Saturday, May 1, 2010

'మే' డే: జర్నలిస్టులు హక్కులు గుర్తెరగాల్సినది నేడే...


ఒక కాకి మరణిస్తే ఆ దరిదాపుల్లోని కాకులు నానా యాగీ చేస్తాయి. ఒక కోతి మీదికి రాయి విసిరితే...ఆ గుంపులోని కోతులు దాడి చేసిన వాడిపై ఎగబడతాయి. పక్షులు, జంతువులలో ఉన్న ఈ ఐకమత్యం జర్నలిస్టులలో కొరవడుతున్నది. జర్నలిస్టులు తమపై దాడులు జరిగితే...నానా యాగీ చేస్తున్నారు కానీ....తమ యాజమాన్యాలు నిత్యం తమ హక్కులను హరిస్తుంటే మాత్రం కిమ్మనకుండా భరిస్తున్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ అంశంపై కొద్దిగా దృష్టి సారిద్దాం.

గత మే నెల నుంచి...ఇప్పటి వరకూ కనీసం ఆరొందల మంది జర్నలిస్టులు, మీడియాలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న వారు ఊస్ట్ అయ్యారు. వందల మంది కనీసం అపాయింట్ మెంట్ లెటర్ లేకుండా పనిచేస్తున్నారు, పే స్లిప్ లేకుండా...నెల జీతం వస్తే చాలని తృప్తిపడుతున్నారు. నీతి మాలిన యాజమాన్యాలు...ధన, కండ బలాలతో ఉద్యోగులను ఇష్టం వచ్చినట్లు ఇళ్ళకు సాగానంపాయి. పీ.ఎఫ్.ను కాజేసి దిక్కున్న చోట చెప్పుకోండి అని అంటున్నాయి.

ముఖ్యంగా...ఛానెల్స్ లో మానవ వనరుల విభాగం వారు ఒక ఫోన్ చేసి....వారి క్యాబిన్ కు పిలిపించుకుని....ఐ.డీ.కార్డు, సెల్ ఫోన్ చిప్ గుంజుకుని పంపించిన సందర్భాలు కోకొల్లలు. నోటిసు ఇవ్వకుండా, కారణం చూపకుండా...అర్ధంతరంగా ఉద్యోగం పీకేయ్యడం అన్యాయమే కాదు, నేరం కూడా. అయినా...ఒక్కరంటే ఒక్క జర్నలిస్టు అయినా...దీనిపై స్పందించి లేబర్ శాఖను, కోర్టులను ఆశ్రయించిన దాఖలాలు నాకు కనిపించలేదు. అవమానకరమైన రీతిలో వెళ్ళిపోయిన సహచరులను ఆదరించి అక్కున చేర్చుకునే మాట అటు ఉంచి కనీసం పలకరించే సంస్కారం కూడా ఈ జర్నలిస్టు జాతిలో కనిపించడం లేదు. 

జీతాలు రెండు నెలలు ఆలస్యం చేసినా...ఇదేమిటని జర్నలిస్టులు అడగడం లేదు. ఇళ్ళలోవాళ్ళను మాడ్చడం లేదా అప్పులు చేసి పూట గడపడం చేస్తున్న జర్నలిస్టులకు తెలుగు నెల మీద కొదవలేదు. కొన్ని పత్రికలు....'యాడ్ వసూలు చేసి...అందులో మీ జీతం తీసుకోండి..' అని జర్నలిస్టులకు హుకుం జారీ చేస్తున్నాయి. చాలా మంది....'ఇదేమి ఘోరం...ఇది కుదరదు,' అని చెప్పలేక పోతున్నారు. ఒక సంస్థలో యాగీ చేస్తే...మరొక చోట వుద్యోగం రాదన్న భయంతో అంతా...అవమానం, హృదయ క్లేశం భరించి...ఇబ్బంది పడుతున్నారు. ఈ కారణాల వల్ల చాలా మంది అవినీతిని ఆశ్రయిస్తున్నారు.
తమ హక్కుల కోసం పోరాడలేని ఇలాంటి...మనుషులు...జనం హక్కుల గురించి ఏమి పోరాడతారు? అన్న ప్రశ్న ఉదయించడం సహజం. ఈ సమస్య తీవ్రతకు మూడు కారణాలు ఉన్నాయి. 
1) చాలా మంది జర్నలిస్టులు....ఆత్మస్థైర్యం లేకుండా పనిచేస్తున్నారు. ఉద్యోగం లో చేరిన వారు...ఒక పక్క సజావుగా పనిచేస్తూనే అర్హతలు, నైపుణ్యం పెంచుకోవడం చాలా అవసరం. ఇది చాలా మంది చేయకుండా...సంస్థ లో సిల్లీ రాజకీయాలలో ఇరుక్కుని....కింది సిబ్బందిని వేధిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం. 

2) మీడియా లో సీనియర్లు అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. జర్నలిస్టుల హక్కులు, సామాజిక బాధ్యత తెలిసి కూడా...మందపాటి పే ప్యాక్స్ కోసం యాజమాన్యాల అడుగులకు మడుగులొత్తుతున్నారు. తమ వర్గాన్ని పెంచుకునెందుకు, తమ లాబీ ని బలపరుచుకునెందుకు పోటీ పడుతూ అప్పటికే అక్కడ ఉన్న జర్నలిస్టుల ఉద్యోగాలు ఊడపీకుతున్నారు. ఇది దారుణం, ఘోరం, పాతకం. యాజమాన్యాలను ప్రభావితం చేయగలిగే జర్నలిస్టులు తప్పుడు విధానాలు అవలంభిస్తే....ఇన్నాళ్ళు అన్నం పెట్టిన జర్నలిజానికి తీరని అన్యాయం చేసినట్లు అవుతుంది. ఉజ్జోగాలు పోయిన జర్నలిస్టుల ఉసురు కొట్టుకుంటుంది. 
జర్నలిస్టు అన్నవాడు.....ఒక కులం, ఒక మతం, ఒక ప్రాంతం అన్న సంకుచిత ధోరణులను విడనాడాలి. జర్నలిస్టుది వసుధైక కుటుంబం. జర్నలిస్టు విశ్వ మానవుడు, కుల మాతాలకు--ప్రాంతీయ విద్వేషాలకు అతీతుడు...అన్న స్ఫూర్తి పెంచుకోవడం తక్షణ అవసరం. ప్రస్తుత ట్రెండ్ ను చూస్తే....జర్నలిస్టులలో కూడా కుల సంఘాలు వచ్చి మీడియాను మరీ రొచ్చు చేసే ప్రమాదం ఎంతో దూరంలో లేదు.

3) జర్నలిస్టు సంఘాల ఘోర వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. పోరాటాల గడ్డ లొ పుట్టిన ఇద్దరు నేతలు---దేవులపల్లి అమర్, శ్రీనివాస రెడ్డి--జర్నలిస్టుల సమస్యలపై పోరాడే సంస్థగా APUWJ ని తీర్చిదిద్దలేకపోయారు. ఏ జర్నలిస్టును కదిలించినా...వీరిద్దరినీ నానా బూతులు తిడతారు కానీ...వారిని కలిసి మాట్లాడడం కానీ...వారిని కార్యోన్ముఖులను చేయడం గానీ, వారిని పూర్తిగా యూనియన్ ఫ్రేం నుంచి శాశ్వతంగా రూపుమాపే యత్నంగానీ చేయడంలేదు. అసలీ నేతలిద్దరూ....మెయిన్ స్ట్రీం మీడియా వాళ్ళు కాదు. వీరి తో తలపడే దమ్ము, ధైర్యం, ఓపికా లేక చాలా మంది సదాలోచానాపరులైన జర్నలిస్టులు కిమ్మనకుండా ఆఫీసులకు పరిమితం అవుతున్నారు.
ఈ యూనియన్ కు సమాంతరంగా ఏర్పడిన ఫెడరేషన్ ఇంకా బాగా పనిచేయాల్సి ఉంది. ఇప్పుడు జర్నలిస్టు ఒక సంక్షోభంలో ఉన్నాడని యూనియన్ నేతలు గుర్తించి ఆదుకోవాలి. 

హక్కులతో పాటు బాధ్యతలు కూడా గుర్తెరగాలి...నేటి జర్నలిస్టులు.  యాజమాన్యం తొత్తులుగా మారి...పిచ్చి వార్తలు ప్రసారం చేసి జైలుకు పోవడమో, నమ్మిన జర్నలిస్టులను నట్టేట ముంచి తాను మాత్రం తెలివిగా ఒడ్డుకు చేరి దర్జాగా బతికేయ్యడమో...మంచిపనులు కావు. ఆత్మ పరిశీలన, ఆత్మ నిగ్రహం, ఆత్మ గౌరవం మన నినాదాలు కావాలి.  
'ఈనాడు' బాధితుడు మల్లిఖార్జున్ కేసును జర్నలిస్టులు ఇప్పుడు ఒక సవాలు గా స్వీకరించి ఏ.పీ.మీడియా లో ఒక బాధ్యతాయుతమైన 'ట్రేడ్ యూనియన్' ఒకటి నెలకొల్పాలి. అది జర్నలిస్టు లకు, మీడియాకు, అంతిమంగా ప్రజలకు ఉపకరించాలి. ఈ మే డే రోజు మీడియాలో ప్రతి ఉద్యోగి ఇందుకు ఆత్మసాక్షిగా ప్రమాణంచేయాలి. 
రాష్ట్రంలో తెలుగు జర్నలిస్టుల హక్కులకు ఇప్పుడు జరుగుతున్న ఉల్లంఘన  చరిత్రలో ఎన్నడూ జరగలేదని గుర్తించి....తోటి జర్నలిస్టును ఆదరిస్తూ, ఆదుకుంటూ మే డే స్ఫూర్తితో మెలగండి. 
కలంవీరులారా...హక్కులు-బాధ్యతలు ఆయుధంగా ముందుకు సాగండి.

16 comments:

Anonymous said...

oka pvt company lo yearly increment evvala leda?

Anonymous said...

Yes, this is correct, managements behaving like that. Eenadu management ask the resignationg from Hydedrabad city like style reporter Mr.Vadde Marenna for their small mistake to write a pressnote. Actually that is a warningble mistake. But RamijiRao and his son MD Kiron behaved very crual mentality. So, eminent journalist Mr Marenna shunted out from the Eenadu organisation. Only M.NageswraraRao, EJS principle and P.VishnuvardhanRao, city chief, went to Marenna house and console him and his wife. They told that atlast any one will face this situation in Eenadu. So dont worry, we will see another job in Saakshi or Andhra Jyothi.. they assured. And also they expression their unhappyness about Ramoji cruel decession. Except the two .. no one console Marenna. So, eenadu management behaved very crually with Marenna.

Anonymous said...

Your bitter comments in the interests of the journalistic community must open the eyes of the journalists and the leaders like Amar,Srinivas Redddy in particular.Now a days every leader tries to stabilise himself with the selfish agenda by behaving ZEE HUZOOR to the governmenmt and the politicians without bothering about their colleagues and friends who are leading a miserable proffessional life as seen in Enaadu etc.Let us hope the leader Surender ,the chairman of Press Academy will do something to minimise th agony of the journalists,reporters and others.
As rightly pointed out some trade unionism with a dynamic leadership is tye only answer to the situation.But how many are dare enough top come out with a new organisation at the cost of their bread and butter?Let us wait and see.
JP.

Anonymous said...

Your bitter comments in the interests of the journalistic community must open the eyes of the journalists and the leaders like Amar,Srinivas Redddy in particular.Now a days every leader tries to stabilise himself with the selfish agenda by behaving ZEE HUZOOR to the governmenmt and the politicians without bothering about their colleagues and friends who are leading a miserable proffessional life as seen in Enaadu etc.Let us hope the leader Surender ,the chairman of Press Academy will do something to minimise th agony of the journalists,reporters and others.
As rightly pointed out some trade unionism with a dynamic leadership is tye only answer to the situation.But how many are dare enough top come out with a new organisation at the cost of their bread and butter?Let us wait and see.
JP.

Anonymous said...

what happened to N TV Rajasekhar after he was caught?

Vinay Datta said...

This post is not mentioned in the blog archive.

Anonymous said...

Very good post. keep writing posts like this. the change may come sooner or later.

Saahitya Abhimaani said...

Good post. Your impromptu outburst is very impressive. Keep it up till there are positive results.

Anonymous said...

జర్నలిస్ట్ ల ఇళ్ళ స్థలాల విషయం లో అమర్ ఎంత పొడుగు కబుర్లు చెప్పాడో. చిత్తశుద్ధి ఉందనుకున్నాం. వైఎస్ దగ్గర ఎంతో సీన్ ఉన్నట్లు బిల్డప్ ఒకటి. వైయస్ మీడియా పెట్టాక జర్నలిస్ట్ లీడర్లను కుక్కలా కన్నా హీనంగా చూడటం మొదలైందని తెలిసింది. ఆయన పోయాకా అదే కొనసాగుతోంది. ఇక మనని మనం రక్షించుకోవాలి. apuwj సభ్యులమై దాన్ని ఆక్రమించుకోవాలి. అమర్, శ్రీనివాస రెడ్డిలకు వీడ్కోలు చెప్పాలి. మేనేజ్మెంట్లు కూడా తమ ఉద్యోగులను సంఘాల్లో ప్రోత్సహించాలి.

Ramu S said...

శివ గారూ...
థాంక్స్ సర్. నిజానికి తెలుగు మీడియాలో చాలా బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి. బాధ్యత మరిచి ఆత్మను అమ్ముకుని బతకాల్సిన స్థితి. ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియని దుస్థితి. దీని ప్రభావం వల్ల చాలా విపరిణామాలు జరుగుతున్నాయి.
ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి ఊరట కోసం. వాళ్లకు మేలు జరగాలని తెగించి ఇంత రాస్తున్నానా...నాకు కూడా మోటివ్స్ అంటగట్టి ప్రచారం చేసే మిత్రులు కనిపిస్తున్నారు. వీళ్ళలో పోజిటివ్ కోణం అన్న దాన్ని పూర్తిగా కోల్పోతున్నారు. అదే బాధాకరం.
రాము

Saahitya Abhimaani said...

".........బాధ్యత మరిచి ఆత్మను అమ్ముకుని........." Well said Ramu ji. One of the great cartoonists India has ever produced was Shri Abu Abraham. He once said, a good Cartoonist should have the following:
"....నిర్భయంగా ఉండటం. అవును. , మీరు అనుకున్న భావాలు, వ్యక్తీకరించటంలో, అదొక మంచి లక్షణం.సంపాదకునో, పేపరు యజమానినో లేక మరింకెవరినో సంతోషపెట్టే ప్రయత్నంలో మీకు నచ్చని విషయాల మీద కార్టూన్లు గీస్తే అదే పిరికితనం. సామాన్యంగా కార్టూనిస్టు ఒక పేపరు నుండి మరొక పేపరుకు వలస వెళ్లినప్పుడు, ఇలాంటిది జరిగే ఆవకాశం ఉన్నది. మీకోసం మీరు నిజాయితీగా ఉన్నప్పుడే, స్వేచ్చా వాయువులను పీల్చగలుగుతారు. కార్టూనిస్టులు కొద్దిమందే ఉంటారు, అదే వారి ప్రేత్యేకత. ఏ పేపరైనా తమకున్న కార్టూనిస్టును వెళ్లగొట్టే స్థితిలో ఉండదు. కాని మీరు భయపడటం మొదలు పెడితే రిస్కు తీసుకోలేరు....."

Same thing applies to everybody working in Media. Each Reporter and others should develop such professional competency level that it should become impossible to replace them.

To read full part of Abu's views, you can read the interview through following link:

http://www.rediff.com/news/oct/31abu.htm

Anonymous said...

llo ramu garu.
meru baley ga chepparu,Jornilist lu devullu kadu andi manushulu.

vallaki andari la swardam ersha asuya anni untayeye.

ikkada pina unna comments lo yentha mandhi dhyram ga tama peru(id) pettagaligaru?? meru poratam chestara???

1.toti employ ni respect ivvdam nerchukomandi.
me burra lo kastha gujju,me pen lo kastha ink untey saripodu.

mimmlani tesukelly car driver daggar nunchi photographer/cameraman ,editor,graphic desiner,voice artists,PCR vallu vellu anadaru lenidey meru leru ani telusukondi.

me kadupuu nimpukovadm kadu asalu vellu yela unnaru ani kasta pattinchukondi

Ramu S said...

ఈ పై కామెంట్ నాకు సరిగా అర్థం కాలేదు. నేను తోటి వారికి రాస్పెక్ట్ ఇవ్వడం లేదని రాసారు. ఇది కరెక్ట్ కాదు. బుర్ర-గుజ్జు ఏమిటి?
సోదరా/ సోదరీ...నా మీద నీ ఆరోపణ స్పష్టంగా చెప్పరూ. నిజంగా మీరు చెప్పదలుచుకున్నది అర్ధం కాలేదు. please elaborate.
ramu

Anonymous said...

sorry nenu mimmlani analedu
nenu totivari ni pattinchukoni journlists ni antunna.

Anonymous said...

meere ee issue ni lead cheyya vacchukadaa.

Ramu S said...

జర్నలిస్టులకు మేలు చేయాలని ముందుకు ఉరికితే చాలా కష్టం అండి. నాకు ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గా నల్గొండ లో చాలా చేదు అనుభవం ఎదురయ్యింది. వాళ్ళ బాధ వాళ్ళు పడేలా చెయ్యాలి తప్ప..లీడ్ గీడ్ చేయలేము. ఎందుకంటే...ఇందులో చాలా మంది స్వార్ధపరులు, నీతిలేని మహానుభావులు ఉన్నారు. మనలను మధ్యలో ముంచుతారు.
రాము

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి