటికి రెండు సార్లు కాంఫిరం చేసుకుని రాస్తన్నవె ..

-----
ఇక జీ లో శివప్రసాద్ యధావిధిగా తన ఛాంబర్ లో facebook ఓపెన్ చేస్కుని చాట్ చేస్కుంటూ..యాజమాన్యానికి ఎటువంటి ఇబ్బంది కలిగించడం లేదట..
సతీష్ ఈ యన గారి ప్రతిభ పై పెట్టుకున్న భ్రమలు తొలగిపోవడం తో ...ఎప్పుడు అవకాసం దొరిక్తే అప్పుడు దరి చుపెదాడమని ప్లాన్ లో ఉన్నట్ట...ఇత గడు తెచుకున్న batch కూడా యధా రాజ తడ ప్రజా ల ప్రవర్స్తిటు...తమకి ఉన్న మంచి పేరు నిలబెట్టుకున్తున్నర్త...కచ్చితంగా ఆరునెలల క్రితం విల్లా
సాలరీ పదిహేనువేలు..కానీ ఇప్పుడు 30వేలకి ఎవరికీ తక్కువ లేదు..సివగాడ్ని నమ్ముకుంటే...ఇంత లాభం ఉంది కాబట్టే ఇక విల్లు పని గురించి ఆలోచించకుండా'
టిఫిన్ box మోయడం లో మునిగి తేలుతున్నారు..ఈ పాయింట్ జీ మిత్రులే చెప్పారు

ఐ న్యూస్ లో సేఎం వట తీస్కున్న తర్వాత పోగిదింపు కార్యక్రమాలు రాయలేక చస్తున్నర్త...అంటే విలువలకి పతరేయలేక కాదు..అసలు అది కూడా
రాయడం చేత కానీ వాళ్ళు ఉన్నారని...నరేంద్ర కి ఇప్పటికి తెలిసి వచిందట...తేరా గ కుర్చుని తినే పెద తలకాయలకి ఇప్పుడు పని చేయాల్సి వచేసరికి ముద్దా
దిగడం లేదట...
--------------
స్టూడియో n ..ప్రతి నెల ఎప్పుడు జిటలు పడతాయో తెలీక ...ఎప్పటికప్పుడు చైర్మన్ చెప్పే మాటలు నమ్ముతూ, వేరే దారి లేక ఉద్యోగులు గొడ్డుల్లా పని చేస్తున్నారక్కడ ...
-----------
మహా లో సంగతి చెప్పేదేముంది....
----------
ఏబిఎన్ లో , హేచెం లో సలరిలు పెరిగాయత....కష్టాలు మాములే...

------------
అగ్ర స్తాయిలో కొనసాగే చానల్స్ లో చెప్పేదేముంది...టైం కి జిటలు పడతాయి..కానీ అక్కడ మాత్రం విలేఖరుల వృతి విలువలు మృగ్యం అయిపోయి ఎన్నో
రోజులు అయింది కదా...


ఇంకా ఈ లిస్టు లో చేరడానికి తులసి, శక్తీ, 10టీవీ, టాలీవుడ్ క్యు లో ఉన్నాయి..ఏ మాత్రం వస్తాయో తెలిదు..అయితే విలేఖరులకి మరో కొత్త గుళ్ళు
దొరుకుతాయనే ఆస తప్ప ..విలువలు ఎక్కడ ఉన్నాయ్...కడుపు నిండిన తర్వాత ఎవరు ఏ కబుర్లు అయిన చెప్తారు....కాదంటారా?

------------------------------

Narsimha Kammadanam said...

ఎర్ర జెండా మళ్ళీ ఎగురవెయాలని..ఎర్ర పార్టీలు బాగా శ్రమిస్తున్నాయి అందుకే అక్కడ మీడియా పేరుతో రోజుకో ధర్నా ....రాను రాను దీదీ నవ్వింది ప్రజలు కష్టాలలో ఉంటే ఎలా నవ్వగలదు అంటారు!!
నిజానికి ఏ సి.ఎం అయినా రుస రుసలాడుతారు ఏదో ఒక సంధర్భం లో ...కానీ దీదీ చేస్తే అది న్యూస్ అవుతుంది అంతే..

katta jayaprakash said...

I agree with your comment.The news photographers,TV camera men have become a pain the neck in any programme.It is better if they some photos initially and leave the dias or can take the photos in a particular corner or angle without disturbing the audience and the dias dignitaries.As rightly said by our friend the TV channels have become gold mines and money spinning mills as their main job is to collect money through hook or crook and send a part to head office.Almost al channels adopt this method.Even the so called gentlemen of media with values too follow this policy.when a grand son of a leading Telugu film producer was caught in sting operation by a channel while he was accepting drugs the channel demanded crores for not telecasting it.Some elders of film industry intervened and settled the matter with the help of police.There are many such cases in daily life.THE PROFFESSION IS HEAVILY POLLUTED and requires total clean up.But who can comeforward?In these days one can earn easily by starting an evening tabloid with limited printing to blackmail for money.As the corruption is universal the media too is one of the partners.WE JUST GET SATISFACTION AND RELIEF BY SHARING WITH OUR FRIENFDS and other than this nothing can be done.We have to pay for the news and to avoid the news.

JP.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి