Wednesday, April 7, 2010

ఈ చక్రీయ రక్తపాతానికి అంతం లేదా?


పొరుగున ఉన్న ఛత్తీస్ గడ్ లో మావోయిస్టులు, వారి సానుభూతిపరులు దాదాపు 75 మంది జవాన్లను అత్యంత కిరాతకంగా చంపడం సహజంగానే అన్ని పత్రికలలో పతాక శీర్షిక అయ్యింది. 2008 జూన్ 29 న బలిమెల వద్ద గ్రేహౌండ్స్ పడవపై మెరుపు దాడి చేసి 38 మంది మెరికెల్లాంటి పోలీసులను హతమార్చిన మావోయిస్టులు ఇప్పుడు అంతకన్నా ఘోరంగా జవాన్లను మాటు వేసి మట్టుపెట్టారు. భారత చరిత్రలోనే మావోయిస్టులు భారత సైన్యం పై జరిపిన అతిపెద్ద, కిరాతక దాడి ఇది. 

దాడి జరిగిన తీరు చాలా భయానకంగా ఉంది. దాడిని, దానికి సంబంధించిన వార్తలను 'ఈనాడు' అద్భుతంగా అందించిందీ రోజు. చివరి పేజీలో...ప్రణాళికా సంఘం, నిపుణుల కమిటీ నివేదికలలోని ముఖ్యాంశాలను ప్రచురించి మంచి చర్చకు ఉపకరించే డాటాను ప్రజల ముందు ఉంచింది...'న్యూస్ టుడే ప్రత్యేక విభాగం.' అయితే...ఇంత ముఖ్యమైన ఘట్టంపై మన రాజకీయ నేతలు (జే.పీ. మినహా) స్పందించినట్లు మీడియాలో కనిపించలేదు.

తెలంగాణా అంశాన్ని గందరగోళ పరిచి వందల మరణాలకు కారణమైన మన్మోహన్-సోనియా-చిదంబరం త్రయం ఈ మావోయిస్టు అంశాన్ని కూడా జటిలం చేస్తున్నది. మతిమాలిన మాటలు, గప్పాలు, ఆచరణ యోగ్యంకాని  సవాళ్లు చేస్తున్న చిదంబరం సిగ్గుతో ఈ పరిణామానికి బాధ్యత వహించి రాజీనామా చెయ్యకపోవడం విస్మయకరం.

ఎవరు ఒప్పుకున్నా...ఒప్పుకోకున్నా...మావోయిస్టులకు ప్రజాబలం ఉంది. తెలంగాణా ఉద్యమం పోలీసుల చలవ వల్ల ఊపు అందుకున్నట్లే...ఈ పోలీసుల చర్యలే మావోయిస్టు ఉద్యమానికి ప్రజా బలం చేకూర్చి పెట్టాయి. గత పది పదిహేను ఏళ్ళుగా ఒక పధ్ధతి పాడూ లేకుండా...ఊళ్లలో బీభత్సం సృష్టించారు. అమానుషంగా నకిలీ ఎన్కౌంటర్ లకు పాల్పడి అమూల్యమైన వందల ప్రాణాలు బలిగొన్నారు. అటు మావోయిస్టులు తుపాకీ గొట్టం ద్వారా రాజ్యం సాధించడం ఎంత కల్లో, పోలీసులు నకిలీ ఎన్కౌంటర్ ల ద్వారా ఉద్యమాన్ని దెబ్బ తీయడం అంత కల్ల. ఇది ఒక మతిమాలిన పోరాటం.
అయితే...పోలీసులు ఫేక్ ఎన్ కౌంటర్ లో మావోల నేతలను చంపినప్పుడు చాలా మంది 'అయ్యో...' అంటారు. కానీ.. ప్రభుత్వ ధనంతో పనిచేస్తూ డ్యూటీ లో భాగంగా పోరాడే పోలేసులు, సైనికులు చనిపోతే సాధారణ జనం కూడా పెద్దగా బాధపడిన దాఖలాలు కనిపించవు. ఐ.ఎస్.ఐ. ఉగ్రవాదుల కన్నా ఎక్కువ మందిని పొట్టన పెట్టుకున్నది మావోయిస్టులే అయినా....ప్రజలు ఈ ఎర్ర సైన్యాన్ని ఆదరిస్తున్నారు. పోలీసు బాసులు ఇది అర్ధం చేసుకోవాలి. అవుట్ లుక్ పత్రిక లో అరుంధతి రాయ్ రాసిన దాన్ని చూస్తే.....ఈ రాజ్య వ్యవస్థ ఈ మావోఇస్టులను చిదంబరం అనుకున్నంత తేలిగ్గా రూపు మాపలేదు. మరేమిటి ఈ సమస్యకు పరిష్కారం? అన్న ప్రశ్న మన లాంటి సదాలోచన పరులను వేధిస్తుంది. 

దేశీయ తీవ్రవాదానికి చర్చలే పరిష్కారం అని అంతా నమ్మారు కానీ...వై.ఎస్.రాజశేఖర రెడ్డి నాయకత్వం లోని మొరటు ప్రభుత్వం చర్చలకు పిలిచి మావోలను దారుణంగా దెబ్బ తీసింది. చర్చలకు వచ్చిన వారిని చంపి...అది ఘన విజయంగా ఐ.పీ.ఎస్.లు భుజాలు చరుచుకున్నారు. దాన్ని ప్రభుత్వం కూడా సమర్ధించింది. ఇప్పుడు ఏ ప్రభుత్వం చొరవ చూపినా వారు చర్చలకు రారు...ఏపీ అనుభవం నేపథ్యంలో. 

మరి అలాంటప్పుడు...మావోఇష్టులు, పోలీసులు/ సైన్యం మధ్య నిరంతరాయ యుద్ధం అనివార్యం. మరింత రక్తపాతం తథ్యం. ఇది చక్రభ్రమణం లా సాగుతూ అమాయక ప్రాణాలను పొట్టన పెట్టుకుంటుంది. "వీలయితే...పోలీసులు, మావోలు కలిసి ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని ఒక పధ్ధతి ప్రకారం ఈ చెత్త, ప్రజా కంటక రాజకీయ నేతలను ముందు ఏరి పారెయ్యాలి...ఒక ఐదేళ్లపాటు. వాళ్ళు వాళ్ళు కొట్టుకు చావడం వల్ల ఒరిగేది ఏమీ లేదు," అని అబ్రకదబ్ర చెప్పిన దాంట్లో తప్పు ఏమీ లేదనిపించింది.  

రెండు పక్షాలూ 'ట్రిగ్గర్ హ్యాపి' రకాలే...కాబట్టి...వీరికి ఒకటే విన్నపం.
అయ్యా...మావోలూ...ఆ చంపేది ఏదో అవినీతి పరులైన నేతలను చంపండి. పొట్ట కూటి కోసం ఉజ్జోగంలో చేరిన జవాన్లను, పోలీసులను చంపకండి. 
అలాగే...ఇంప్రాక్టికల్ ఐ.పీ.ఎస్.లూ....చట్టాన్ని గౌరవించండి. దొరికిన వాడిని దొరికినట్లు చంపితే...మీకు ఆ అడవి మనుషులకు తేడా ఏమైంది? మావో ల నేతలు దొరికితే...కోర్టులో నేరారోపణ చేయండి. అప్పుడు...కొన్నాళ్ళకు మీ చిత్తశుద్ధి తో ప్రజల మనసులు గెల్చుకోవచ్చు. మీరు రాజకీయుల చేతిలో పావులై...వారి ప్రాణాలు కాపాడడమే ధ్యేయంగా పని చేస్తూ రక్తపాతం సాగించినన్నినాళ్ళు జనం మీ వెంట వుండరు.  మీ తుపాకికి, దొంగ కేసులకు భయపడి బైటికి చెప్పరు కానీ...జనం గుండెల్లో వాళ్లకు ఒక స్థానం ఉంది.

11 comments:

Anonymous said...

meeru porabadutunnaaru, janaallo maavo laku ippudu sthaanam lEdu. annalaku ippudu mana bhaadhalu pattinchukone antha theeerika ledu, vaalla baadhalu vaallavi. ika charchalaku pilichi agra nayakulanu champinchaaru ani motta modata saarigaa vintunnaanu. Daily naalugaidu news papers chadivinaa kuda miss ayyaanemo. dayachEsi aa chanipoyina naayakula pErlanu cheppagalaru. manishi gaa manam chEyyaalsindi maarana kaanda nu khandinchaDam, adi chEsindi police lu ayinaa, maoist lainaa.

Anonymous said...

baga rasarandi ..

WitReal said...

few of the past comments didnt get published. just wondering abt the censor rules!

Now, do you think, people sympathise with mao's in any of those alleged "fake" encounters?

if police action is the reason for the resurgence of naxals, then why naxals ran beyond the boundaries of AP?

who is "erra sainyanni aadaristunnaru"?

what are "mati maalina gappalu" of chidambaram, manmohan & sonia?

it'd've been good if you analysed a little bit more.

Should you blame the center or should you look at Buddha Vs Mamatha politics as the reason??

As the tolarence levels of the society comes down, fake encounters may get appreciated.

You may argue, but the "fake encounter" of acid attackers of Pranita has not been denounced by many

the vijayawada police were accused of fake encounter...but public was never critical about them

Same is the case with these Naxals now.

On a lighter note, Journo brothers are also riding down that path!!!
No sympathies for us too!!

Venkat said...

చాల బాగా రాసారు. ఇది చాలా క్లిష్టమైన వ్యవహారం, ప్రభుత్వం మరియు మీడియా జాగ్రత్తగా డీల్ చేయాలి.

కన్నగాడు said...

మావోలను చర్చలకు పిలిచి దెబ్బకొట్టగలిగారు అంటే అప్పటికే జనావాసాల నుండి మావోలకు ఆదరణ తగ్గిపోవటం ముఖ్యకారణం. ఆదరణ తగ్గడానికి కారణాలను అన్వేషిస్తే, అడవుల్లో ఉండే తండాలు మారుమూల గ్రామాల్లో అభివృద్ది(మహత్తరమైన అభివృద్ది కాకపోయినా) లాంటి వాటి వల్ల జనాల్లో ప్రభుత్వం ఒక విధమైన నమ్మకాన్ని ఏర్పరిచింది. అదంతా కొన్నేళ్ల శ్రమ. కాని చత్తీస్।ఘడ్ లో మావోలకి వ్యతిరేకంగా సల్వాజుడుంను ప్రోత్సహించడం అక్కడి ప్రభుత్వం చేస్తున్న దారుణమైన తప్పు. అంతో ఇంతో చదువుకొని ప్రంపంచఙానం ఉన్న సుశిక్షితులైన సైనికులే యుద్దాలలో అమాయకులపై దారుణాలకు ఒడగట్టిన సందర్భాలున్నాయి. అలాంటిది సల్వాజుడుం కార్యకర్తలకి తుపాకులిచ్చి వాటిని నక్సలైట్లపైనే ప్రయోగించాలి అంటే వింటారా.
నక్సలైట్లని నిర్మూలించాలి అంటే సామాజిక అసమానతలని కొంతైనా తగ్గించాలి. నక్సలిజం ఒక ఉద్యమం కాదు కొన్ని కోట్ల ప్రజల అసంతృప్తి.

కెక్యూబ్ వర్మ said...

బాగా చెప్పారు. http://sahacharudu.blogspot.com/2010/04/blog-post.html

SADASIVARAO said...

దెబ్బకు దెబ్బ అంతే! రాజకీయాలతో విసిగి వేసారిన వారే మావోయిష్టులు. వారూ ప్రజలలో అంతర్బాగమే సమస్య మూలాలను గ్రహించకుండా మొండి వైఖరితో వెల్తే పరిణామాలు యిలాగే వుంటాయి .కర్తవ్య నిర్వహణ కొరకు అన్యాయంగా బలైనది పోలీసులు .స్వతహాగ వారికి, వీరికి శత్రుత్వం లేదు కదా .ప్రబుత్వాలకు మావోల మద్య నలుగుతుంది డిపార్త్మెంటువారే ...ఇప్పటికైనా తప్పులను గ్రహించి పరిష్కార దిశగా అడుగులు వేస్తారేమో చూద్దాం ........సదాశివరావు .

Young Indian said...

మిత్రమా,
మావొల పోరాటం గురించి వారికి కొన్ని ప్రష్నలు మీ బ్లాగు ద్వార వేస్తున్నాను .......
1) ఎవరి కోసం , ఏ ప్రజల కోసం ఉద్యమిస్తున్నారు?
2) అభివ్రుద్ధికి దూరంగా ఆదివాసులను, గిరిజనులను ఎన్ని రోజులు ఉంచుతారు ? రోడ్లు వేయనీరు , బడులకు పంతుల్లను రానివ్వరు ఒకవేల వచ్చినా కూడ మీ పాఠా లే చెప్పమంటారు ..... వారందరిని మరింత అగ్నానంలోనే ముంచెత్తడమేనా మీరు కోరుకునే మార్పు
3) భారత రాజ్యంగం మీద మీకు విష్వాసం ఉండదు...ఎన్నికలలను భహిష్కరిస్తారు...కాని మీకేమైన అయితే మీకు, మీ బాకాలకు అర్జెంటుగా రాజ్యాగం, మానవహక్కులు గుర్తుకువస్తాయి .....ఇది ఎంతవరకు సమంజసం? ఏమి ద్వంద వైఖరీ ?
4) నరమేధం చేయడం తప్ప ఎక్కడైనా మార్పు తెచ్చరా ? తాను ఎన్నుకున్న పంథా తప్పు అని మీ అదిగురువులో ఒకరైన కానుసన్యాల్ నెత్తి నోరు కొత్తుకోలేదా
5) నూతన ప్రజ్యాస్వామ్యం తెస్తాం అంటారు కాని మీ వ్యతిరేఖులను ఖతం చేస్తారు.. మీరు తెచ్చేది నూతన ప్రజ్యాస్వామ్యమా లేక నూతన నియంతుత్వమా

Anonymous said...

the irony is that, most of the senior communist leaders, maoists are Brahmins...

the so called elite class of India...

Unknown said...

యంగ్ ఇండియన్ గారూ చాలా బాగా చెప్పారు

Anonymous said...

http://netibhaaratham.blogspot.com/2010/04/blog-post.html

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి