Friday, October 23, 2009

సెన్సేషనలిజం తో నవ్వుల పాలవుతున్న టీవీ జర్నలిజం

ఓ యాభై మంది నర్సులలో...ఒకామె-- "నన్ను డాక్టర్ వేధిస్తున్నాడు"...అని మీడియా కు చెప్పింది. వృత్తి పట్ల నిబద్ధత, నీతీ రీతీ  వున్న జర్నలిస్టు  అయితే వెంటనే ఆ ఆరోపణపై దర్యాప్తు చేయాలి. ఆ స్టొరీ లో ఈ కింది సోర్సులను టచ్ చేయాలి.

1) ఆరోపణ చేసిన నర్సు (ఆమె చేసిన ఆరోపణలు నిజమేనా? కథనం నమ్మదగినదిగా వుందా? అన్న అంశాలు శోదిస్తూనే..ఆమెకు ఇతరులపై లేని పోనీ ఆరోపణలు చేసే గుణం వున్నదేమో చెక్ చేసుకోవాలి)
2) కనీసం అర డజన్ నర్సులతో మాట్లాడాలి. వారి వాదనను రికార్డు చేసుకోవాలి. మొదటి నర్సు ఆరోపణలను వీరితో జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకోవాలి. 
3) నర్సుల సంఘం వుంటే..వారి వివరణను తెసుకోవాలి.
4) ఆరోపణకు గురైన వైద్యుడిని తప్పని సరిగా కలవాలి. నర్సు చేసిన ఆరోపణలపై తన వాదనను వినడం చాలా ముఖ్యం. వార్త కొంచం ఆలస్యమైనా పర్వాలేదు కానీ...ఆరోపణలకు గురైన వ్యక్తిని కలవకుండా...వార్త ప్రసారం/ ప్రచురణ ఘోర తప్పిదం. ఒక వేళ ఆ డాక్టరు మీడియాకు ముఖం చాటువేస్తుంటీ...ఆ మాటే ప్రజలకు తెలియజేయాలి. డాక్టర్ చరిత్రనూ తవ్వి చూడాలి.

5) వైద్యుల అసోసియేషన్ ప్రతినిధిని కలవాలి 
6) ఆ ఆసుపత్రి సూపరిన్ టెన్ డెంట్ వెర్షన్ తప్పని సరిగా తీసుకోవాలి 
7) ఆరోపణలు తీవ్రమైనవి అయితే...వెంటనే...ఆరోగ్య శాఖ మంత్రిదో, ఉన్నత స్థాయి అధికారిదో వివరణ తీసుకోవాలి.


జర్నలిజం చదువుకున్న వారైతే...ఈ సోర్సు లను వాడకుండా..స్టొరీ చేయరు. అలా చేసిన వారు జర్నలిజానికి ఏ మాత్రం పనికి రారు. ఈ సోర్సు లు లేకుండా స్టొరీ ప్రసారం చేసిన ఛానల్ ను ఒక పది రోజులు బ్యాన్ చేసినా తప్పులేదు. సదరు నర్సు చేసిన ఆరోపణలు తప్పు అని తేలితే....బాధిత డాక్టర్ వెర్షన్ లేకుండా స్టొరీ ప్రసారం చేసినందుకు...ఆ ఛానల్ నుంచి కనీసం ఒక కోటి రూపాయలు నష్ట పరిహారం ఇప్పించి...వార్తకు బాధ్యులైన వారిని చట్ట ప్రకారం శిక్షించాలి.


అయితే...మన స్వర్ణాంధ్ర ప్రదేశ్ లో ఈ నియమాలూ గియమాలు ఏమీ వుండవు. రూల్స్ పాటించే సమయం, ఓపిక మన మీడియా వారికి లేవు. ఒక నర్సు బైట్ ఇస్తే చాలు...ఛానల్ వారు...ఒక వీర నారిని ఫీల్డ్ మీదకు పంపుతారు. వారు..ఒక్క బైటే వాడి..ఇది ఎక్స్ క్లుసివ్ స్టొరీ కింద దంచేస్తారు. ఆ వార్త చాలా సేపు చూపించి...ఒక చర్చ జరిపి...పంచనామా చేసి...ఇది తమ ఘనత వల్లనే వెలుగు చూసిన నగ్న సత్యమని ప్రచారం చేసుకుని మురిసి పోతారు. అది చూసి మిగిలిన ఛానల్ వారు కూడా రెచ్చిపోయి ఏదో ఒకటి చేస్తారు. తప్పుడు వార్త ప్రసారం చేసినందుకు సిగ్గు పడకుండా తప్పుడు ఛానల్ వారు...మరి కొన్ని కట్టు కథలు అల్లు తారు. 

బ్రదర్  ఇది జర్నలిజం కాదు... బ్రదర్.  మిత్రమా రవి...జర్నలిజం లో పీ.హెచ్.డీ కూడా చేస్తున్న నికార్సైన జర్నలిస్టు మీరు. ఈ చెత్త వార్తలు మీకు తెలియకుండా వస్తున్నాయేమో..ఒక్క సారి చెక్ చేసుకోండి. నిన్న టీ వీ-9 లో మీ వార్త చూసిన వారు..."నిమ్స్ లో వైద్యులకు ఇంకేమీ పని లేదు...అక్కడి నర్సులను వేధించడం తప్ప" అన్న భావంతో వుంటారు. వ్యవస్థపై నమ్మకం పోయే పనులు మనకెందుకు? 

నిజంగా రూల్ బుక్ పాటించి...కీచకపు డాక్టర్లు దొరికితే వార్త లతో వాత పెట్టండి కానీ...ఈ తరహా సెన్స్ షనలిజం మీ లాంటి ప్రథమ శ్రేణి ఛానల్ కు తగదు. ఇది మనకు తలవంపులు తెస్తుంది. నిజంగా...మీ పరిశోధన ప్రకారం వైద్యుడు దోషి అయినా..ఒక పధ్ధతి పాటించి అతన్ని బ్లాస్ట్ చేయండి. సేన్సేషనలిసం యావ లో పడి 'మల్టిపుల్ సోర్సింగ్' అన్న సిద్ధాంతం పాటించకపోతే జనానికి మనపై నమ్మకం పోతుంది.



జనం ఇప్పటికే...మన హడావుడి వార్తలు చూసి ఛీ కొట్టుకుంటున్నారు. ఇలాంటి చెత్త స్టోరీలు వృత్తికి తలవంపులు తెస్తాయి. సదరు డాక్టర్ ఒక బుర్ర వున్న న్యాయవాదిని పట్టుకుని మీ మీద దావా వేస్తే? దొరికిపోతారు బ్రదర్...తస్మాత్..జాగ్రత్త.

11 comments:

Bolloju Baba said...

what is the meaning of bytes in this context?

can you pl. enlighten on this.

Vinay Chakravarthi.Gogineni said...

nice analysis and suggestion also

rayraj said...

డైరెక్టుగా పేరుపెట్టి చెప్పారంటే....పర్లేదు; బావుంది. కానీ మీ బ్లాగుని సదరు రవి చూస్తాడా అన్నది నాకు తెలియని విషయం.

ప్రథమ శ్రేణి ఛానల్ - ఏది? టివి9?
సెన్సేషనలిజం ఒక్కటే లక్ష్యంగా పుట్టుకొచ్చిన ఛానల్ ఇది. దీన్ని ఏ విధంగా ప్రథమ శ్రేణి ఛానల్ అనాలి? లేక, మిగిలిన వాళ్ళంతా కనీసం ఆ సెన్సేషనల్ న్యూసులుగా కూడా, విజయవంతంగా చూపలేని అసమర్ధులు కాబట్టి, వీళ్ళని ప్రధమ శ్రేణి ఛానల్ అనాలా?

In the past, I beleived it was a business strategy. I assumed that the channel might bring some good content after a critical market share is attained. But i was wrong. Its just a sensational channel. That's it.

This Telugu blogging world anyway is rote with lot of media persons but you seem to be slightly different, who has turned to academics after considerable industry experience. I do understand that your focus at the moment is on "Ethics and Journalists", however, may i request you to write more on the industry and its business in detail. This helps people like me to have an insight into its happenings. Can I expect something from you on this?

rayraj said...

I have just gone through some of your posts and i have seen more of the Ethics angle.

Well....Perhaps...this is not the happenings I want to know. In a way, this is gossip.

I want to know more about the business and businsess reasons.Can you write about those issues?There is a direct link between business and ethics as well.

jeevani said...

అన్నయ్యా నేను ఎస్వీ.ప్రసాద్ ని. సంతోష్, కులశేఖర్ బ్యాచ్. ఓ ఆర్నెళ్ళ కిందట ప్రెస్ క్లబ్ లో కలిశాము. మీకు గుర్తు ఉందో లేదో. ప్రస్తుతం అనంతపురంలో టేచర్ గా పనిచేస్తున్నాను. జీవని అనే స్వచ్చంద సంస్థ పెట్టి తల్లిదండ్రులు లేని పిల్లల్ని చేరదీస్తున్నాము. భాస్కర్ గురించి రాసినపుడు సంతోష్ మీ బ్లాగు గురించి చెప్పాడు అయితే అప్పుడు దొరకలేదు. ఈ రోజు కూడలిలో కనిపించింది. మేము అప్పుడప్పుడే జర్నలిజం స్కూల్ నుంచి బయటకు వచ్చినపుడు, మీరు మాకు ఐడల్. మీడియాను జనాలు ఏవగించుకునే స్థితికి ( ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ) చేరుకుంది. మీలాంటి నిబద్ధత ఉన్నవాళ్ళు కూడా ఫీల్డులో ఉన్నారని ప్రజలకు తెలియచెప్పాల్సిన బాధ్యత మీమీద తప్పకుండా ఉంది. మొహమాటం లేకుండా ఏకిపారేస్తున్నారు. మీరు తగ్గకుండా కొనసాగించండి....

Ramu S said...

Bolloju baba gaaru,
camera mundu maatlaade maatanu byte antaaru. maamoolugaa patrikalalonaite...peru petti..phalaanaa vaaru ilaa annaru ani raastaaru. channels lo mukham, maatalu choopinchi..vaari daya vuntee...kinda peru istaaru. ide byte.
thanks
Ramu

Bolloju Baba said...

thank you sir

చదువరి said...

ఆ చానల్లో వచ్చిన వార్త తప్పని అదే నర్సు చేత, ఆవిడ భర్త చేతా చెప్పించారు ఐదో టీవీ వాళ్ళు. :)

Anonymous said...

dear rayraj garu,
tv9 e vidhyanga prathama sreni channel ani adigaru kada.... o sari ramu garini adigi TRP ratings pariseelinchandi... tv9 satta ento ravi prakash capacity ento mee burrakekkutundi...

దుప్పల రవికుమార్ said...

అయ్యో రాముగారూ, టీవీ నైన్ కు నీతులు చెప్పాలనుకుంటున్నారా? నిజానికి మనం చూస్తున్న జర్నలిజపు విలువలు అధోపాతాళానికి పడిపోవడానికి కారణం పత్రికలలో ఈనాడు, టీవీలలో టీవీ నైన్ అని మనం మర్చిపోతే ఎట్లా?

rayraj said...

@ఎనానమిస్‌గారు, టిఆర్పీ రేటింగులంటే ఏమిటొ విశదీకరిస్తే, ఏ విధంగా అది ఒక కొలబద్దో ముందు నెత్తికి ఎక్కించుకొని, తరువాత టివి9 టీఆర్పీలను తెలుసుకొని అప్పుడు నిజంగానే ఈ విధంగా టివి9 లాంటివి ప్రథమ శ్రేణి చానల్సో కాదో తేల్చుకుందాము.

నాకు రవిప్రకాష్ సత్తా తెలుసుకోవాలని లేదు. అతను సాధించినది నచ్చలేదు గాబట్టి, ఎందుకు నచ్చలేదో చర్చించటానికి సిద్ధం!! నచ్చేవి సాధిస్తూ కూడా, వ్యాపారంలోనూ విజయం సాధించటం ఎలాగో చర్చించటం ఇష్టం!

మీకూ ఇష్టమైతే, చర్చని మీ బ్లాగులో మొదలెట్టండి.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి