Friday, April 16, 2010

ఒక పాము---ఐదు పడగలా?: ఇది నిజమా?


ఈ ఇంటర్నెట్ లో మెయిల్స్ రూపంలో భలే గమ్మత్తైన విషయాలు, ఫోటోలు వస్తుంటాయి. ఈ రోజు ఒక జర్నలిస్టు మిత్రుడు ఐదు పడగల పాము ఫోటో పంపాడు. నేను ఊర్లో పాములను చూస్తూ, భయపడుతూ, విస్మయపడుతూ బతికాను. కానీ, ఇలా ఐదు తలకాయల పామును చూడలేదు, ఇది ఉన్నట్లు విననూ లేదు. ఇది ఫోటోషాప్ లో సృష్టించిందో కూడా తెలియదు.

మా ఇంటి దైవం ఈ నాగరాజు గారే అని పెద్దలు చెబుతారు. అమ్మ నాగదేవుడి అంశ వల్ల పుట్టింది కాబట్టి...నాగేశ్వరి అని పేరు పెట్టినట్లు మా అమ్మమ్మ చెప్పేది. అమ్మమ్మ నాగుల చవితి ఎంతో భక్తిశ్రద్ధలతో చేసేది. ఆ రోజున నువ్వులతో మంచి స్వీటు చేసేది. మా ఇంట్లో పూర్వం ఒక నాగు పాము తిరిగేదని, శేషూ...అని పిలిస్తే..వచ్చి పాలు తాగేదని నాయనమ్మ కూడా చెప్పేది. అది నిజమో కాదో తెలియదు. 


ఇప్పటికీ మా వూళ్ళో ఈ పాములు నాకు అర్థంకాని వ్యవహారమే. మా అమ్మ, నాన్నా హైదరాబాద్ వచ్చి వెళ్ళగానే...'డాక్టర్ గారూ...మీ ఇంట్లో పెద్ద తాచును చూసాం..." అని ఊళ్ళో వాళ్ళు చెబుతారు. నేను అదిరిపడతాను. మా వాళ్లకు మాత్రం అది కనిపించదు. అందుకే...నేను ఇంటికి వెళితే...పాము భయంతో చస్తుంటాను. ఈ నాగమయ్య ఇంటి దేవుడుగా మారడం వల్ల...మా ఇంట్లో పుట్టిన అందరి పేరులో ఒక చోట 'నాగ' అని చేరుస్తారు. నా పేరు...'సీతారామశేష తల్పసాయి' అని పెట్టారు కానీ..ఊరి క్లర్కు కు స్పెల్లింగ్ ప్రాబ్లెం ఉంది...కత్తిరించి పారేసాడు. 


విసుక్కోకండి, ఆటలో అరటిపండులా ఈ సొంత డబ్బా. ఇదిలా వుంటే..నిజంగా మీలో ఎవరైనా...రెండు మూడు తలల పాములైనా చూసారా? చూస్తే....సరదాగా మీ అనుభవం రాయండి.

8 comments:

Lakshmi Naresh said...

okka tala pamu ni choosthen kastham..alaatidi rendu moodentandi..mari chodyam.

డి.వి.యస్.అబ్బులు said...

>>> నా పేరు...'సీతారామశేష తల్పసాయి' అని పెట్టారు.

రాముగారూ,
మీరు ఏమీ అనుకోకపోతే ఒక విషయం చెబుతాను. సర్లెండి...ఏమనుకున్నా చెప్పేస్తాను. మీరు అంత చక్కటి పేరుని తప్పుగా రాస్తున్నారని నా అభిప్రాయం. నిజానికి, ఇటువంటి పేర్లు ఎవరు తప్పుగా రాసినా నాకు చాలా బాధగా ఉంటుంది. "సీతారామ శేషతల్పశాయి" అని రాయాలి కదండి! "శేషతల్పశాయి" అంటే, "శేషతల్పం మీద శయనించే వాడు" అని అర్థం కదా? "రంగశాయి", "రంగనాథశాయి", "సోమసుందరశాయి"...ఈ పేర్లన్నీ ఎక్కడ చూసినా నూటికి తొంభైతొమ్మిది చోట్ల తప్పుగానే రాయబడతాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే, ఆ పేరుగలవాళ్ళే ఈ తప్పు చేస్తుంటారు. "శేషతల్పశాయి" ఎంత అందమైన పేరండి! ఆ మాట పలుకుతుంటేనే పాల సముద్రంలో ఆదిశేషువు పైన చిరుమందహాసంతో మేనువాల్చుకుని పడుకున్న విష్ణుమూర్తి అలా కళ్ళలో కదులుతున్నాడు నాకు. నా దృష్టిలో ఇది పలికినప్పుడల్లా అర్థం కళ్ళలో నిలపగలిగే చాలా కొద్ది పేర్లలో ఇది ఒకటి. అందుకే ఉండబట్టలేక చెప్పేశాను. మరోలా అనుకోకండేం!

- అబ్బులు

Ramu S said...

అబ్బులు గారూ
నిజం, తప్పు నాదే.
థాంక్స్
రాము అలియాస్ సీతారామ శేషతల్పశాయి

Anonymous said...

http://vanitavanivedika.blogspot.com/2010/04/blog-post_10.html

పై లింక్ లో ఇంతకు ముందే ఈ ఫొటో తన బ్లాగులో పెట్టారు చూడండి.

అయినా, ఐదు తలల పామేమిటండీ చోద్యం! ఒక రకం పాము రెండు తలల శిఖండి అని జూ లో చూశాను. తోక వైపు సన్నగా లేకుండా మొండిగా లావుగా ఉంది కానీ అది తల కాదని పాముల పెట్టె వాడే చెప్పాడు.

అది ఫొటో షాప్ లో సృష్టించిందే! సందేహమే లేదు.

నాగ మహిమ గురించి నాకేమీ తెలీదు కానీ ఇలాంటివి మూఢాచారాలతో ఆడుకోడమే!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

These are doctored photos.There are photos that swow Aishwarya Rai and other heroines stark naked on the net.Yhis one is also one such.

Anonymous said...

i dnt know abt this photo.but i want to share a incident here.

10 yrs back,maa family frnd.APSEB Lo A.E.vaalaki town outskirts lo quarters ichhru.paaulu vachevi.alaage oka roju,5 talala paamu vachindhi.nasthikudaina aayana danini champinchadaniki,voori vaalani pilipinchaadu.vaalu daani champamu ani cheppi vellipoyaaru.avesham tho aayana gun teesi shoot cheyaboyaadu.adi busa kottukuntu vellipoyindi.next naagula chaviti ki aayana chanipoyaaru.ITS A REAL STORY.

Anonymous said...

we see so many such snakes these days. nothing to surprise. people with so many heads with many tongues too.. Isn't it?

Anonymous said...

[10 yrs back,maa family frnd.APSEB Lo A.E.vaalaki town outskirts lo quarters ichhru.......]

Story chala bagundi, kani inka kontha dramatic ga unte baagundedi.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి