Thursday, May 13, 2010

పత్రికలు, ఛానెల్స్ లో పరిణామాల సమాహారం...


 సలీం ను పాట్నా పంపిన 'ఈనాడు' 
* 'ఈనాడు' మరొక సీనియర్ జర్నలిస్టు మీద ప్రతాపం చూపించింది. 'ఈనాడు జర్నలిజం స్కూల్' మొదటి బ్యాచ్ కు చెందిన సలీం అనే జర్నలిస్టును బీహార్ రాజధాని పాట్నా కు బదిలీ చేసింది యాజమాన్యం. ఇప్పటికే మల్లికార్జున్ అనే జర్నలిస్టును ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ కు బదిలీ చేసి ఆనందం పొందుతున్న రావు గోపాల్రావ్ బ్యాచ్ తాజాగా సలీం పై కక్ష గట్టడానికి కారణాలు తెలియరాలేదు. సలీం సిటీ డెస్క్ లో పనిచేసారు. మరి అక్కడి విష్ణుకు ఈయనకు బెడిసిందేమో తెలియదు. 
సలీం గారూ...నిజంగా పెద్ద తప్పులు చేసి వుంటే సరిదిద్దుకోండి. లేకపోతే...పాట్నా వెళ్లి హాయిగా పనిచేయండి. సత్యం జయిస్తుంది. ఇలా బదిలీ చేయగానే అలా బెదిరి రాజీనామా చేయడం పిరికివాళ్ళ లక్షణం. అల్ ది బెస్ట్.


'సాక్షి' కి నేమాని భాస్కర్ గుడ్ బై
*మరొక పెద్ద పక్షి N-TV గూటికి చేరుకునేందుకు రంగం సిద్ధమయ్యింది. 'సాక్షి' ఛానల్ ఇన్ పుట్ ఎడిటర్ నేమాని భాస్కర్ మళ్ళీ ఆ ఛానల్ లోకి వెళ్లి పోబోతున్నారు. వై.ఎస్.ఆర్.కు ఆత్మీయ జర్నలిస్టులలో ఒకరైన భాస్కర్ ఉన్నట్టుండి చౌదరి గారి ఛానల్ వదిలి 'సాక్షి' లో చేరారు. వై.ఎస్. ఉన్నన్నినాళ్ళు ఆయన హవా బాగానే నడిచినా ఇప్పటి పరిణామాలు ఆయనకు మింగుడు పడడం లేదని సమాచారం. 
జీ-ఛానల్లో సుఖంగా ఉన్న బీ.టీ.గోవింద్ రెడ్డి అక్కడి నుంచి వచ్చి 'సాక్షి' లో అవుట్ పుట్ ఎడిటర్ గా చేరి అక్కడ పని చేయలేక ఒక రెండు నెలల కిందటే వెళ్ళిపోగా...ఇప్పుడు 'సాక్షి' ఇన్ పుట్ ఎడిటర్ కూడా సొంత గూటికి చేరుకున్నారు. ఇది ఆ జర్నలిస్టుల తప్పా? లేక రామ్ రెడ్డి-స్వప్నక్కల మహిమా? అన్న అంశంపై చర్చ జరుగుతున్నది.

నరేన్ చానెల్ లో మార్పులు
*పెద్ద తలకాయల ఛానల్ N-టీవీ లో సంస్థాగత మార్పులు జరుతున్నాయి. మన 'తెరచాటు వీరుడు' రాజశేఖర్ i-news నుంచి తెచ్చిన బృందం, N-TV పుట్టుక నుంచి ఉన్న టీం మధ్య అక్కడ కోల్డ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో నరేన్ చౌదరి గారు ఉపక్రమించారు. సీనియర్లను జాగ్రత్తగా వాడుకునేందుకు భారీ కసరత్తు చేసి బదిలీలకు రంగం సిద్ధం చేశారు. N-TV నుంచి TV-5 కు వెళ్లి మళ్ళీ అక్కడి నుంచి సొంత గూటికి చేరుకున్న మహాత్మ కొడియార్ ను విశాఖపట్నం బ్యూరో కు బదిలీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అర్జంటుగా అక్కడ బ్యూరోను దృఢ పరుచుకోవాలని చౌదరి సార్ కు సలహాదార్లు చెప్పినట్లు తెలిసింది. 
చౌదరి గారూ....జర్నలిస్టులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా....ఎడిటోరియల్ మీటింగులను తమరు అడ్రెస్ చేయడం కొనసాగిస్తే....మన ఛానల్ ముందుకు పోవడం కష్టం సార్. అంత మంచి తలకాయలను అమ్ములపొదిలో ఉంచుకొని ఇంకా మీ ఆఫీసు పక్కనున్న TV-5 ను పడెయ్యలేకపోవడానికి మీరు, మన రావు బాబాయ్ కారణమని మీ జర్నలిస్టులు బైట చెప్పుకుంటున్నారు.

i-news నుంచి బైటికి వచ్చిన బుడన్
*i-news అవుట్ పుట్ ఎడిటర్ గా కందుల రమేష్ TV-5 నుంచి తెచ్చి పెట్టుకున్న బుడన్ ఆ ఛానల్ నుంచి బైటికి వచ్చాడు. రమేష్ చెప్పా పెట్టకుండా తనదారి తాను చూసుకోవడం, అక్కడి బ్యాచ్ తనపై యాజమాన్యానికి లేనిపోనివి చెప్పడం తో బుడన్ మనస్తాపంతో బైటికి వచ్చారని తెలుస్తోంది. 'ఈనాడు' పేపర్ లో, ఆ తర్వాత 'ఈ-టీవీ'లో పనిచేసిన బుడన్ ABN- ఆంధ్రజ్యోతి లో కొద్ది రోజులు పనిచేసి TV-5 కు వెళ్ళారు.

i-news లో ఎన్.ఆర్.ఐ.పెట్టుబడి?
*తీవ్ర ఆర్థిక సంక్షోభం లో ఉన్న i-news కు ఎట్టకేలకు ఒక పెట్టుబడిదారుడు దొరికినట్లు సమాచారం. ఒక ఎన్.ఆర్.ఐ. కి వాసు వర్మ బృందానికి మధ్య చర్చలు జరిగి ఒప్పందం కురినట్లు తెలుస్తున్నది. గతంలో 'ఈ-టీ.వీ'లో పనిచేసిన రమణ అనే జర్నలిస్టు ఆ ఎన్.ఆర్.ఐ.తరఫున రంగ ప్రవేశం చేసినట్లు చెబుతున్నారు.

TV-9 లో 'ఈనాడు' వేగు? 
*ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఒక వెలుగు వెలుగుతున్న రవి ప్రకాష్ అంటే 'ఈనాడు' గ్రూప్ కు భయం. రామోజీ సామ్రాజ్యాన్ని ఒక్క కుదుపు కుదిపిన జర్నలిస్టు ఎవడైనా ఉన్నాడంటే....అది రవిప్రకాష్. అలాంటి రవి దగ్గర చేరిన 'ఈనాడు' మాజీ ఒకరు ఇప్పటికీ 'ఈనాడు' యాజమాన్యానికి సన్నిహితంగా ఉంటూ బైట పనులు చేసిపెడుతున్నట్లు తెలిసింది. ఆ మాజీని  'ఈనాడు' యాజమాన్యం కులం కార్డు ద్వారా, పూర్వ పరిచయాల ద్వారా దగ్గర చేసుకుని పనులు చేయించుకున్నట్లు చెబుతున్నారు. 'మార్గదర్శి' గొడవల సందర్భంగా ఈ మాజీ ద్వారా 'ఈనాడు' కొన్ని డాక్యుమెంట్లు తెప్పించుకున్నట్లు భోగట్టా. విచిత్రం ఏమిటంటే...ఈ మాజీ 'ఈనాడు' సారు...అక్కడ మాయ మాటలతో రవిని కూడా బోల్తా కొట్టిస్తున్నారట.
'ఇది నిజమేనా...బ్రదరూ' అని అడిగితే ఆ ముదురు జర్నలిస్టు నుంచి వివరణ వచ్చే అవకాశం లేనందున ఆ ప్రయత్నం చేయలేదు.  

11 comments:

Anonymous said...

Tam ratings total AP
tv9 -2.62
tv5- 1.97
ntv -0.89
inews - 0.68
etv2 -0.64
sakshi - 0.57
abn - 0.51
hm tv - 0.49
zee 24 -0.38
studio n -0.33
mahaa -0.21
gemeni - 0.06

Tam rating AP rest 1 million plus towns lo

tv5 - 4.01
tv9 - 3.49
inews - 1.42
ntv -0.91
abn - 0.7
sakshi - 0.58
etv2 -0.52
zee24 -0.38
hm tv -0.28
studio n - 0.28
mahaa - 0.21
gemini -0.04

Anonymous said...

ramuji, Salim meeda mee comment ematram baaledu. mee lanti vaallu kooda passing statements istaraa? contributors antaa samburaalu chesukuntunte.
ika nemani sakshi lo unna, N lo unna okate. Akkada avasarmani pampi untaru.
Yasonath unnanta kaalam TV5 ki tiruguledu. Evarochina emee cheyyaleru.

Ramu S said...

సోదరా,
సలీం గారి మీద నేను ఏమి కామెంట్ చేసాను? పాసింగ్ రిమార్క్ ఏమీ చేయలేదే. నేను తెలీకుండా ఆయనను నొప్పించి వుంటే తెలియజేయండి. I didn't mean to hurt him.
ramu

Anonymous said...

annayya....
MNV PRASAD (TV-9)
CVLN PRASAD (ABN)
veella gurinchi, vella yedugudala gurinchi raayavaa???
Yeduruchoosta.
-abhimaani

rammy said...

రామూ గారూ ఈనాదు లోని బదిలీల జాబితా మొత్తం ఉంటే ప్రచురించండి నేను జర్నలిస్టుని కాను.ఈ బ్లాగ్ ఆసక్తిగా చదువుతాను.

Anonymous said...

రాము భయ్యా.. మీ కామెంట్లు చదువుతుంటే.. ఈనాడులో విష్ణు వర్గీయుల అభిప్రాయాలను మాత్రమె తీసుకొని రాస్తున్నట్లు ఉంది. మారెన్న అవినీతిని ప్రస్తావిన్చరు.. కాని సలీం ను మాత్రం తప్పులుంటే సరి దిద్దుకోండి అని సలహా ఇస్తారు ... ఇదేమ అన్యాయం భయ్యా... రాహుల్ను తెగుడుతారు.. కాని ఎమ్మేన్నారు వర్గియులను వెనుకేసుకోస్తారు.. బయట ప్రపంచం ఇంకా చాలా ఉంది.. కొద్దిగా అది కూడా చూడండి.. వీలయితే సలీం తో కూడా మాట్లాడండి.. బాగుంటుంది..

Ramu S said...

అన్నా,
నేను కనీసం నలుగురిని అడిగాను...సలీం గారి నంబర్ కోసం. మీ దగ్గర వుంటే ఇవ్వండి. మారెన్న అవినీతి చేసి వుంటే దాని గురించి మరింత సమాచారం ఇవ్వండి. ఎం.ఎం.ఆర్.వర్గీయులను వెనకేసుకు వస్తున్నానా? అన్యాయం బ్రదర్. సరే..ముందు సలీం నెంబర్ ఇవ్వండి.
రాము

Anonymous said...

Rahul garu mangamoori ni koppadatam tappa? Aayana enduku chiraku paddado telusukokundaa raste ela? Mangamoori laanti vyakti cheyyalsina panulena avi, tittarante tittaraa mari. Anavasarmgaa rahul garini edo okati analani anadam kaaka pote. Meeku prapancham ante EENADU matramenaa? Migilina chotla emee levaa?

Anonymous said...

hallow
for your kind information
mangamuri srinivas is working at central desk not kakatheya. worngal choosedi g.venkateswara rao.former reporter(3years experience,no out put.
mari rahul warangal vishayamlo mangamoorini tittadani kamreduku kopa vachchindani vrasavu, currect chesuko bhayya.
wel wisher

Anonymous said...

ramu garu...

Journalist lani badilee chesthe paapamaa....

Appointment icche tappude ekkadainaa work cheyyyalani elaanti udyogulakainaa cheputaare.

mari meeku eenadu lo badileelu maatrame pedda issue ayipotundemiti.

maa post lu chaduvuthunte saamaanyula maina maake meeru konni vargaalaku favor raastuntaaru anipisthoo untundi. idem nyaayam satyasodhakudu gaaroo.

Anonymous said...

HALLO RAMU BROTHER
EENADU MANAGEMENT KI HEART UNDI ANI NIRUPINCHE OKA SANGHATANA FLA...SH NEWS
SANKARA RAO ANE PEDDAYANA BELONGS SRIKAKULAM NI MONNA JARIGINA TRANSEFORS LO ANANTHPUR VESARU. AYANA GOOD PERSON.WORK MINED PERSON.AAYANNI MARALA HYDERABAD LO SAME PLACE IN CENTRAL ANDHRA DESK LONE UNDA MANNARU
THIS IS FLASH NEWS
WELWISHER

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి