Saturday, April 17, 2010

మాజీ 'ది హిందూ' జర్నలిస్టు సాయశేఖర్ కు ఆపరేషన్

'ఈనాడు' తో జర్నలిస్టు జీవితం ఆరంభించి 'ది హిందూ' లో ఒక వెలుగు వెలిగి అర్ధంతరంగా వైదొలిగిన ఎ.సాయశేఖర్ హృదయ సంబంధ సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు శనివారం ఒక సర్జరీ చేస్తారని తెలిసింది అయితే...అది మైనరా? మేజరా? అన్నది తెలియరాలేదు.

'కాస్త అన్ఈజీ గా వుండి ఆసుపత్రికి వెళ్ళిన ఆయన...హార్ట్ ప్రాబ్లం తో ఆసుపత్రిలో మూడు రోజుల కిందగా జాయిన్ అయ్యారు. ఈ రోజు ఆపరేషన్," అని అతని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.

వివాదాస్పద పరిస్థితుల నడుమ 'ది హిందూ' నుంచి వెళ్ళిపోయిన సాయ శేఖర్ ఒక బిజినెస్ వెబ్ సైట్ నిర్వహిస్తున్నారు. ఈనాడు, న్యూస్ టైం, డెక్కన్ క్రానికల్ పేపర్లలో వివిధ హోదాలలో పనిచేసిన సాయ శేఖర్ 'ది హిందూ'లో చేరిన ఆనతి కాలంలోనే పై స్థానాలకు ఎదిగారు. విజయవాడ బ్యూరో చీఫ్ గా ఉన్న ఆయనను యాజమాన్యం హైదరాబాద్ కు బదిలీ చేసింది. ఇక్కడ బిజినెస్ వ్యవహారాలూ చూసిన ఆయన ఒక వివాదంలో చిక్కుకుని చివరకు....'ది హిందూ' నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

మంచి టాలెంట్ గల అతి కొద్దిమంది జర్నలిస్టులలో ఒకరైన సాయశేఖర్ పదునైన నాలుకతో వివాదాలు కొని తెచ్చుకునే వారని మీడియా వర్గాలలో ప్రచారం ఉంది. ఆరోగ్య సమస్యను అధిగమించి సాయశేఖర్ కోలుకోవాలని ఆశిద్దాం.
--------------------------------------

నోట్: సాయ శేఖర్ చేరిన ఆసుపత్రి వివరాలు ఉన్నప్పటికీ....అతని అనుమతి లేకుండా ఇవ్వకూడదని, అది అతని విశ్రాంతి కి భంగం కలగవచ్చన్న అనుమానంతో ఇక్కడ రాయడంలేదు. అతని ఆరోగ్యంపై తాజా వివరాలు అందించే ప్రయత్నం చేస్తాము.     

6 comments:

Rajendra Devarapalli said...

అయ్యో మనవాడికి అంతసమస్య వచ్చిందా??
త్వరగా ఆరోగ్యవంతుడై మన మధ్యకు రావాలని నా ఆకాంక్ష.
అయినా రాముగారు.మాజీ దిహిందూ జర్నలిస్టు యేమిటండి?
మనవాడి పేరు సాయి శేఖర్,
సాయి ఒక బిజినెస్ వెబ్ సైట్ తో పాటు దానికి అనుబంధంగా ఉన్న మరో రెండు వెబ్ సైట్లను కూడా నిర్వహిస్తున్నాడు.గమనించగలరు.

Vinay Datta said...

May Sai Sekhar get well soon.

Vinay Datta said...

Did you get any reply from THE HINDU for the complaint you had given earlier? I guess you didn't get it. Gone are the days when newspapers considered such complaints.

kvramana said...

annayya
Saye Sekhar has been going through this problem for the last 15 days. He suffered a massive heart attack and the subsequent investigations showed that he had a block. A surgery was conducted on Saturday. He will remain in the ICU for the next two days. Then he will be shifted to a room. Interestingly, even after the doctors declaring that he has to undergo a major surgery, he kept working from home using his laptop. He was in touch with me for the last 15 days over phone to know about the business related developments in the city. I was surprised to see the way he was working hard to get a good lead story for his website even while keeping unwell.
Get well soon Saye.

Ramu S said...

సోదరా రమణా...
లోతైన సమాచారం అందించావు. నాకు ముందే ఎందుకు చెప్పలేదు స్వామీ? అతను కూడా ఒక ప్రముఖ జర్నలిస్తే కదా. అతనికి చాలా సర్కిల్ ఉంది. సర్జరీ జరిగిన శనివారం అంటే..ఈ రోజేనా?

దేవరపల్లి గారూ...
అతను saye sekhar అని రాసుకుంటాడు. సాయి శేఖర్ కాదట. తను మరొక రెండు వెబ్ సైట్లు నిర్వహించే విషయం తెలియదు. అతను 'ది హిందూ' మాజీ జర్నలిస్టు కదా.

మాధురి గారూ...
నిజమే నండీ...నేను కూడా విస్తుపొయ్యాను. గతంలో రీడర్స్ ఎడిటర్ వెంటనే స్పందించే వారు. కొత్తాయన ఆ రకం కాదనుకుంటా...
రాము

Anonymous said...

saisekhar manch journalist. NTR lakshmiparvathi marriage breaking storyni (for DC) ichindi ayane. sai sekharlo manchi hasya priyudu.. ayana tvaraga kolukovalani asistu...

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి