Saturday, April 3, 2010

మిత్రులారా....పౌర జర్నలిజానికి స్వాగతం....

టెలివిజన్ ఛానెల్స్ లో, పత్రికలలో కనిపించే పెడ ధోరణులు, అపభ్రంశ పోకడల గురించి ఈ బ్లాగ్ లో ఘాటుగానే రాస్తున్నాం. ఇది ఆ యాజమాన్యాల మీదనో, ఆ పనులు చేస్తున్న విలేకరుల మీదనో వ్యక్తిగతంగా రాస్తున్నవిగా భావించనవసరం లేదు. తప్పు ఇదని స్పష్టంగా చెబితే...వాళ్ళు కాస్త ఆలోచించి సవరించుకుంటారని మా నమ్మకం. 

ఇలా వాళ్ళ చేతలు/ రాతలపై విసురుగా, సూటిగా రాసినప్పుడు...బాధ్యులు బాధపడి, కోప్పడి కామెంట్స్ లో తిట్టడమో, సుద్దులు చెప్పడమో చేస్తారు. దానికి మేము బాధపడం, భయపడం.  ఎందుకంటే...వారి వాదనకు కూడా స్పేస్ ఉండాలని మా ప్రగాఢ విశ్వాసం. సహజంగా ఎక్కువ శాతం మంది జర్నలిస్టులు....కాలి గోటి నుంచి, జుట్టు చివరి కొన వరకూ అహం, ఆగ్రహం ఉన్నవాళ్ళు అయివుంటారు కాబట్టి...ఏ విమర్శపైనా సదాలోచనతో స్పందించరు. పేరుపెట్టి తమ వాదన రాయరు. ఇది ఆ వృత్తి తెచ్చిపెట్టే 'శోభ'. అది అర్థం చేసుకోదగిన వ్యవహారమే.

అదలాఉంటే....ఎప్పుడూ ఈ ఛానెల్స్ పై మేమిద్దరిమే కన్నువేసి ఉంచడం కష్టం. కాబట్టి మీరు కూడా ఈ క్రతువులో కాస్త చెయ్యి వెయ్యండి. పేపర్ లో, టీ.వీ.ప్రసారాలలో మరీ దారుణం అనిపించినవి, సమాజానికి నష్టదాయకమైనవి, మీరు కుటుంబంతో కలిసి చూడలేనివి....మాకు తెలియజేయండి. వాటి మీది మరింత సమాచారం అందించడం లేదా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం చేస్తాం. అప్పుడు దాని మీద చర్చ జరుపుదాం. 


ఉదాహరణకు ఒక బ్లాగర్ గారు కోపంతో/ఆవేదనతో ఈ కింది మెయిల్ మాకు పంపారు. 

"I just saw a painful news in i-news, I guess.
A 6-year-old girl was abused by a 12-year-old boy.
These media idiots were asking about the incident to that 6-year-old girl. More than writing in our blogs, tell those rogues that "people are feeling pain.They don't want to see a small girl is being interrogated by these idiots."


మనసుకు గాయమైతే తప్ప ఎవరైనా ఇలా ఘాటుగా రాయరు. అలా స్పందించే హక్కు మనకుంది. నిజానికి ఇప్పుడు మీడియా వ్యవస్థ ఒక విచిత్ర దైన్య స్థితిలో ఉంది. ప్రొఫెషనల్స్ ఇందులో పుష్కలంగా ఉన్నారు, కానీ...జర్నలిజం తెలియని యజమానుల కింద వాళ్ళు నలిగిపోతున్నారు. కొందరు ప్రొఫెషనల్స్ డబ్బు కోసం బ్రష్టుపట్టి ఒళ్ళు బలిసి ఏడుస్తున్నారు. 
పెద్దసంఖ్యలో ఉన్న నిరక్షర కుక్షులైన అమాయక జనం వీరు చూపింది...చూస్తారు, ప్రభావం గట్రా వాళ్ళు పట్టించుకోరు. పనులు వదిలి...వాటిని పట్టించుకునే తీరిక వారికి లేవు.  కాబట్టి...కాస్త చదువుకున్న వారు, సదాలోచన పరులు స్పందించాలి. మీడియా అతిని అడ్డుకోవాలి. మెరుగైన సమాజం కోసం ఇది మీకు తప్పదు. ఇది మీడియాపై దాడి కాదు. సంకుల సమరం కానే కాదు. ఒక సత్యం కోసం పడే తపన. బాధ్యత కోసం పడే ఆరాటం. సమాజహితం కోసం చేసే పోరాటం. 

మిత్రులారా...ఇక మనం చేయబోయేది....పౌర జర్నలిజం. ఒక వ్యవస్థలో మంచి కోసం, సమాజ హితం కోసం పౌరులు చొరవతో ఉపక్రమించి అక్షర బాణాలు సంధించే మహత్తర బాధ్యతాయుత కార్యక్రమం ఇది. ఇది మీకు కచ్చితంగా ఆనందాన్ని, తృప్తిని ఇస్తుంది.
భావాలు/ అభిప్రాయలు దాచుకోకుండా తెలియజెయ్యండి. ఆయా కార్యక్రమాలు/ వార్తలు మీకు నచ్చకపోతే మాకు రాయండి. ఎప్పుడు/ఏ టైం లో, ఏ పేపెర్ లో/ ఛానల్ లో, ఏమి వచ్చింది, మీకు ఎందుకు నచ్చలేదో కారణాలు తెలియజెయ్యండి. ఒకవేళ కార్యక్రమం లేదా కథనం మీకు నచ్చినా కూడా  మాకు తెలియజెయ్యండి. చెడును ఎత్తిచూపినట్లే....మంచిని అభినందిద్దాం. మీరు రాసిన దాన్ని....యథాతథంగా పోస్ట్ చేయడానికి మాకు అభ్యంతరం లేదు. మా మెయిల్ అడ్రెస్: srsethicalmedia@gmail.com

10 comments:

Siva Maganti said...

hi,

Thank you very much for creating a place to express our feelings on the media. I wholeheartedly support this idea and feel this would give all the people a place to express their views on the trends going in media in the name of journalism.

Siva R M

venkata subba rao kavuri said...

word lo anu 7.0to type chaesi pampa vachchaa? naaku ilaa maartramae vachchu mari. english type raanamduna lekhini taditaraalanu viniyaegimchalaenu. javaabivvagalaru.

venkata subba rao kavuri

Anonymous said...

Your initiative in making the bloggers to take part in this gigantic task of clearing the pollution in the media and appreciating the best in it by sending their con
mments and views on the media are most welcome and hope our friends bring out the good bad and ugly of the media.

Vinay Datta said...

I second Siva Maganty ans Anonymous.

Anonymous said...

What about people who donot want to mention their name for their own reasons?

Ramu S said...

Hi
No problem, you may write without mentioning your name. Or, like 'Abrakadabra', you too may have a pen name or ghost name.
ramu

Anonymous said...

But when I mail from my ID, people will know who Iam. Not that I always want to reamin anonymous.

Anonymous said...

Ramu Garu,
It would be a nice effort if you can do some more analysis (if possible) when writing the articles and be more objective and analytical (rather than express anguish). I understand that it requires more time to do it but may be a worthy effort. you are highlighting the bad trends in today journalism (being a journalist) and your analysis would influence people to discard bad journalism and support good media sources.

Anonymous said...

Ramu Garu,
It would be a nice effort if you can do some more analysis (if possible) when writing the articles and be more objective and analytical (rather than express anguish). I understand that it requires more time to do it but may be a worthy effort. you are highlighting the bad trends in today journalism (being a journalist) and your analysis would influence people to discard bad journalism and support good media sources.

Ramu S said...

Dear Anonymous,
Don't worry about your identity. I'll scrupulously protect your identity. If you still have doubts, send your stuff through comments leaving the rest to me.
thanks for your time
ramu

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి