Monday, April 12, 2010

మీడియా ఆశించింది నెరవేరలేదు: TV-9 నిరుపమ

(తాజ్ హోటల్ నుంచి మా ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, ఏప్రిల్ 12 (గందా న్యూస్ నెట్వర్క్): సానియా-షోయబ్ తాజ్ హోటల్ నుంచి బైటికి వస్తే...ఇక మీడియాను తప్పించుకునే ప్రశ్నే లేదని TV-9 రిపోర్టర్ నిరుపమ చెప్పారు. హోటల్ నాలుగు వైపులా మీడియా మొహరించినట్లు ఆమె వివరించారు.

ఉదయం నుంచి తాజ్ దగ్గర పడిగాపులు కాస్తున్న నిరుపమ ఈ సాయంత్రం ఐదు గంటల బులెటిన్ లో లైవ్ లో అనర్గళంగా మాట్లాడుతూ..."నాషనల్ మీడియా కూడా కంసాన్ ట్రేట్ చేసింది.. ఇక్కడే  పడిగాపులు కాసింది. అయినా వారు అనుకున్నది సాధించలేక పొయ్యారు," అని ఆమె చెప్పారు. అయితే...మీడియా వాళ్ళు ఏమి సాధించాలని అనుకున్నది నిరుపమ విడమరిచి చెప్పలేదు. చల్లగా TV-9 స్టూడియో లో ఉన్న దేవి గారు కూడా అడగలేదు.

కొత్త జంట పెళ్లిని కవర్ చేయనివ్వకపోవడం పట్ల నిరుపమ అసహనం, ఆందోళన వ్యక్తం చేశారు. 'అసలు రాత్రికి జరిగే విందు కు కూడా మీడియాను రానిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇంత హడావుడిగా వాళ్ళు పెళ్లి చేసుకోవడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి," అని నిరుపమ వివరించారు. 


అంతకుముందు బులెటిన్ లో మాట్లాడుతూ..."ఇప్పుడైతే పెళ్లి పోయింది. ఇప్పటివరకు అంత...గోప్యంగా ఉంచారు. ఇక రేపటి నుంచి అన్ని కార్యక్రమాల వివరాలు మీడియాకు వివరిస్తారని భావిస్తున్నారు," అని వారు వివరించారు. 'అన్ని కార్యక్రమాలు' ఏమిటో మాత్రం విడమరచలేదు. 

4 comments:

Anonymous said...

funny media.....

Anonymous said...

ఇక్కడ కూడా ఇదే గొడవా? బాబోయ్!

Anonymous said...

Aa ammayi agnanam sikharagrana vundi. Lodaloda vagatam bagundi. Ivey TV9 vudyoganiki kavalsina 2 lakshanalu. Value based Journalisaniki talak talak talak. Pichi vaguduku kubool kubool.

www.newsgaaurage.com said...

sania-shoib 1st night gurinchi eenadu first page lo mention cheyatam journalijaniki eme pramanikamo kiran&co ku telyyali.
no 1 channel ga cheppukuney channello sania ye chira kattukunte evariky kavali. enta mera kuchillu sardukunte evariky kavali. ida news chetta.. chetta.. poty perigy rivals bhayanto eenadu-tv9 chese daritapu yatnalu.
ak hyd

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి