Saturday, April 17, 2010

మీడియా సానియా మేనియా వల్ల నష్టం ఇంతింత కాదయా!

"ఛానెల్స్ వాళ్ళు ఇష్టంవచ్చిన మసాలా ప్రోగ్రామ్స్, ప్రజా సంక్షేమం పట్టని కార్యక్రమాలు చూపించడం వల్ల జరిగే నష్టం ఏమిటి?" అన్న ప్రశ్న సిల్లీగా అనిపించవచ్చు కానీ...అది ఎంతో కీలకమైనది. రేటింగ్స్ కు, వ్యాపార ప్రకటనలకు సంబంధం ఉంది కాబట్టి...మేము ప్రజల మదిని దోచే/ వారిని రంజింపజేసే కథనాలు ప్రసారం చేయడంలో తప్పు ఏమిటని ఛానెల్స్ సీ.ఈ.వో.లు అంటారు. సినిమా వాళ్ళ మాదిరిగా..."జనం చూస్తున్నారు...మేము చూపుతున్నాం..." అన్న వితండ వాదన చేస్తారు.
 

ఇటీవల మీడియా, ముఖ్యంగా, ఛానెల్స్, మరీ ముఖ్యంగా TV-9, సానియా మానియా లో పడి కొట్టుకోవడం వల్ల కనిపించని నష్టం చాలా జరిగింది. ఇది ఎవ్వరూ పూడ్చలేని నష్టం. సానియా పెళ్లి ప్రకటన చేసిన రోజు నుంచి...ఛానెల్స్ వెర్రి ఎత్తినట్లు ఆ వార్త వెంట పడడం వల్ల కనీసం నాలుగు  ముఖ్యమైన అంశాలు మరుగున పడ్డాయి. ఒక వ్యక్తి పెళ్లి విషయంలో తలదూర్చి...ఆమె ఈసడించుకుంటున్నా...ఆమెకు కవరేజ్ ఇవ్వడం వల్ల జరిగిన నష్టం అపారం. అవి.....

ఒకటి) దంతేవాడ మృతవీరులు స్మరణకు నోచుకోలేదు. ఒక నక్సల్ మరణిస్తే...కనీసం మూడు మానవాసక్తికర వార్తలు ప్రచురించే మీడియా 76 మంది వీర సైనికులకి సంబంధించి కనీసం డజన్ వార్తలైనా ఇవ్వలేదు. ఎలెక్ట్రానిక్ మీడియా పూర్తిగా వీరిని విస్మరించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో...శాంతి స్థాపన కోసం బయలుదేరిన సైనికులు దారుణంగా హత్యకు గురైతే...ఇది మీడియాకు పట్టదా? అన్న ప్రశ్న సహేతుకమైనది. 


ఇలాంటి ఊచకోతలో, మరొక పెద్ద పరిణామాలో జరిగినప్పుడు ప్రజలలో నిర్దిష్ట అభిప్రాయాలు ఏర్పడతాయి. ఈ సంఘటనల కవరేజ్ వల్ల ప్రజలలో ఒక చర్చ జరుగుతుంది, అది వారిలో అనుకూల/వ్యతిరేక అభిప్రాయం ఏర్పడడానికి దారి తీస్తుంది. అది ప్రజాస్వామ్యానికి కీలకమైనది. ఇప్పుడు మీడియా
సానియా పిచ్చిలో పడి దంతేవాడ ఘటనను విస్మరించడం వల్ల...స్వతంత్ర భారత చరిత్రలో మావోయిస్టు లు సృష్టించిన అతిపెద్ద రక్తపాతం...తేలిగ్గా కనుమరుగు అయ్యింది. మావోల సిద్ధాంతం మంచిదా? కాదా? అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. బాధ్యతాయుతమైన విలేకరులం.... నక్సల్స్ గురించి బాగా పట్టించుకుని.... ట్యాక్స్ పేయర్స్ సొమ్ముతో పనిచేస్తూ హత్యకు గురైన వారిని విస్మరించడం మన మౌలిక సూత్రమైన నిష్పాక్షికతను దెబ్బ తీయడం కాదా?

రెండు) మీరంతా...సానియా పెళ్లి పిచ్చిలో పడి...ఛీ.ఛీ.పొమ్మన్నా...తాజ్ క్రిష్ణ బైట కూర్చొని గంటల కొద్దీ సమయాన్ని దీనికి కేటాయించడం వల్ల మరొక పెద్ద ఘోరం జరిగింది. ఒక అమ్మాయి మీద రాష్ట్రంలో జరిగిన యాసిడ్ దాడి సరిగా కవర్ కాలేదు. ఒకప్పుడు...యాసిడ్ దాడి అన్ని పత్రికలకు, ఛానెల్స్ కు ప్రధాన వార్త. మీడియా సృష్టించిన ప్రజాభిప్రాయానికి రెచ్చిపోయి...ఒక ఎస్.పీ. చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఏకంగా ముగ్గురు యువకులను పిట్టల్లా కాల్చిపారేసాడు కూడా. ఇప్పుడు ఒక యువతి అదే దాడికి గురైతే...మీరు, మీ రిపోర్టర్ గణం బిజీ గా వుండడం వల్ల ఆ అమ్మాయికి న్యాయం జరగలేదు. ఆమెపై దాడి చేసిన వారు ఏ మాత్రం ఒత్తిడికి గురికాలేదు. ఇదే ధోరణి సాగితే...యాసిడ్ దాడులు పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదన్న సామూహిక భావనను మీడియా ప్రజలలో చొప్పించినట్లు అవుతుంది. తెలుగు బూతు సినిమాలు, టీ.వీ.ల బాధ్యతారాహిత్యం వల్లనే ఆడపిల్లలపై అఘాయిత్యాలలో ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో ఉందని మా ప్రగాఢ విశ్వాసం.

మూడు)  సానియా హడావుడి జరుగుతున్నప్పుడే....హైదరాబాద్ నగరంలో పలు చోట్ల పట్టపగలు చోరీలు జరిగాయి. ఇది నగర పౌరులకు చాలా ముఖ్యమైన విషయం. ఈ దొంగతనాలలో ఒక ప్యాట్రన్ ఉంది. మీడియా దీని గురించి పట్టించుకోకపోవడం వల్ల కనిపించని నష్టం జరిగింది.

నాలుగు) మీడియాలో చాలాభాగం సానియా షాదీకి కేటాయించడం వల్ల....రాష్ట్రంలో వడదెబ్బ మృతులు సరిగా కవర్ కాలేదు. ఇప్పటికే కనీసం 50 మంది వేసవి వల్ల ప్రాణాలు కోల్పోయారు. సానియా పెళ్లి బాజాల మోతలో ఈ చావులు చాలా అప్రధానమై పోయాయి.

మీడియా బాసులు...ఈ అంశాలు ఆలోచించాలి. సానియా వార్త ఇవ్వకూడదని ఎవ్వరూ అనరు. కానీ....వెర్రి పోటీలో పడి స్వీయ నియంత్రణ లేకుండా....ఇలాంటి అంశాలకు మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మిగిలిన వార్తలకు అన్యాయం జరిగింది. వ్యాపారంతో పాటు ప్రజాహితం కూడా పరమావధి కావాలి. మీడియా సంఘ సేవ లాంటిది అన్న స్పృహ అలవరుచుకుంటే...సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది.

19 comments:

Saahitya Abhimaani said...

ప్రభుత్వ ఆధ్వర్యంలో...శాంతి స్థాపన కోసం బయలుదేరిన సైనికులు దారుణంగా హత్యకు గురైతే...ఇది మీడియాకు పట్టదా?

I think the reason for this is rampant leftist orientation among the media persons and not because some other news is being covered. Even if there is no other news, media generally ignores the death of Police Men as against encounter deaths. It is a reality.

Anonymous said...

అసలు దంతెవాడ దుర్ఘటన నుండి ప్రజల దృష్టిని మళ్ళించేందుకే మీడియా సానియా భజన మొదలెట్టింది అని నేను అనుకుంటున్నాను. అంతే గాకుండా ఆ దుర్ఘటనలో ప్రజల సానుభూతి పోలీసులకు దక్కకుండా మీడియానే సైంధవ పాత్ర పోషించింది

సుబ్బారావు said...

రామూ గారూ,
మీ వాదన బాగుంది. ఇక్కడొక విషయంలో స్పష్టత పాటిస్తే మీకు మీడియా మద్దతు దొరుకుతుంది. మీ ప్రశ్నలన్నీ ఆయా ఛానళ్ళూ, పత్రికల విధాన నిర్ణేతలను అడగాల్సినవి. వారిలో ఎంత శాతం మంది ఈ బ్లాగు చదువుతారు? చదివే వాళ్ళంతా సదరు బాసులు ఏం కవరు చేయమంటే అది కవరు చేసే వాళ్ళే కదా. అంచేత విధాన నిర్ణేతలకు ఈ ప్రశ్నలు చేరేలా ఏదైనా మంచిమార్గం చూడండి.

ఒక అనధికారిక అంబుడ్స్మన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. తప్పుడు వార్తలు, ఒకరికి అనవసరంగా పరువునష్టం కలిగించే వార్తలు, వివరణ అడగకుందా వ్రాసే వార్తలు వీటిని సహేతుకంగా ప్రశ్నిస్తూ బాధితుల తరుపున వాదనను వినిపించడానికి.
అసలు ఇది సాధ్యమే అనుకుంటే ఆచరణాత్మక ప్రణాళిక రూపొందించవచ్చు.

అసలు వార్త ఉంటుందో లేదో తెలియకుండా గంటల తరబడి గుమ్మాల దగ్గర నిలబడ్డ విలేకరుల కష్టాలు, వాళ్ళ మీద ఫోనుల్లో బాసులు చలాయించిన జులుంలు, పక్కవాడు ఏదో ఒకటి వాగుతున్నాడు కనుక నువ్వూ వాగు ఆ మాత్రం చేతకాదా అని హేళన చేయడాలూ వీటి గురించి ప్రస్తావించండి సార్. మీ బ్లాగు టపాల్లో ఈ మానవీయకోణమేదీ? దీనికి పేర్లూ, చిరునామాలూ అవసరం లేదు కదా? అప్పుడు కదా మీడియాగొట్టాల వాళ్ళ మానసిక పరిస్థితులు మామూలు వాళ్ళకు తెలిసేదీ. లేకపోతే అక్కడ పడిగాపులు పడినవాళ్ళంతా వాళ్ళంతటవాళ్ళు అక్కడ ఉన్నారనే భావన రావడం లేదూ. కేవలం పొట్టకూటికోసం ఉన్నారు సార్. కెమెరాల ముందూ వెనుకా ప్రదర్శించే ఉత్సాహమంతా నటన కాదూ.

సుబ్బారావు said...

రామూ గారూ, మీరు టపా చివరిలో బాసులనుద్దేశించే ముగింపు ఇచ్చారు. నేనే సరిగ్గా చదవలేదు. అయినా నా వ్యాఖ్యలో మిగతాభాగం గురించి గంభీరంగా ఆలోచించగలరని ప్రార్థన.

సుబ్బారావు said...

రామూ గారూ, మీరు టపా చివరిలో బాసులనుద్దేశించే ముగింపు ఇచ్చారు. నేనే సరిగ్గా చదవలేదు. అయినా నా వ్యాఖ్యలో మిగతాభాగం గురించి గంభీరంగా ఆలోచించగలరని ప్రార్థన.

Anonymous said...

There were many coverages similar to Sania mania in the past by some of the channels which were irritating to the viewers as the decision making editors have lost touch with the pulse of the people.During any encounter of Maoists some of the channels create much hulchul by taking interviews and having discussions with the dubious civi rights movement and human rights and other extremist supporting organisation leaders questioning the encounter and blaming the police for the death of Maoists who have been sucking the blood of the citizens for their selfish agenda which has future.As rightly pointed by shiva there is some hidden extremist mind set among the the reporters and editors of these channels as they never bother to think of the dangers of Maoists to the country.

JP.

Anonymous said...

hai Sir,
Rayalani anukunte ennaina mee kante samajam gurinchi viluvala gurinchi neenu chala baga raasta. kani meeroka vishayam gurtunchukovali... vimarshalu, deppipodavadalu ivvanni vinadaniki bavuntai

Anonymous said...

What a great news to cover! India does not apparently have any other news, issues and problems.

- Dantewada is an issue which includes only few million people and most of them are adivasis not rich and obviously not glamorous.

- Dabates on what people think about separate states. Yah lets not get into those issues and bring troubles.

Lets see where rahul gandhi is visiting these days and which restaurants is he going to - wow great news there!! make a program on that...

One more subject - yedu khandala vadu(lord venkateshwara in america) People in usa also watch it- very innovative - people would love it - great program!!

Who said india is full of problems...only few internal security threats..only few million displaced people..and only few billion under poverty line

Sania ruined her career and never could concentrate on tennis any longer but gave a good topic to spend for few weeks to this kind of media.

I dont want to get into an argument whether it is of any importance but yes certainly which saadi is she wearing for her marriage is very important for india!

People in responsible positions need to have this sense not only the sense of being in top rank!

Somebody said it right! people get the media they deserve! Keep it in the top rank for our better future!And let the people run away from problems india(they) is facing today into the world of imagination ,wealth and dreams.

Venkat.

bobby said...

i totally disagree wit the opinion of anonymous that people get the media they deserve
some stories are thrust on people
i have often seen that any channel which does some lead story on a particular on a particular aspect immediately all the channels will follow blindly as if there is no other news
all those concerned persons at the channels have forgotten basic fact that no viewer would like to see the same story in all the channels except that if it is national importance
the biggest example is syamala aunty story in all the channels

she has been giving all distorted versions about jogini vyavastha which is condemned by all human organisations
what kind of message these channe
ls are giving by glorifying jogini system which is more in human and barbaric
the media is a responsible organ of society
they can not take shelter under the premise that we showing what people are enjoying .
they cannot show what the people of society cannot afford towatch and which illeagal immoral and unethical

కన్నగాడు said...

మీరు సరిగ్గానే అడిగారు కానీ అది సరైన వాళ్ళదాకా వెలుతుందన్న నమ్మకం లేదు. ఈ రోజు బి.బి.సి. న్యూస్ ఛానల్లో(యూకే) ఒక విస్మయం కలిగించే కార్యక్రమం చూసాను. దాని పేరు న్యూస్ వాచ్, దానిలో వారం మొత్తం ప్రసారాల గురించిన ప్రేక్షకుల అభిప్రాయాలను ఈమెయిలు ఉత్తరాల ద్వారా పరిశీలించిన సదరు యాంకరు సంబంధిత ఉద్యోగులని వివరణ కోరారు.
ఉదా: శనివారం నాడు విమాన ప్రమాదంలో పోలండు అధ్యక్షుడు మరియు అనేక మంది ఉన్నత సైనికాధికారులు మరణించారు, శనివారమంతా ఆ వార్తను అందించిన బిబిసి, ఆదివారం నాడు ఆ వార్తకు సంబంధించిన ఫాలో-అప్ ని వార్తల్లో రెండో వార్తగా చెప్పారు(మొదటి వార్త జనరల్ ఎలక్షన్లకు సంబందించి పార్టీలు విడుదల చేసిన మేనిఫేస్టో) అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందని ప్రేక్షకులు నిలదీస్తే సంబంధిత అధికారిణి స్టూడియోకొచ్చి వివరణ ఇచ్చుకున్నారు.
ఇలాంటి సంస్కృతి అలవడితే మంచి వార్తలు తప్పిపోవు.

Ramu S said...

సుబ్బారావు గారు,
విలేకరులు, సిబ్బంది ఇబ్బందులు గతంలో రెండు రాసాను. మీరు చదివినట్లు లేరు.
రవిప్రకాష్, శైలేష్, కందుల రమేష్ వంటి వారికి ఈ పోస్టులు వెళుతున్నాయి. వారి మెయిల్ బాక్స్ లో ఇవి చేరే ప్రయత్నం చేస్తున్నాం.
అయినా...వారు చూడడం లేదని నా అభిప్రాయాలు రాయడం ఆపను. మీడియా ధోరణితో విసిగిన ప్రజల చర్చకు ఈ బ్లాగ్ వేదిక. ప్రయోజనం ఇప్పుడే రాదు.
కొంచెం ఓపిక పట్టండి
రాము

Saahitya Abhimaani said...

కన్నగాడు గారూ,

మంచి విషయాన్నీ చెప్పారు. బి బి సి ఎక్కడ మన కాలవోడ్డు ఛానళ్ళు ఎక్కడ. అటువంటి కార్యక్రమం కనుక మన చానేళ్ళల్లో చేస్తే ఒక్కడే వాటన్నిటికి సమాధానం చెప్పాలి, సి యి ఓ అని చెలామణి అవుతున్న మోతుబరి ముఠానాయకుడు. అడపా దడపా ఎవరన్నా రిపోర్టరు కెమెరా మనిషిని సంజాయిషీ అడిగే ఆవకాశం ఉన్నది. అప్పుడు మనం ఎక్కువగా అడగాల్సినది, ఈ విషయ అస్సలు ఎందుకు చూపటం లేదు అని.

క్యాచ్ 22 పరిస్తితి ప్రస్తుతం మనం అనుభవిస్తున్నది, చూస్తున్నారు కాబట్టి చూపిస్తున్నాం అని చానెళ్ళు, చూపిస్తున్నారు కాబట్టి చూస్తున్నాం అని జనం. మార్పుకి ఆవకాశం ఏది.

వీటన్నిటికి మందు ప్రేక్షక నిరాదరణ, సత్వర స్పందన ఉండాలి. ఏది అటువంటి ప్రక్రియ?? నాకు నచ్చని కార్యక్రమం చూడగానే నేను వెంటనే ఇ మెయిలు అటువంటి చానెల్ కు ఇస్తాను. ముంబాయి దాడుల సందర్భంగా మీడియా దేశద్రోహ కవరేజీని మొట్టమొదటగా ఖండించి (తెల్లవారుఝామున మూడు నాలుగు మధ్య) అన్ని ఇంగ్లీషు చానెళ్లకు చెంప పగిలిపోయే మైళ్ళు ఇచ్చిన వాళ్ళల్లో నేనొకడిని. "ఎవరి పక్కరా మీరు పని చేస్తున్నది"? అని గద్దించి అడిగాలిసి వచ్చింది ఆ బాధ్యత లేని సజ్జుని. తెల్లారినాక కొంతసేపటికి మీడియా వాళ్ళు తెప్పరిల్లి ఆపరేషనల్ వివరాలు చూపకండి అని లైవులో వాళ్ళ రిపోర్టర్లకు చెప్పటం మొదలెట్టారు. అప్పటికే జరగవలసిన ఘోరాలు జరిగిపోయ్యాయి. మేము చూపించిన వాటివల్ల అయినాయా అని ఎదురు అడిగిన చానెళ్ళు లేకపోలేదు, కాని వాళ్లకు తెలుసు ఏమి జరిగిందో కాని చేప్పరు, కారణం వాళ్లకి అనువుగా లేని విషయం కదా

చూసే వాళ్ళం మనకు నచ్చని విషయాన్ని వెను వెంటనే ఒక మెయిలు ఇవ్వటమో ఒక సాదా పోస్టుకార్డు మీద రెండు వ్యాక్యాలు వ్రాసి పంపటమో చెయ్యాలి.ఏ చానేలు కన్నా ఒక కార్యక్రమం అయ్యేప్పటికి ఒక పదివేలు మైళ్ళు వాళ్ళ ధోరణిని నిరసిస్తూ కనుక వస్తే, మళ్ళి అటువంటి ప్రోగ్రాం చేసే సాహసం చేస్తారా. ఇంకొంచెం ముందుకెళ్ళి, అటువంటి చెత్తను స్పాన్సర్ చేసిన కంపెనీకి కూడా, ఇలాంటి చెత్తను స్పాన్సర్ చేసి మీ ప్రకటనలు చూపిస్తున్నారు కాబట్టి, మీ ఒస్తువులు కూడా చేత్తే అయ్యి ఉంటాయి, మేము కొనము లేదా ఇవ్వాల్టి నుంచి కొనటం మానేస్తున్నాము అని ఒక రెండువేలు మైళ్ళు వెడుతూ ఉంటే, ఏ కంపెనీ వాడు అలాంటి చెత్తని స్పాన్సర్ చేస్తాడు. కొంత బాధ్యతా మనకి కూడా ఉన్నది.

ఎంతటి బుల్లి కాని రౌడీ కాని కొద్దిగా ప్రతి స్పందన ఎదురైతే ఒక్క అడుగన్నా వెనక్కి వేస్తాడు. ఈ విషయం మన పాఠక/ప్రేక్షక జనానికి తెలియక కాదు, "మనకెందుకువచ్చిన పెంట" అన్న నిర్లిప్తతా భావం, దానికింద అసలు కారణం "భయం" ఎవడన్నా ఇదిచూసి మన్ని ఎమన్నా చేస్తాడేమో అని. ఇటువంటి గొర్రెగుంపు సంస్కృతి మారి ఒకచెంప కొడితే రెండో చెంప చూపకుండా వాడి రెండు చెంపలూ వాయింఛి వదిలే పరివర్తన వస్తే సమాజంలోని అనేకానేక రుగ్మతలు, ఒక్క చెత్త మీడియానే కాదు ప్రకటనా మాఫియానే కాదు అన్నీ, మాయమవుతాయి.

Srikanth said...

సర్, నేను ఇండియా బయట ఉన్నప్పటికీ అప్పుడప్పుడు తెలుగు లైవ్ న్యూస్ చూస్తూ ఉంటాను. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఇది చాల సిల్లీగా అనిపించోచు. మీడియాలో వస్తున్నా వార్తలు చాల మందిలో అసంతృప్తిని కలిగిస్తున్న మాట వాస్తవం. మీరు అటువంటి వార్తలను ఖండిస్తూ మా వాణిని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇంకా ఇతరత్రా ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలుస్తోంది. కాని ప్రజల్లో ఉన్న అసంతృప్తిని/నిరసనను మీడియా యజమానులకి తెలియజేయడానికి మనం ఏమి చెయ్యవచ్చో ఆ వైపు కొన్ని టపాలు రాయాలని కోరుకుంటున్నాను.

నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఇది చాల సిల్లీగా అనిపించొచ్చు. మీ టపాలు చాల మంది చదువుతున్నారు. ఏదైనా విషయంపై మీడియాలో వచ్చిన కధనానికి స్పందనగా మనం అందరం ప్రతిస్పందిచడానికి వీలుందా? ఇప్పుడైతే మీ లాంటి కొంతమందె ప్రతిస్పందిస్తున్నట్టు అనిపించొచ్చు మీడియా యజమానులకి. కాని మాక్కూడా వారి కాంటాక్ట్స్ తెలియజేస్తే మేము కూడా మంచి వార్తకి మంచిగా, చెత్త వార్తలకి కటువుగా స్పందించే అవకాశం ఉంటుది. మీ ప్రతిస్పందన తెలియజేయగలరు.

Srikanth said...

సర్, నేను ఇండియా బయట ఉన్నప్పటికీ అప్పుడప్పుడు తెలుగు లైవ్ న్యూస్ చూస్తూ ఉంటాను. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఇది చాల సిల్లీగా అనిపించోచు. మీడియాలో వస్తున్నా వార్తలు చాల మందిలో అసంతృప్తిని కలిగిస్తున్న మాట వాస్తవం. మీరు అటువంటి వార్తలను ఖండిస్తూ మా వాణిని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇంకా ఇతరత్రా ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలుస్తోంది. కాని ప్రజల్లో ఉన్న అసంతృప్తిని/నిరసనను మీడియా యజమానులకి తెలియజేయడానికి మనం ఏమి చెయ్యవచ్చో ఆ వైపు కొన్ని టపాలు రాయాలని కోరుకుంటున్నాను.

నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఇది చాల సిల్లీగా అనిపించొచ్చు. మీ టపాలు చాల మంది చదువుతున్నారు. ఏదైనా విషయంపై మీడియాలో వచ్చిన కధనానికి స్పందనగా మనం అందరం ప్రతిస్పందిచడానికి వీలుందా? ఇప్పుడైతే మీ లాంటి కొంతమందె ప్రతిస్పందిస్తున్నట్టు అనిపించొచ్చు మీడియా యజమానులకి. కాని మాక్కూడా వారి కాంటాక్ట్స్ తెలియజేస్తే మేము కూడా మంచి వార్తకి మంచిగా, చెత్త వార్తలకి కటువుగా స్పందించే అవకాశం ఉంటుది. మీ ప్రతిస్పందన తెలియజేయగలరు.

Ramu S said...

శ్రీకాంత్ గారు..
అన్ని చానల్స్ యజమానులు, సి.ఈ.ఓ.ల కాంటాక్ట్ నంబర్లు, మెయిల్ ఐ.డి.లు సాధించే పనిచెయ్యాలి శ్రీకాంత్ గారూ. ఆ పని చేసి ఒక రోజు పోస్ట్ చేస్తాను. అప్పుడు పిచ్చి కార్యక్రమాలపై వాళ్ళను దూదేకుతూ మెయిల్స్ పంపవచ్చు.
రాము

Anonymous said...

శివగారి ఆలోచన బాగుంది. శ్రీకాంత్ గారి సలహా బాగుంది. రామూగారూ మీ పోస్టు కోసం ఎదురుచూస్తూ ఉంటాము. సిఈవో ల అడ్రస్సులు తర్వాత ఇవ్వొచ్చు. ముందు ఆయా ఛానళ్ళకు జనరల్ ఒక అడ్రస్ ఉంటుంది కదా. దాదాపు అన్ని ఛానళ్ళూ పత్రికలూ మొన్నామధ్య టోల్ ఫ్రీ నంబర్లు మీకు జరుగుతున్న అన్యాయాలను తెలియజేయండి అంటూ ఇచ్చాయి కదా. వాటిని ఒక చోట చేరుద్దాం, తర్వాత సీఈవోల పర్సనల్ ఐడీలూ,నంబర్లూ సంగతి చూడొచ్చు ఏమంటారు.

Vinay Datta said...

What Srikanth said is right. But I think it would be effective if all the mails and messages are passed through one source. For example, this particular post can be a source in collecting the response on various programmes by creating a response form that has short answers like good...better...nonsensical...meaningless...useful...useless...etc.
It can then be convenient for many people to quickly click on their choice.

Rajendra Devarapalli said...

మిసిమి మాసపత్రికలో 1996-97ప్రాంతాల్లోనే నేనొక వ్యాసం రాసా,అందులో పత్రికలవారికి పాఠకులు,ఈ ఛానళ్ళవారికి ఉత్తరాలు,ఇ-మెయిళ్ళు పంపే పద్ధతులగురించి.పెద్దలు,మేధావులూ మెచ్చుకున్నారు కానీ..ఒక్కడగూ ముందుకు పడలేదు.ఆమధ్య బ్లాగుల్లో నేను కొన్ని ఛానళ్ళ ఇ-మెయిల్ అడ్రసులిచ్చాను,అలాగే కొణతం దిలీప్ గారు కూడా కొంతప్రయత్నంచేసారు.ఇప్పుడాయన వేరే పనుల్లో బిజీ అనుకుంటాను.

Vinay Datta said...

@Devarapally :

96-97 was a period when people were still new to satellite television. For a few years, people stopped attending good cultural programmes just to bask in the new colous.And I think the programmes then were better than the present ones. Moreover, there were no full fledged news channels.

Times have changed. If you can srite a similar article now and make it available in this blog also, you'll definitely witness ANEKA MUNDADUGULU.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి