Tuesday, May 18, 2010

బెస్ట్ యాంకర్/ప్రజెంటర్ సర్వే...తెల్చేద్దాం రండి...

మన తెలుగు న్యూస్ ఛానెల్స్ లో ది బెస్ట్ యాంకర్/ప్రజెంటర్ వీరని నేను రాసిన పోస్టుకు మిశ్రమ స్పందన వచ్చింది. నేను పేర్కొన్న పేర్లకు చాలా మంది 'ఎస్...ఓ.కే.' అంటే....కొందరు 'ఛీ...ఛీ..' అన్నారు. మేము కొందరిని కించపరిచానని తెలియజేసారు. అలా బాధపడిన వారికి సారీలు. కులం లెన్సులు కళ్ళలో ఫిక్స్ అయివున్న ఒక మందమతి...సామాజిక వర్గాలు...అనే ప్రేలాపన చేశారు--ఈ యాంకర్ల కులగోత్రాలు సేకరించడం తప్ప మాకు ఇంకోపనిలేనట్లు. జర్నలిజంలో ఉంటూ కులంతీట ఉన్నవాడు...'పేడతొలుచు పురుగు, కష్మలంలో ఈగ' అని ఒక కవిమిత్రుడు చక్కగా సెలవిచ్చాడు. 

ఈ గొడవ ఎందుకని...వచ్చిన ఒక ఆలోచన ఇది. ఇది ఒక సర్వే. ది బెస్ట్ యాంకర్స్ ఎవరో మనమే తెల్చేద్దాం. బద్ధకం వదిలేసి...ఇది నిజంగా సవాలుగా స్వీకరించి..ఈ ప్రశ్న పత్రం నింపి కామెంట్స్ లో పెట్టండి. మీ పేరు రాస్తే మహా సంతోషం (తల్లిదండ్రులు అంత ఆనందంగా, వేడుకగా నామకరణ మహోత్సవం రోజు పెట్టిన పేరు రాసుకోకపోవడం నిజానికి నేరం, ఘోరం అంటారు), ఒకవేళ కారణాంతరాల వల్ల, అహంకారం అనుమతించకపోవడం వల్ల పేరు రాయలేని పరిస్థితి వస్తే...మీరు పనిచేసే ఛానల్ లేదా పత్రిక లేదా సంస్థ పేరైనా రాయండి. 

ఈ సర్వే ఆధారంగా 'ది బెస్ట్' యాంకర్ ను తెల్చేద్దాం. ఒకరు ఒక్కసారే ఇది నింపండి. మనమో, మన మిత్రుడో/ మిత్రురాలో గెలవాలని పది పేర్ల మీద పంపకండి. ఇక్కడ నైతికత ముఖ్యం, మీ మనసే మీకు సాక్షి. ఇది కేవలం న్యూస్ ఛానెల్స్ కు పరిమితం. మీడియా ఆఫీసుల్లో బాసులు కూడా ఈ బ్లాగ్ చూస్తున్నారని మాకు తెలుసు. వారిని కూడా సవినయంగా ఈ సర్వేకి ఆహ్వానిస్తున్నాం. వారి కామెంట్ చాలా విలువైనది. ఇలాంటి సర్వేలు నిజాయితీ తో చేస్తే...మనం కొత్త సంప్రదాయానికి తెరలేపినట్లు అవుతుంది. ఒక స్పోర్టివ్ పనిగా ఉంటుంది.

జర్నలిస్టులం...కదా...'ఇది చేస్తే మరి మాకేంటి?' అన్న ప్రశ్న ఈ పాటికే ఉదయించి వుంటుంది..చాలా మందికి. డోంట్ వర్రీ. మీరు ఎంపిక చేసిన బెస్ట్ యాంకర్స్ ను మేము ప్రత్యేకంగా కలిసి సొంత ఖర్చుతో కొన్న బహుమానాలు ఇస్తాం. అదే విధంగా మూడు ది బెస్ట్ పరిశీలనలకు కూడా బహుమతులు ఉంటాయి. అయితే...రాయల్ గా పేరు, ఛానల్ పేరు, మెయిల్ ఐ.డీ.రాసిన వారిని మాత్రమే ఇక్కడ పరిగణనలోకి తెసుకుంటాం. ఇక ప్రశ్నావళి.....

1) తెలుగు న్యూస్ ఛానెల్స్ లో మీరు నచ్చే  యాంకర్?
2) ఎందుకు మీకు ఆమె/అతడు నచ్చింది/ నచ్చాడు?
3) మీకు నచ్చని యాంకర్ ఎవరు? కారణాలు?

వెరీ సింపుల్. ఇక మీదే ఆలస్యం. రిప్లై సంక్షిప్తంగా ఉండేట్టు చూడండి. ఈ పోస్టు చదివిన ప్రతి ఒక్కరు ఈ సర్వే లో పాల్గొంటే బాగుంటుంది. జర్నలిస్టులు మాత్రమే కాదు....బ్లాగర్స్, రీడర్స్ అంతా ఇందులో పాల్గొనవచ్చు. చెప్పాం కదా....మనసే సాక్షి. ఒక వారం తర్వాత ఫలితాలు ఇస్తాం.
Note: We have decided against publishing comments to protect the identity of the participants of the survey. We are withdrawing today's comments as we felt that these opinions may influence others. Please feel free to write your name and organisation you represent. This post will be the lead post till May 25. Thanks---Ramu & Hema 

22 comments:

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
pandu said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

Ramu garu first meeru me sontha abhiprayam vodilayandi, kamma cast feeling cut chescondi. Media gurunchi baga telsukunnaka sarvaylu chayandi.Komminani is knowledge person but not sut for TV. Rajinikanth is poor subject, Kandula is UR Friend nd TDP person.
one month Watch all News channals ofter decide. pls dont play cast games. becareful. i think eee coment meeru publish chayaru. chadavandi saripothundi...OK BY

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Unknown said...
This comment has been removed by a blog administrator.
SADASIVARAO said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

sir,
chaala mandi chaala antunnaru mee postings gurinchi.

kaani vaatini light teesukondi.mee postings chaala mandiki nachutunayi kabatte daily visit chestunaamu.

maa lanti vari kosam continue mee postings ni cheyandi

Shiva Bandaru said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
Unknown said...

Yenduku Delete cheyatam vaalla Post lu... Kukka Pilla Morigindi anuko... Meeru continue cheyandi mee post lu, chaalaa baagunnaai mee post lu

Saahitya Abhimaani said...

తెలుగు న్యూస్ చానెళ్ళలో ఎంఖర్లు ఎవ్వరూ లేరు. ప్రస్తుతం ఆ పేరుతొ పిలవబడుతున్న వాళ్ళు ఎవ్వరూ కూడా తాము "టి వి లో కనబడుతున్నాం" అన్న "వండర్" లోంచి ఇంకా బయట పడలేదు. వాళ్ళ వాళ్ళ ప్రజంటేషన్లు ఇంకా ప్రాధమిక స్థాయి కూడా చేరుకోలేదు. ఈ స్థితిలో ఉన్నంతలో ఎవరు "గొప్ప" అంటే అదే ఒక ప్రామాణికం అయిపోతుంది, అంతకంటే ఈ ఏంఖరింగు విద్య ఎదగదు.

ఎంఖర్లకు,మంచి రూపం, గొంతు మాత్రమె చాలవు అవి న్యూస్ రీడర్లకు చాలు. ఎంఖర్లు న్యూస్ రీడర్ పని కొంతవరకు చేస్తున్నా వారి ముఖ్య విధి విషయ విశ్లేషణ. ఈ విశ్లేషణ ఎంతవరకూ సవ్యంగా చెయ్యగలరు అన్నది, వారి వారి రాజేకీయ మరియు ఇతర విషయాల పరిజ్ఞానం మీద ఆధార పడి ఉంటుంది. ఈ విశ్లేషణా పటిమ ఏదో ఒక జర్నలిజం డిగ్రీ/డిప్లొమా తీసుకున్నంత మాత్రాన, లేదా ఏదో ఒక చానెల్లో కొన్నాళ్ళు న్యూస్ రీడర్గా పనిచేసినంత మాత్రాన రాదు. నిరంతర పరిశీలన, విశ్లేషణ, అవగాహన, పూర్తి నిష్పక్షపాత ధోరణి, నిర్భయత్వం ఉండాలి. ఆపైన సాధన చేస్తూ పోతూ ఉంటే కొన్నాళ్ళకు పట్టుబడే ఆవకాశం ఉన్నది. ముఖ్యంగా వార్తా పత్రికల్లో సంపాదక బాధ్యతల్లో (అంటే ఊరికే వత్తులు పొల్లులు దిద్దటం కాదు) పనిచేసిన వాళ్ళకి ఈ పరిజ్ఞానం మిగిలిన వారికంటే ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది.

ప్రస్తుతం ఎంఖర్లు డ్రిల్లు మాస్టర్లలాగా వారి కార్యక్రమానికి వచ్చిన వాళ్ళని అదిలించి వారి చేత తమకు కావలిసిన విషయాలు చెప్పించే ప్రయత్నమే జరుగుతున్నది. మొత్తం ఎంఖరింగు ఆయా చానెళ్ళ "పాలసీ" (అంటే ఆ చానెల్ కు ఉన్న రాజకీయ పక్షపాతం) చుట్టూ మాత్రమె తిరుగుతొంది. కార్యక్రమానికి వచ్చిన ఆ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వాళ్ళల్లో వాళ్ళు చండాలంగా ఒక్కసారే మాట్లాడుతూ నానా రభసా చేస్తుంటే, అలా చిరునవ్వుతో వాళ్ళను చూడటమే కాని, వాళ్ళ మైకు కట్ చేసి వాళ్ళను సవ్యమైన చర్చ వైపుకు నడిపే ఎంఖరు ఒక్కళ్ళూ లేరు. వీళ్ళకు చేతయ్యిందల్లా ఒక్కటే, సరిగ్గా సమయానికి "బ్రేక్" తీసుకోవటం, చేతకాని సినీ డైరెక్టరు మాటి మాటికీ "కట్' అని కేకలు పెడుతూ అదే డైరెక్షన్ అనుకున్నట్టుగా. ఒక్కోసారి, ఈ ఎంఖరే వాళ్ళకంటే ఎక్కువగా అరుస్తూ వాళ్ళ గోలలో కలిసిపోవటం కనపడటం కద్దు. చివరికి ప్రేక్షకులు విసుగెత్తి చానెల్ మార్చి భక్తి చానెళ్ళ వైపు పరుగుపెడతారు. మరికొన్నిసార్లు, ఆ వచ్చిన వ్యక్తి కొన్ని అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటే, (చెవుల్లో ఉత్తర్వులు వినబడతాయనుకుంటాను) ఆ వ్యక్తిని చెప్పనివ్వకుండ నిర్ధాక్షణ్యంగా కట్ చేసి పారేసి, లీడింగు ప్రశ్నలు వేసి తమకు కావలిసిన సమాధానం వచ్చేవరకు తరచి తరచి అడిగి ఆ వ్యక్తిని బలవంత పెట్టే ఏంఖర్లూ ఉన్నారు. ఏంఖరింగు అంటే కోర్టుల్లో జరిగే క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ మాత్రమే కాదుకదా. కొంతవరకూ తరచి అడగాల్సిన ఆవశ్యకత ఉన్నా అదొక్కటే చేస్తూ పోయి, బలవంతపు సమాధానాలు రాబట్టటం వల్ల ఒరిగేది ఏమీలేదు. ఏంఖరింగు చెయ్యవలసిన పని, ఆరోగ్యకరమైన చర్చే కాని అవేశకావేశాలను రెచ్చగొట్టే ప్రక్రియ ఎంతమాత్రం,, కాదు, కారాదు. ఎంఖరింగు అంటే వీధి మొగల్లో నిలబడి రాజకీయాలు గురించి భీషణంగా మాట్లాడటం కాదు. పూర్తి సమాజానికి ఒక విషయం అన్ని కోణాల నుండి విషయ పరిజ్ఞానం కలిగిస్తూ ఆ సమస్య/విషయం మీద ఒక చక్కటి అవగాహన కలిగేట్టు చెయ్యగలగాలి. అలా చెయ్యగల సమర్ధత మన టి,వి చానెళ్ళకు కలిగినాక ఇటువంటి "సర్వే" చేస్తే బాగుంటుంది. మరి కొన్నాళ్ళు వేచి చూడటం మంచిది. అలాకాదూ, చిన్నగీత పెద్ద గీత అంటారూ, అలాగే కానివ్వండి!

Anonymous said...

శివగారూ,,సూపరో సూపరు. కడిగి పారెసారంతే,బూడిద,మట్టి కలగలిపి ఇత్తడి గిన్నెలని తోమినట్లు.

Anonymous said...

Hello Ramu,

I've worked in Telugu media between 2003-07 for a period of about three and a half years and now settled in a an internet company for online advertising. I've been following several Telugu media blogs since then, but wonder why I never came across your blog until last week. Any how it's been a pleasant surprise to for me. Infact, I was giving inputs to several blogs about the facts/issues of the channel I worked earlier. Now that none of those blogs are active, I've stopped being a contributor. However, I see that time has returned for me to become active again and start participating media blogging albeit passively. By the way, I worked in ETV2 since its inception as a copy editor and later on became the bulletin incharge (shift incharge as they call in other media houses). But now I am totally out of Telugu media and happily employed by one of the world's best companies. I wish good times are ahead for every Telugu journalist. Will be back with comments/discussions/inputs with non-anonymous profile soon.

Regards

Ramu S said...

dear last anonymous,
Thanks for visiting this blog. Please share your valuable opinions with us. You may write to me your observations on the posts without any reservations. Lets have good discussions. Encourage your media friends to write to us on various topics related to any media.
Cheers
Ramu

నరేష్ నందం (Naresh Nandam) said...

రాము గారూ..

ఆశ ఉండచ్చు కానీ అత్యాశ ఉండకూడదు మీకు.
తెలుగు టీవీ చానళ్లలో యాంకర్లకు ర్యాంకులిద్దామనుకునేంత అత్యాశ ఎందుకు సార్?

అందులో మళ్లీ బెస్ట్ యాంకర్/ప్రెజెంటర్‌ను వెదకటమంటే..

నేతి బీరకాయనుంచి నెయ్యిని తీసీ..
తెలుగు టీవీ ప్రేక్షకులకు మిఠాయి చేసిపెడదామనుకోవటమే!

నేతి స్వీట్లు ఖరీదెక్కువ.. మన బడ్జెట్లో దొరకవు..
డాల్డాతో చేసిన స్వీట్లను చప్పరిస్తూ తినటానికి అలవాటు పడిన మనకు
నేతి మిఠాయి రుచి తెలియదు సార్.

ఎవరైనా మాది నెంబర్‌వన్ నేతి మిఠాయి అని చెప్పినా..
నెయ్యి పేరు చెప్పి డాల్డా వాడేవాళ్లను చూస్తూ నమ్మటం కష్టం.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి