Thursday, October 8, 2009

"బ్రేకింగ్ న్యూస్"తో జనం బేజార్...

"కర్నూలు జల సమాధి" అని టి.వి.లో బ్రేకింగ్ న్యూస్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? కర్నూలు పట్టణమంతా పూర్తిగా జలమయం అయ్యిందని అనిపించక మానదు. "సమాధి" వంటి పదం వాడారు కాబట్టి...అక్కడ మృత్యువు కరాళ నృత్యం చేస్తున్నది కాబోలు అని కూడా అనిపిస్తుంది--సగటు మనుషులకు. 

అదే కర్నూలులో మన కుటుంబమో, స్నేహితులో వుంటే..పెద్ద అక్షరాలతో స్పెషల్ ఎఫెక్ట్ తో క్షణ క్షణానికి వస్తున్న ఆ బ్రేకింగ్ న్యూస్ గుండె దడ పుట్టిస్తుంది. పనులన్నీ మానుకుని మన వారి క్షేమ సమాచారం తెలుసుకునేందుకు పడరాని పాట్లు పడతాం. పొరపాటున టెలిఫోన్ లైన్లు కలవకపోతే మనకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. వారి గురించి తెలుసుకునే దాక అన్నం సహించదు, నిద్ర పట్టదు. ఈ పరిస్థితి నిజంగా నరకప్రాయం.


ఈ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చే మహానుభావులు కర్నూలులో ఏయే ప్రాంతాలు జలమయం అయ్యాయో నిర్దిష్టంగా చెప్పాలి. "బాధితులు మాకు ఫోన్ చేయండి మొర్రో," అని మొత్తుకునే కన్నా.. వరద పరిస్థితిని  మరింత కూలంకషంగా పూస గుచ్చినట్లు వీక్షకులకు అందించాల్సిన అవసరం వుంది. ఉదాహరణకు..."వరద కౌగిట్లో ఆంధ్ర," అని ఒక దరిద్రపు బ్రేకింగ్ న్యూస్ ఏ బుద్దితక్కువ చానెలో ఇస్తే...ప్రవాసాంధ్రులు ఏమనుకుంటారు? ఆంధ్ర మొత్తం గల్లంతు అవుతుందేమో అని బెంగ పడతారు. మీ స్క్రీన్లో ఎక్కువ అక్షరాలు పట్టవు కాబట్టి...సూక్ష్మం లో మోక్షం చూపిద్దామనుకుని వాస్తవాన్ని వక్రీకరిస్తే ఎలా సారూ?


వరద సమయంలో ప్రత్యక్షంగా ఇబ్బంది పడే వారితో పాటు బాధితుల గురించి పరోక్షంగా బాధ పడే బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషుల మానసిక స్థితి గురించి కూడా పట్టించుకుంటే బాగుంటుంది. ప్రకృతి విలయ తాండవం  ప్రకోపాల సమయంలో మీడియా మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలి. 


కానీ, ఇటీవలి వరదల సందర్భంగా మీడియా, ముఖ్యంగా టి.వి. ఛానెల్స్, మరీ ఓవర్ యాక్షన్ చేశాయని చెప్పక తప్పదు. ఒక ఛానల్ వారు..మొత్తంగా ప్రభుత్వం విఫలం అయ్యిందని..తమ రిపోర్టర్లు మాత్రమే నడుం లోతు నీళ్ళలో బాధితులకు సహాయం చేస్తున్నారని ప్రసారం (ప్రసారం) చేసుకున్నది. ఇప్పుడు బాధితులంతా ఈ ఛానల్ రిపోర్టర్ల కోసం ఎదురు చూడాలా? లేక..అధికార యంత్రాంగం కోసం ఎదురు చూడాలా? వ్యవస్థ పై నమ్మకం పోయేలా వ్యవహరించకూడదు..ఆపత్కర పరిస్థితుల్లో.


కుక్క పని కుక్క...గాడిద పని గాడిద చేస్తే బాగుంటుంది. మీడియా...వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపించవచ్చు, పరిస్ధితులు మెరుగు పడే పని చేయవచ్చు. "కానీ, యిలా..చౌక బారు ప్రచారం చేసుకోవాల్సిన పనిలేదు.." అని గత పాతికేళ్ళుగా మీడియాను నిశితంగా పరిశీలిస్తున్న ఎం. శ్రీనివాస ప్రసాద్ అన్నారు. "బ్రేకింగ్ న్యూస్ కు ఒక అడ్డు అదుపు లేకుండా పోయింది. ఛానెల్స్ కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి," అని ఆయన అభిప్రాయ పడ్డారు.

శ్రీనివాస ప్రసాద్ కూడా ఈ బ్రేకింగ్ న్యూస్ బాధితుడే. ఒక వీర ఛానల్ లో బ్రేకింగ్ న్యూస్ విని ఈయన హడావుడిగా..కర్నూలు లోని తన ఫ్రెండ్ కు ఫోన్ చేసారు. కర్నూలులో కొన్ని ప్రాంతాలలో మాత్రమే వరద నీరు నిలిచిందని..చాలా వరకు సురక్షితంగానే వున్నారని తెలుసుకొని ఆయన కుదుట పడ్డారు. 

మీడియా ఓవర్ యాక్షన్ గురించి ఉస్మానియా విశ్వవిద్యాలయం కమ్యునికేషన్ అండ్ జర్నలిజం విభాగానికి చెందిన డాక్టర్ పద్మజా షా "ది హూట్" వెబ్ సైట్ లో ఒక మంచి వ్యాసం రాసారు. దాన్ని మీరు కూడా చదవండి. ఆ సైట్ యు. ఆర్. ఎల్...
thehoot.org

5 comments:

Bala Subramanyam said...

Well written ramu.TV channels are mixing up NEWS and VIEWS.They are unable to differentiate between facts and hearsay info.It was indeed disgusting to c the way they are marketing their brand by collecting donations, relief material etc. They should realize that they must work hand in hand with the government which is the largest relief provider and its relief is unmatched.Perhaps they will show it as corporate social responsibility.
The electronic media is such a powerful tool and how well it can be used to bring in the aid to those who are the real victims.They should identify the most affected villages and the visuals should include the extent of damage and what kind of measures the government must initiate.Instead they have engaged helicopters, boats and in 1 channel somehow or other in Krishna district they have convinced some villagers to board the boat for sometime and then finally it seems that so called victims got off the boat as soon as the camera stopped rolling!!

Anonymous said...

రాము గారు...వరద వార్తలు దారుణంగా చూపించాయి ఈ తెలుగు చానెళ్ళు. నేనంటే నేను బాగా చూపిస్తున్నానంటూ చానల్స్ పోటీ పడ్డాయి. ఇంతకీ ఈ చానల్స్ పోటీ దేనికోసమో తెలుసా?- ఎవరం ఎక్కువ శవాలను చూపించాం? ఎవరం ఎక్కువ పంట నష్టాన్ని ఎంత బాగా చూపించామని. అదీ మేము బాగా ఏరియల్ వ్యులో పై నుండి శవాలను, వరద బీభత్సాన్ని అందరికంటే ముందుగా ప్రసారం చేస్తున్నామని కొన్ని చానల్స్ చావుల మధ్య సొంత డబ్బా వాయించుకున్నాయి.ఒక ఛానల్ అయితే ఏకంగా 'యక్స్ క్లుసివ్' అనే రాసుకుంది. నిజంగా అంత అతి అవసరమా? అసలీ ఛానెల్స్ పయనం ఎటు? రేటింగుల మోజులో పడి కనీస విలువలు మరిచి పోతున్నారు. ఇది దురదృష్టకరం.---సంగీత

Anonymous said...

రాము గారు...వరద వార్తలు దారుణంగా చూపించాయి ఈ తెలుగు చానెళ్ళు. నేనంటే నేను బాగా చూపిస్తున్నానంటూ చానల్స్ పోటీ పడ్డాయి. ఇంతకీ ఈ చానల్స్ పోటీ దేనికోసమో తెలుసా?- ఎవరం ఎక్కువ శవాలను చూపించాం? ఎవరం ఎక్కువ పంట నష్టాన్ని ఎంత బాగా చూపించామని. అదీ మేము బాగా ఏరియల్ వ్యులో పై నుండి శవాలను, వరద బీభత్సాన్ని అందరికంటే ముందుగా ప్రసారం చేస్తున్నామని కొన్ని చానల్స్ చావుల మధ్య సొంత డబ్బా వాయించుకున్నాయి.ఒక ఛానల్ అయితే ఏకంగా 'యక్స్ క్లుసివ్' అనే రాసుకుంది. నిజంగా అంత అతి అవసరమా? అసలీ ఛానెల్స్ పయనం ఎటు? రేటింగుల మోజులో పడి కనీస విలువలు మరిచి పోతున్నారు. ఇది దురదృష్టకరం.---సంగీత

Anonymous said...

మంత్రులు, అధికారులు మాత్రం మనుషులు కాదా? కొన్ని చానల్స్ దీని మీద కొన్ని సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే-- నిన్న కొన్ని చానల్స్ లో వరద సహాయక చర్యల గురించి చెపుతూ నల్గొండ జిల్లాలో కొందరు మంత్రులు, ఒక ఎం.పీ., అధికారులు భోజనం చేస్తున్న ఫొటోస్ చూపిస్తూ వాళ్ళు ప్రజలను పట్టించుకోకుండా చికెన్ తింటూ విందు చేసుకుంటున్నారనివిమర్శించింది.
అంటే... వరద సహాయక చర్యలలో పాల్గొనే వారు అన్నం నీళ్ళు మానేసి పని చేస్తెనె బాధితులను పట్టించుకున్నట్లా? లేకపోతే అన్నం మానేస్తే చాల బాగా పనిచేసినట్టని అనుకోవాలా? ఏమిటీ ఛానెల్స్ పైత్యం?

Satya said...

TV channels also competing with political leaders to gain popularity.They have been constantly using words like "as this channel told" "ws this channel advised " .... it is so pathetic to look for popularity in this need of the hour.I think the management of those channels would have some political aspirations and are trying to move their pawns in those lines.Some of the news I felt like a advertisement of that particular channel ,for every word and every sentence the anchor has pronounced ended with their channel name ..It is not a healthy sign and giving wrong signals in electronic media.One more thing as you mentioned in this blog ,as if they and their reporters only helped the victims and none other officers involved in relief activities.What are they going to gain out of it .I used to have good respect on that channel but after this flood and their presentations and the way they atried to exploit the situation is painful.This is bad culture is spreading to all other channels as it has started with one big channel and upcoming channels also have to adopt this strategy either to gain SEZ or political asylum.Too bad...Even the channels which have strong political grounds like Etv and Sakshi did not try in these lines..but so called news channels are now becoming their Views channels and trying to scrub their views and wishes to the people.I dont unserstand that how do they try for good society with different ambitions.I request these channels to stop selling their channel name again and again in the news..they are trying their best to help the victims but don't try to get publicity....

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి