Tuesday, April 27, 2010

అనుక్షణం క్షోభ పెడుతూ...ఒక జర్నలిస్టుపై 'ఈనాడు' ప్రతాపం

జర్నలిస్టు అంటే...అన్యాయాన్ని ఎదిరించేవాడు...హక్కుల కోసం వాదించేవాడు.
జర్నలిస్టు అంటే...న్యాయం కోసం తపనపడేవాడు...
జర్నలిస్టు అంటే...సత్యం కోసం అన్వేషించేవాడు...
జర్నలిస్టు అంటే...సత్యం, న్యాయం కోసం హింసను భరించేవాడు...
జర్నలిస్టు అంటే...ఒంటరి పోరాటానికి వెరవనివాడు...


---ఇదిగోండి...ఇలాంటి జర్నలిస్టు ఒకడు పొరుగున ఉన్న ఒరిస్సా గడ్డపై ఒక సంస్థ చేతిలో హింసలు భరిస్తున్నాడు. ప్రాణభయంతో తెగించి ఒక వ్యవస్థపై పోరాడుతున్నాడు...అదీ తన తోటి వారి మేలు కోరి. ఆ సంస్థ, ఆ వ్యవస్థే.... 'నిత్యం ఉషోదయంతో సత్యం నినదించు గాక' అని చెప్పుకునే 'ఈనాడు.'

"నాకు ఇది బ్రిటిష్ రాజ్ లో లాగా...ఏకాంత ద్వీప శిక్ష. మెంటల్ టార్చర్. అయినా నో ప్రాబ్లం. నా చివరి క్షణం వరకూ ఎన్ని బాధలు ఓర్చుకుని అయినా నా పోరాటం సాగిస్తా. మనసిన వేజ్ బోర్డు కింద సంస్థ నుంచి దాదాపు వెయ్యి మందికి నాలుగేసి లక్షల చొప్పున అందాల్సిన డబ్బు వచ్చే వరకూ నేను విశ్రమించను," అని ఆ జర్నలిస్టు అంటున్నారు. 

'ఈనాడు' తో నిత్య పోరాటం కావడం వల్ల కుటుంబంలో మనశ్శాంతి కరువయ్యింది. అతని భార్య రెండో సారి...గర్భంలో శిశువును కోల్పోయింది. ప్రాణ భయంతో ఒరిస్సా పోలీసులకు, ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సంఘానికి పిటిషన్స్ పెట్టుకోవాల్సిన దుస్థితి. హక్కుల కోసం వాదిస్తున్న ఈ జర్నలిస్టు తీవ్ర వేధింపులకు గురవుతున్నాడు. అన్యాయాలను ఎదిరించే మనం నోరు, కళ్ళు మూసుకుని...గుండె కు 'ఆల్ ఈజ్ వెల్' అని జోకొడితే...ఇంతకన్నా ఆత్మవంచన ఉండదు. జర్నలిస్టు అని చెప్పుకునే వాళ్లకు ఈ కేసు ఒక సవాల్.

అతని పేరు గడియారం మల్లిఖార్జున శర్మ. ఇతనిది అనంతపురం జిల్లా. ప్రముఖ రచయిత, శాసనకర్త గడియారం రామకృష్ణ శర్మ గారికి దగ్గరి బంధువు. 1995 లో 'ఈనాడు జర్నలిజం స్కూల్' లో డిప్లొమా పొందాడు. 2000-2007 మధ్య వరంగల్ లో పనిచేస్తున్నప్పుడు ఇతని పనితీరును కిరణ్ (రామోజీ గారి కొడుకు, 'ఈనాడు' ఎండీ) మెచ్చుకున్న దాఖలాలు ఉన్నాయి. 2007 లో కర్నూలు యూనిట్ లో ఇతను సబ్-ఎడిటర్ గా ఉన్నప్పుడు సెల్ ఫోన్లు తీసుకుని ఆఫీసుకు రావద్దని యాజమాన్యం ఆదేశించింది. "సెల్ ఫోన్స్ లేకుండా ఉండమంటే ఎలా అని ప్రశ్నించాను. అదే సమయంలో ప్రమోషన్స్ గురించి అడిగాను. అక్కడ మొదలయ్యింది...వేధింపుల పర్వం," అని శర్మ ఒక సుదీర్ఘ ఇంటర్వ్యూలో చెప్పారు. 

ప్రశ్నించే వాడిని వేధించే అలవాటు ఉన్న 'ఈనాడు' వెంటనే శర్మను 2008 జూన్ లో శ్రీకాకుళం బదిలీ చేసింది. ఆ మరుసటి సంవత్సరం సంస్థ ఇవ్వాల్సిన 'స్టాండింగ్ ఆర్డర్' కోసం శర్మ సమాచార హక్కు కింద నోటీసు ఇవ్వడం తో యాజమాన్యం వేధింపులు తీవ్రతరం చేసిందని శర్మ కథనం.

ఎన్ని వేధింపులు పెడుతున్నా...శర్మ సంస్థను అట్టిపెట్టుకుని ఉండడంతో ఈ మధ్య సబ్-ఎడిటర్ హోదాలోనే 'ఈనాడు' అతనిని భువనేశ్వర్ బదిలీ చేసింది. అక్కడ సెక్యూరిటీ లో కూచోబెట్టి అవమానించింది. కార్మిక శాఖలో శర్మ ఫిర్యాదు చేశారు...ఆ గొడవ సాగుతున్నది. శర్మ కూచోడానికి ఇరుకైన గది కేటాయించారు. ఇది అమానుషమైన ఘటన. ఘోరమైన మానవ హక్కుల ఉల్లంఘన. ఎవరికీ పట్టని గొడవ.

'న్యూస్ టుడే'  ఏజెన్సీకి 'ఈనాడు' కు సంబంధం లేదని లిఖితపూర్వకంగా చెప్పిన 'ఈనాడు' మానవ వనరుల విభాగం అధిపతి గోపాలరావు మాటలు, చేతలు...
మనసిన వేజ్ బోర్డు కింద ఇవ్వ వలసిన సొమ్ములు ఇవ్వకుండా...'ఈనాడు' జర్నలిస్టులకు చేస్తున్న మోసం....
ప్రమోషన్ అడిగితే...'నువ్వు ఆర్.ఎస్.ఎస్.అట కదా..." అని వాకబు చేసిన ఒక పెద్ద మనిషి తెలివిడి....
భువనేశ్వర్ ఆఫీసులో శర్మకు జరిగిన అవమానం-ప్రాణభయం....ఇవి వింటే..జర్నలిస్టు అన్న వాడికి రక్తం మరుగుతుంది. వ్యూహాత్మక కారణాల వల్ల శర్మ పూర్తి వివరాలు, అతని వాదన ఇక్కడ ఇవ్వలేకపోతున్నాం.  

ఈ పోరాటంలో శర్మకు ఆర్ధిక-మానసిక సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్న జర్నలిస్టులు మా మెయిల్ కు రాయండి. ఇది చాలా కీలక పోరాటమని గుర్తించండి, స్పందించండి. 'ఈనాడు' ఉద్యోగులతో పాటు...మాజీ ఉద్యోగులు కూడా స్పందించాల్సిన సమయమిది. శర్మ ఒంటరి వాడు కాదని గుర్తుచెయ్యండి. నిత్యం ఇతరుల హక్కుల గురించి రాసే/వాగే మనం తోటి జర్నలిస్టు కు ధైర్యం ఇద్దాం.

20 comments:

Alapati Ramesh Babu said...

where is undavalli. give moral support mallikharjun. many persons are gone suicide due to harisements of eenadu group. they become idiameen,hitler and so on dictetor's. mallikharjun we are back with you. be brave.eenadu persons what they said in their paper all wrong.

jara said...

yes ramu we are support him

Anonymous said...

every journalist should respond to this

Saahitya Abhimaani said...

ఈనాడులో ఇటువంటి అమానుష ప్రవర్తన అంటే నమ్మలేకుండా ఉన్నాను. ఇటువంటి వాటి గురించి తోటి ఉద్యోగులు పట్టించుకోకపోతే ఎలా? ఇవ్వాళ ఒకరికి జరిగింది, ఈరోజున మనకెందుకులే అని ఊరుకున్న వారికి కూడా జరగదని ఏమిటి గ్యారంటీ!

ఎక్కడెక్కడో అన్యాయాలను లేదా తమ దృష్టిలో అన్యాయం అనుకుని రంద్రాన్వేషనే ధ్యేయంగా హడావిడి చేసే జర్నలిస్టులు తమ సంస్థల్లోనే తోటివారి పట్ల జరుగుతున్న విషయాలను విస్మరించటం, అటువంటివి బ్లాగుల్లో ప్రపంచానికి తెలియటం విడ్డూరం.

ఇప్పటికైనా జర్నలిస్టులు తమకోసం తాము ముందు పాటుపడి, తమకంటూ స్వాతంత్రం సంపాయించుకుంటే, పత్రికా స్వాతంత్రం దానంతట అదే వచ్చే ఆవకాశం ఉన్నది.

Anonymous said...

Take matter to Gone prakash rao,He is also fighting against eenaadu attrocities.

Anonymous said...

ramu gaaru


thanks for responding to the issue. We are all for Sharma. We are in touch with him and whenever he needs our help we would provide the same. My request to the journalist fraternity is to keep this issue live and lets take this to a logical conclusion.

Anonymous said...

dear ramu, Sharma has with RSS background in his student life. But not now. Unfortunately the dominent CPM cadre in Eenadu has established that Sharma has a terrorist and anti management. In fact that actually he has not anti management.. but he moulded as like that by the CPM cadre like M.Nageswararao, EJS principal and his followers. Actually it is the major crime that who has responsible to made the employees as like that. Almost all the BJP,RSS background employees were crushed or throwed away by MNR in Eenadu. Now the paper has running with CPM cadre. their intention is to establish infront of the management that the whole RSS cadre behave like as Sharma. The CPM cadre has not problamatic persons. So, MNR group provoking the Sharmas attitude. I think and as my obsevation him in kurnool.. he has not the problamatic as exposing by MNR group.

Anonymous said...

Eenadu, Andhra Jyothy enduku congress govtki vyathirekanga vaarthalu rayadam ledu? Y.S. hayamlo prathi roju eado okati rasina ee pathrikalu enduku scilentga vunnayi? Y.S. chanipogane rashtramlo paristhithulu anni chakkabaddaya? Idi prajalni vanchinchadam kada? Mosam kada?

Anonymous said...

....కలిగినోళ్ళ కొలువుల్లో ఇది మాములేగా రాము గారూ !! పరుల అవినీతి మీద యుద్ధం చేయాలంటే పంచె ఎగేసుకుని ముందుకురికే రామోజీ మార్క్సిస్ట్ సైన్యం ...భుబనేశ్వర్ లో శర్మ గారికి జరిగిన అన్యాయంపై మాత్రం కిక్కురుమన్నట్టు ఉండటం లో ఆశ్చర్యపోవలసిన్దేమీ లేదు...పరుల అవినీతి పై పోరాడటంతో పాటు..పరుల శ్రమ ను విపరీతంగా దోచుకునే దుర్మార్గం రామోజీ ఎండ్ కంపెనీ కి వెన్నతో పెట్టిన విద్య. బహుశా రామోజీ లాంటి వారిని చూసేనేమో..ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అని వేనుకటికో సినీ కవి చెప్పినట్టు...రామోజీ లాంటి బడా ..పెట్టుబడీ దారీ ..బూర్జువా...లను నడివీధిలో ...నలుగిరి ఎదుట విచారించాలి....

Saahitya Abhimaani said...

"........Sharma has with RSS background in his student life. But not now!!!!!!!!!....."

Even if he is now too?

He shall be persecuted??

Hats of to the Free Press in India.

Anonymous said...

Boss, Ammma Vodi ane blog ki ee post ki similarities kanpistunnayi. Its like స్క్ర్రిజొఫెనియా. if you dont like job just switch of the job or fight against it. If you have to fight against injustice you need to inspire the people and organize them.

Ramu garu, dont make people feeling self pity with your writings. Its good to read heart rendering stories in helpless situations but not in struggle. Hope everybody understands.

Anonymous said...

*If you dont like job just switch of the job or fight against it. If you have to fight against injustice you need to inspire the people and organize them. *

ఏ రోజులలో ఉన్నావు అనామక. ప్రజలను సమీకరించి, ఉత్సహ పరచి ఆయన పోరాటం చేయాలా? అసలికి నీ వ్యాఖ్యలు చదివితే నీ జీవితంలో ఎక్కడా ప్రైవేట్ కంపేని లో పని చేసిన మొహం కాదని తెలుస్తున్నాది. నీ బోటి పిచ్చ వెధవలకి ఆబ్లాగు స్క్ర్రిజొఫెనియా లా కనపడటం లో ఆశ్చర్యమేమి లేదు. ఒకసారి నువ్వు సిటి ఆఫ్ గోల్డ్ అనే హింది సినిమా గత వారం వచ్చింది చూసి మాట్లాడు. పోరాటం చేసె అమ్మ ఒడి ఆమేను స్క్ర్రిజొఫెనియా అని ముద్ర వేశావు రెపు వీడు పోరటం చేస్తె వాడిని నువ్వు అదే మాట అనవని నమ్మకం ఎమీటి ?

Wit Real said...

i didnt understand the above fight between two agnata's.

city of gold is a movie. go and watch and clap. period.

go and see the reality on the road.

madhur bhadarkar laanti directors are making money from picchi vedhavalu!

Anonymous said...

ramoji vuttha pundakor...
dabbu vundagane sari kadu
mana daggara panichese vadu santhoshamga vundela chudalanna kaneesa gnayam kuda ledu
srama dopidi chese dagakoru...

-----oka meedia mithrudu

Anonymous said...

@Wit Real,
If you did not understand then shut your mouth. Do not say picci vedhavalu blah blah ...
నీ బోటి మొద్దు వెధవకి అర్థం కావాలంటె ఒక పెద్ద పుస్తకం రాయాలి. దానికి బ్లగులు సరి పోవు. నువ్వేదో పెద్ద జీనియస్ లా పోజు కొట్టకు.
-------------------------------
రాము గారు, మనకు అన్యాయం జరిగితె ఆఖరికి అందరూ వేళ్లేది కోర్టుకి అక్కడ ఒక కేస్ పరిష్కరించాలీ అంటె ఎన్ని సం|| పడుతుందో మనకి తెలియనిది కాదు కదా. ప్రస్తుత కేసులను పరిష్కరించటానికి 320 సం|| పడతాయని వార్త పేపర్లో వచ్చింది. న్యాయస్థానాల లోని ఈ లొసుగుల ను అడ్డం పెట్టుకొని మేనేజ్మెంట్ వారు ఆటలాడటం ఎక్కువైంది. బ్లాగుల ద్వారా ఇటువంటి వాటిని బయటకు తేవటం ఎంతో ఉపయోగమంది. రానున్న రోజులలో అందరు పేపర్ కన్నా బ్లగులు చదువుతారు.

Anonymous said...

intha janabhaki inni vudyogaalu testhunnamu antarukaani, enni mandi policulu unnaru, veelakai enni kortlu/judgelu/layarlu saripothayani epudain alochinchara

Anonymous said...

అయ్యొ అయ్యెయ్యొ ఏం చెప్పాలి ఇలాంటి అమాయక పక్షులకి. ప్రైవేట్ ఉద్యోగం చేసావా అని అడుగుతున్నారు. అమ్మఒడి లో పోరాటం అంటున్నారు. అదేదొ సినిమా చూడమంటున్నారు. బాబు నాయనలారా పోరాటం చేయడం పై నమ్మకం లేనివారు ప్రజల పోరాటాన్ని ఎలా సమర్థిస్తారు మీడియా లో వుండి. పోరాడే వాడు మిగతా వాల్లకు స్పూర్థిగ నిలవాలి. సప్పోర్ట్ చేసేవాడు వాడి మీద గౌరవం కలిగించాలి కాని చందాలు అడిగి దీనపరిస్థితి పై జాలి కల్గించకూడదు. నేను నిజమైన ప్రైవేట్ సంస్థలో ఎలాంటి చట్టపరమైన భద్రత లేని సెక్టార్ లొ ఊద్యొగం చేస్తున్నను. డొంట్ బి సినికల్. అదే నా బాధ. అందుకే స్చ్రిజొఫ్రెనియా అని వాడా. ఇంక మీ ఖర్మ

Anonymous said...

*పోరాడే వాడు మిగతా వాల్లకు స్పూర్థిగ నిలవాలి. సప్పోర్ట్ చేసేవాడు వాడి మీద గౌరవం కలిగించాలి కాని చందాలు అడిగి దీనపరిస్థితి పై జాలి కల్గించకూడదు*
అతను పోరాడెది అతని కి జరిగిన అన్యాయం మీద, ఆ విలేఖరి గొప్ప నాయకుడు కాదు అందరికి స్పూర్థిని కలిగించటానికి. ఆయనకి అలా నాయకుడు కావాలని ఆశకూడాలేదు. అతనికి మద్దతు నిచ్చె వారు రెపు వారికి ఇలా జరగవచ్చు అనే దృష్టి లో చూచి మద్దతు నిస్తున్నారు. డబ్బులు ఇవ్వగల వారు ఇస్తారు లేక పోతే లేదు. అసలు చందాలు అనేపదం ఎందుకు వాడు తారు? ఆయన మిత్రులు ఇష్టం ఉంటె సహాయం చెస్తారు లేక పోతె లేదు. ఆ విషయం మీకెందుకు?
మీరైతే మాహనుభావులు ప్రతి పనికి ఇతరులకు స్పూర్థిగ నిలవాలని, గౌరవం కలిగించాలి అని ఒకటె మీరొక రోల్మోడల్ గా ఉండాలని తాపత్రయం ఉన్న వాళ్ళు, ఆ అదర్శాలను వీలైతే మీరు పాటించండి.మీరు పేరె చేప్పుకోలెక ఉన్నారుమరి. సామాన్య ప్రజలను వారి మానాన వారిని బతకనివ్వండి, మీ గొప్ప ఆదర్శాలతో వారి జీవితాలను నాశనం చేయకండి.

Wit Real said...

Dear annonymous

>> If you did not understand then shut your mouth.

Thats what I did.

I did not talk on the topic of their fight. I just referred to the inspiration that someone got from "city of gold". These are just movies. they just make money.

>> Do not say picci vedhavalu blah blah ...


If you read the comments above, you will understand that I DID NOT coin the word "picchi vedhava".


your fellow annonymous blogger called the other annonymous blogger as "నీ బోటి పిచ్చ వెధవలకి ఆబ్లాగు స్క్ర్రిజొఫెనియా లా కనపడటం లో ఆశ్చర్యమేమి లేదు"


>> నీ బోటి మొద్దు వెధవకి అర్థం కావాలంటె ఒక పెద్ద పుస్తకం రాయాలి.

Thanks for the compliment. And let me know when the book is ready


>> న్యాయస్థానాల లోని ఈ లొసుగుల ను అడ్డం పెట్టుకొని మేనేజ్మెంట్ వారు ఆటలాడటం ఎక్కువైంది.

you were unreasonable in scolding me.

you are equally unreasonable in your above statement.

I discussed on many occasions on this blog that you cant always accuse the management as the villian.

understand that the organization has no obligation to promote you. If it feels that it should promote you for its business reasons, then it will promote you. It can always decide the place of your work based on its business needs. You all signed these clauses at the time of accepting the job.

now, see the other angle. what if you are the business head of the orissa branch and all your people want transfers to hyd & other comfortable places? would you release them all?

if you know the purpose of a company. then you would understand.

Now, I pose a case for you & the author of this blog: A woman employee in a district office complained a sexual harrassment case on her boss. Management called for a review of the case. The boss argued that it was a false allegation and the fact is that the lady was asking for a Tx to Hyd, which he refused. Now, what will you do? it is no different from the current case that we are all talking about.

Anonymous said...

ALL THE BEST

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి