Saturday, February 9, 2013

అఫ్జల్ గురు ఉరిపై రభస అవసరమా?

ఒకొక్కసారి ఈ టీ వీ చానెల్స్ లో కొన్ని వాదనలు వింటుంటే...మన బుర్ర ఎదగాల్సి ఉందా? లేక ఎదుటివాడి బుర్ర చెడిందా? అన్న సందేహం కలుగుతుంది. పార్లమెంటుపై దాడి కేసులో సూత్రధారిగా సుప్రీంకోర్టు నిర్ధరించిన అఫ్జల్ గురును ఈ ఉదయం గుట్టుచప్పుడు కాకుండా తీహార్ జైల్లో తీసిన ఉరి మీద ఇంగ్లిష్ చానెల్స్ లో జరుగుతున్న చర్చలు వింటే మరొక సారి ఈ సందేహం కలిగింది.

ఏ మాటకు ఆ మాటే...మన తెలుగు ఛానెల్స్ వాళ్ళు ఇలాంటి లోతైన చర్చలు పెట్టరు, రాద్ధాంతం చేయరు. పైగా మనకు అంత లాజిగ్గా విషయ పరిజ్ఞానంతో వాదన వినిపించే మేధావులు లేరు.  ఉన్నదల్లా...ఆస్థాన కామెంటేటర్లు. ఛానల్ యజమాని స్టూడియోకి పిలిస్తే చాలని, వాళ్ళు అడిగింది తాము చెబుతుండగా...మన భార్యా పిల్లా జెల్లా బంధువులు, అంతే వాసులు చూసి పొగిడితే చాలనుకునే బ్యాచ్ ఇక్కడ వర్ధిల్లుతున్నదని జర్నలిస్టులే చెబుతారు. కాకపోతే...కుక్కల్లా స్టూడియోల్లో మొరిగి సదరు చర్చను రక్తి కట్టించాలనుకునే సెక్షన్ ఉంది. లేకపోతె...జర్నలిజం పేరుచెప్పుకుని పైరవీలు చేసి సంపాదించుకున్న వర్గం హవా నడుస్తున్నది...స్టూడియోల్లో. పైగా...ప్రశ్నలు అడిగే మహానుభావుల్లో కూడా చాలా వరకు మిడిమిడి జ్ఞానంతో... లోతైన ప్రశ్నలు వేయకుండానే...ఈ రోజుకు డ్యూటీ అయ్యిందని అనిపించుకుని చేతులు దులుపుకుని పోయే వాళ్ళే ఎక్కువన్న అపవాదు ఉంది. దీని మూలంగా...మనకు పెద్దగా చికాకు లేదు. ఒక అర్థగంట పాటు వీళ్ళు చర్చ పేరుమీద హడావుడి చేసి వెళ్ళిపోతారు. కాసేపు రణగొణ ధ్వని తప్ప చర్చ లోని అంశాలు మన బుర్రలను వెంటాడవు.  

ఇంగ్లిష్ చానెల్స్ లో మేధావులు మాత్రం అద్భుతంగా వాదన చేసి...తప్పును ఒప్పుగా, ఒప్పును పరమ తప్పుగా ప్రొజెక్ట్ చేసి మన బుర్ర చెడగొడతారు. రాజ్దీప్ సర్దేశాయ్, అర్ణబ్ గోస్వామి, బర్ఖా దత్ లు వాళ్ళ రాగ ద్వేషాల ను బట్టి పానెల్ డిస్కషన్ జరిపి మనలను గందరగోళ పరుస్తారు. 

ఇవ్వాళ చర్చలోని పలువురు మేధావులు అఫ్జల్ గురు ఉరి దారుణమన్నట్లు మాట్లాడారు. కసబ్ ను చంపకూడదు, అఫ్జల్ ను చంపకూడదు. మైనారిటీ లకు వాళ్ళు నిజమైన ప్రతినిధులు అన్నట్లు కొందరు, ఉరి ఘోరమైన పాపం అని మరి కొందరు...అద్భుతంగా వాదించారు. ఆడపిల్లలు బురఖాలు ధరించాలి, పాటలు పాడకూడదు అని మత సంప్రదాయాలు వల్లెవేసేవారు తప్పును తప్పుగా మాట్లాడడం లేదు. దేశభక్తి తో తప్పును తప్పు అని మేధావులు చెప్పకపోతే....సొంత మతం, సొంత మనుషులు, సొంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే....ప్రజాస్వామ్యం ఎలా మనగలుగుతుంది?  

నా వరకు అఫ్జల్ ఉరి ఏ మాత్రం తప్పు అనిపించలేదు. క్షమాభిక్ష కోసం ఇన్నేళ్ళు జైల్లో పెట్టకుండా ఎప్పుడో ఈ పనిచేస్తే అయిపోయేది. సమయం సందర్భం గురించి రచ్చ కూడా అనవసరం. నన్ను అడిగితే...ఈ మత పిచ్చతో దేశంలో ప్రశాంతతకు భగ్నం కలిగించే వాళ్ళను, మతోన్మాద ప్రసంగాలు చేస్తూ ఇతర మతస్థుల మనోభావాలను గాయపరిచే వారిని (హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా) కూడా అర్జెంటుగా కసబ్, అఫ్జల్ దగ్గరకు పంపాలి. పైన వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. ఇలా...చట్టం తన పని చేసుకుపోతుండగానే...ఉరి మంచిదా కాదా అన్న అంశంపై ఒక నిర్ణయం జరగాలి.  ప్రజాభ్యున్నతి ధ్యేయంగా సమ సమాజం కోసమంటూ అడవులు పట్టుకు తిరుగే వారిని పట్టుకుని పిట్టలను కాల్చినట్లు కాల్చి కథలు చెప్పే ప్రభుత్వాలు...దేశంలో శాంతిని ఖతం చేసే మతోన్మాదులను ఓట్ల కోసమో, మరే ప్రయోజనం కోసమో క్షమిస్తే కష్టం.   

అందరికన్నా....ఉగ్రవాదంపై పోరాడుతున్న మణీందర్ సింగ్ భిట్టా వాదన నాకు బాగా నచ్చింది. "భాయీ సాబ్...అఫ్జల్ కు ఉరి తీయడం గురించి ఈ బాధిత కుటుంబాలను అడగండి. మొహానికి ఇంత మేకప్ వేసుకుని మీ స్టూడియోలలో కూర్చొని మాట్లాడే వారికి ఈ బాధ తెలియదు," అని భిట్టా భాయ్ అన్నాడు. ఈ మాటలు నిజం కాదంటారా?     

12 comments:

venkat said...

అర్ధం కావడం లేదు, ఎందుకు ఈ వరవరరావు వెళ్ళందరూ గొడవ చేస్తున్నారో.
కసబ్ విషయం లో కూడా ఇలాగె గొడవ చేసారు , కాకపోతే అప్పుడు ఇంత లేదు, ఎందుకంటే ప్రజలంతా ఆగ్రహం ఉన్నారని అర్ధమై ఏదో ఒక ప్రకటన ఇచ్చి ఊరుకున్నారు.
కాని అఫ్జల్ ఉరి అక్రమం అని హైదరాబాద్ నడిబొడ్డున ధర్నా చేస్తున్నారంటే ???, వీళ్ళ ఇంటి మీద దాడి చేయనంత కాలం ఇవన్ని అక్రమమే అనుకుంట వాళ్లకి. అంతకన్నా నాకేం అర్ధం కావడం లేదు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం లో అక్రమం ఏముంటుందో ??
ఉరి తీసిన సమయం వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు కి అనుగుణంగా ఉందేమో కాని ఉరి మాత్రం తప్పదు.

ఈ మనవ హక్కుల సంఘాలు వాళ్ళ కున్న హక్కులని ఇలా అనవసరమైన వాటికి ఉపయోగించుకునే బదులు , ఈ సమయాన్ని వేరే వాటికి కేటాయిస్తే వేరే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగం ఉంటుందేమో.
You are correct, why dont these guys ask the victims of this heinous incident.

astrojoyd said...

అసలు విష్యం మరిచారు మీరు..ఆంగ్ల ..హిందీ టీవీ ల యజమానులంతా కిరస్తానీలూ-తురకలే..ఇప్పుడు మీకు విషయం భోధపదిందని తలుస్తానూ

Subba Reddy said...

వురి నాగరిక శిక్షాస్మృతిలో ఇంకా కొనసాగడం సమాజపు అపసవ్య ధోరణికి నిదర్శనం.మన న్యాయ వ్యవస్త నేరస్తులలో పరివర్తన సాధించి,వారిని తిరిగి సమాజపు అబివృద్దిలో భాగం చేయడమన్న లక్ష్యం తో పని చేస్తోంది .అంతే కాకుండా రాజకీయ కారణాల వల్ల వుద్యమాల్లో పాలు పచుకుంటు వక్తిగత స్వార్తంతో కాకుండా వుద్యమ అవస రాల కోసం నేరస్థులుగా న్యాయస్తానాల ముందు నిల బడ్డ వారు వ్యక్తిగతంగా శిక్షలకు గురి కావాల్సి వస్తోంది. ఈ నేపద్యాం ఆలోచిస్తే వురి ఎంత అసంగతమో అర్తమవుతుంది. వురిని వ్యతిరేకించే వాల్ల ఇల్లపై ఎలా దాడులు చేయాలా అని ఆలోచించ కుండ అసలు దేశంలో ప్రాంతీయ వుద్యమాలు,గిరిజన పోరాటాలు ఎందుకు వెల్లువెత్తుతున్నాయో ఆలోచించండి.ప్రభుత్వాలు తీసుకునే రాజకీయ నిర్ణయాలకు ఎందరి జీవితాలు బలవుతున్నాయో చూడండి.దేశానికి ఎంతో పర్యాటక ఆదాయాన్నిచ్చే కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో కేవలం ఒక డిగ్రీ కాలేగి మాత్రమే వుండడానికి కారణమేమిటో ఆలోచించండి. జమ్ము _ శ్రీ నగర్ జాతీయ రహదారి మన గ్రామీణ రోడ్ల కంటే అద్వానంగా ఎందుకున్నాయో ఆలోచించండి.స్దెశ స్వాతంత్ర్యం తరువాత పాకిస్తాన్, భారత్ రెండింట్లో ఎక్క్డైనా కలువడానికి వీలున్నా కేవలం తమ జీవన విధానికి దగ్గరగా వుండే లౌకిక విధాన భారత్లొ చేరిన కాశ్మీరిలు వారి విముక్తి కోసం జిహాద్ చేస్తామన్న మత తీవ్రవాదులను ఆహ్వానించడానికి కార్ణాలేమితో ఆలొచించండి .దేశమంటే మట్టికాదు దేFఅమంటే మనుషులని గుర్తించండి.
- ఎన్ వి . సుబ్బార్డ్డి

katta jayaprakash said...

A good comment.It is true that it is the pseudo intellectuals who cry against the hanging of Afzal.But they are blind to the injuries inflicted to the democratic institution and a temple of peoples representives the parliament.It is a war against the country.How can one keep quiet at this brutal attack? Are the Supreme Court judges kids? They have into deep into the case with all documentary and circumstantial evidences while giving judgement of death sentence.When the entire country is satisfied with the hanging why this madness of some pseudos? In the recent sexual and physical attack on a paramedic the entire country demanded death sentence.It is true by giving death sentence terrorism and crime will not come down but it gives a red signal to the criminals and terrorists to think twice to proceed with their agenda.
It is most shocking that The Hindu newspaper in it's editorial today has said that the hanging is vengeance and vengeance is not justice.It is a pity that the editorial has termed Afzal's hanging as vengeance as if the judiciary is a personal enemy of Afzal for vengeance.What do you think ?

JP.

కొండముది సాయికిరణ్ కుమార్ said...

చాలా కరెక్టుగా చెప్పారండి. మతోన్మాద ప్రసంగాలు చేస్తూ ఇతర మతస్థుల మనోభావాలను గాపరచేవాళ్ళని ఏంచేయాలో బాగా చెప్పారు. ఈ సందర్భంగా నేను నిన్నటి నుంచి ఫాలో అవుతున్న ఓ కవిత లింకు ఇస్తున్నాను. ఢిల్లీలో నిర్భయపై జరిగిన అత్యాచారానికి, హిందువులు పరమపవిత్రంగా భావించే పురుషసూక్తం కారణమట. అది కాముకత్వాన్ని కల్పిస్తున్నదిట. ఇకపైగా వీటన్నిటికి మూలం వేదాలట. ఇక్కడ జరిగిన చర్చను ఆసాంత ఓపిగ్గ చదవమని విజ్ఞప్తి.
http://vaakili.com/patrika/?p=1105#comment-956

Narsimha Kammadanam said...

అసలు చంపడానికి వచ్చిన అఫ్జల్ ని ఉరి తీస్తే ఉరిని నిశేదించాలని ధర్నా చేస్తున్న గొప్ప వాళ్ళు, మానవతావాదులు ఉండగా ఏ శతృదేశం మన మీద దండెత్తుతుంది?ఆ ఉగ్రవాదిని ఉరితీస్తె తప్పు అన్నవారు రేపు శతృదేశాల సైనికులని కొత్త ఆయుధాలతో చంపితె ఊరుకుంటారా?తప్పులెందుకు చేస్తున్నారని మన సైనికుల చెవి మెలి వేయరు?!!అందుకే మన ప్రభుత్వం కాస్త బడ్జెట్ తగ్గించి దాన్ని మన బీద నేతల నాల్ల అకౌంట్లలో వేసి సెవ చేస్తొంది!!!!
అయినా దేనికైనా ఒక హద్దు ఉంటుంది శతృవైన ఉగ్రవాది ఉరికి శిక్షా స్మృతిలొ ఉరిని నిశేదించాలి అనేదానికీ కాస్తైనా తేడా చూపించాల్సిన అవసరం ఉందనుకుంటా ఎందుకంటే ఉగ్రవాది కసి తో,అక్కసు తో కొన్ని ఏళ్ళ శిక్షణ తొ ధాడి చేస్తాడు వీరు ఉరిని నిశేదించాలి అనేది "విచక్షణ కొల్పోయి క్షణీకావేశం లో" తప్పు చేసె వారికి వర్తించాలంటె కాస్త న్యాయంగా ఉండేది.

vinod said...

Subba reddy garu, ippudu meru vesina comment ki okallakuku kopam vachindi,
Thanu alanti valla andarini kalipi kiratakamga champesadu.. vallu oka 100 mandi unnaru anukundam...
appudu meeru vadu enduku champadu vadi mansika sthithi ni marchandi ani prabuthavanni aduguthara leka uri teyyali ani aduguthara...

Nax lights chanipoga/ encounter/ uri testhe manava hakkula ullangana ane Mah"anubhavalu", aa rojanna oka police ni oka maoist / terrorist champinappudu okka santhapa sandesham anna pampara chanipoina vallaki....

Sick u ppl

K V Ramana said...

Human rights apply to Humans. Anyway, also please follow the debate on Narendra Modi. I am consciously tracking two English channels and they have an extremely slanted view on Modi being the prime ministerial candidate. But, the channels are forgetting to ask the Congress who their prime ministerial candidate is.

4thAugust1932 said...

A terrorist is a freedom fighter who isn't on your side.

NEWS ARTICLES said...

ఉగ్రవాదులను, సంఘ విద్రోహులను సమాజానికి దూరంగా ఉంచడమే మన చట్టాల లక్ష్యం. వారిపై పగ తీర్చుకోవడం కాదు. ఈ విషయాన్ని మీరంతా అర్థం చేసుకుంటే చాలు.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి