Friday, April 23, 2010

వారెవ్వా.....మీడియా మాఫియా...

'ఆంధ్రజ్యోతి' లో గత రెండు రోజులుగా వస్తున్న కథనాలు మీడియా రంగంలోని వారి నిజస్వరూపాలను బట్టబయలు చేస్తున్నాయి. ఇది మంచి పరిణామం. నిజానికి 'ఆంధ్రజ్యోతి' పత్రిక/ఛానల్తో పాటు అన్ని చానెళ్ళ అధిపతులు, అక్కడి సీనియర్ బాసుల మీద కూడా 'స్టింగ్ ఆపరేషన్స్' చేసి వీళ్ళు అనతికాలంలో ఇంత వినుతికి ఎలా ఎక్కారో, ఎక్కడ విద్యుత్ ప్రాజెక్టులు పెట్టారో, ఏ రాజకీయ పార్టీ నుంచి ఎంత దండుకుంటున్నారో, ఎక్కడ ఎంత భూమి కొన్నారో, ఎందరిని తార్చారో, ఎందరు అమ్మయిల జీవితాలు కడతేర్చారో... ఆరా తీసి, ప్రసారం చేస్తే ఇంకా బాగుంటుంది. 


'సూర్య' పత్రిక అధిపతి నూకారపు సూర్యప్రకాశ రావు, మరొక వివాదాస్పద వ్యక్తి కాళేశ్వర్ బాబా ప్రతినిధి మధ్య డీల్ వార్తను గురువారం 'ఆంధ్రజ్యోతి' బ్యానర్ గా చేసి 'మీడియా మాఫియా' అని పెద్ద వార్త వేసింది. ముందు రోజు ఛానల్ లో దీని గురించి చాలా ఎయిర్ స్పేస్ కేటాయించింది. ఆది నుంచీ వివాదాస్పదుడైన ఈ పత్రికాధిపతి ఒక సామాజిక వర్గానికి వాణి అవుతానని చెబుతూ...పత్రిక పెట్టి ఈ పనిచేసాడు. తక్కువ శ్రమకు వచ్చే ఎక్కువ డబ్బు (ఈజీ మనీ) కోసం ఆత్మలను అమ్ముకునే జర్నలిస్టుల కక్కుర్తి వల్ల మీడియాలో గంజాయి చెట్లు పుట్టుకొస్తున్నాయి.

'ఈనాడు'లో నిత్యం జనాలకు నరకం చూపిన... జర్నలిస్టు ముసుగులోని ఒక మానసిక వికలాంగుడు సూర్యజపం చేస్తూ...ఆ పత్రికలో పబ్బం గడుపుకుంటున్నాడు. ఇలాంటి జర్నలిస్టులు ఆత్మలను, ఆలోచనలను అమ్ముకోబట్టే...థగ్గులు, పుండాకోర్లు, స్టూవర్టుపురం బ్యాచులు ఎడిటర్లు అవుతున్నారు. మీడియాను అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా సంపాదిస్తున్నారు. 


రేటింగ్ లెక్కల ప్రకారం....TV-9 తర్వాత స్థానంలో ఉన్న TV-5 లో చిన్న ఉద్యోగి ఒకడు ఒక పది లక్షలు డిమాండ్ చేస్తూ  దొరికిపొయ్యాడని రాధాకృష్ణ గారి ఛానల్ చూపింది. ఛానల్ లో పెద్ద తలకాయల మీద కూడా లోతుగా దర్యాప్తు జరగడం అవసరం. ఇక్కడ కూడా జర్నలిస్టులు కాకుండా...భాజాభజంత్రీ బ్యాచు అవకతవకలకు పాలపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 


పెద్ద జర్నలిస్టుల గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు. జిల్లాలలో ఛానెల్స్ కెమెరామెన్ కూడా ఛానెల్స్ ను అడ్డుపెట్టుకుని ఎంతోకొంత వసూలు చేసుకుంటున్నారు. స్వీయ నియంత్రణ, ప్రొఫెషనలిజం లేమి...వల్ల ఈ పరిస్థితి. జర్నలిజం గురించి తెలియని ఛానల్ యజమానులు మీడియా హౌజులలో కూర్చుని....ఏది వార్తో...ఏది కాదో నిర్ణయించే దుస్థితి పోనంత వరకు 'మీడియా మాఫియా' ఇలా వర్ధిల్లుతూనే ఉంటుంది.   

ఇన్వెస్టిగేషన్ పేరిట స్టింగ్ ఆపరేషన్లు చేయడం, వలకు చిక్కిన చేపలతో బేరాలు చేసుకోవడం, చేపలు కోరినంత కక్కితే స్టోరీ ఆపెయ్యడం, లేదంటే...టెలికాస్ట్ చేయడం...ఛానెల్స్ లో సాధారణమని... యాజమాన్యం మనుషులు ఒకరిద్దరు  ఈ పనిమీదనే ఉంటారని సమాచారం. ఈ విషమ పరిస్థితి నేపథ్యంలో...ఛానెల్స్ మధ్య పోటీ పెరిగి మరిన్ని స్టింగ్ ఆపరేషన్లు జరిగి సో కాల్డ్ జర్నలిస్టుల నిజ స్వరూపాలు బైటపడాలి.

11 comments:

Anonymous said...

ABN channel deserves huge compliments for the story on TV5 as well as Surya newspaper.It is an open secret that most of the media personnel from office boy to the CEO are the members of media mafia with all the characters of mafia gang like threats,blackmailing,harassment,mental torture as they feel their pen and the camera are mightier than any thing on this earth.But unfortunately the politicians,officials,business sector never dare to oppose and fight against the media mafia as they got their own and proffessional interests as anything in the print and channels would definetely damage their image and proffession.
Let ABN start sting operations on others too so as to expose the pollution in the media to trhe common man.ofcourse there are sincere,dedicated,devoted.,disciplined media personnel but who cares and respects them among the gang of mafia of TV5,TV9,Surya etc?

JP.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఇప్పుడు దొంగ వెధవలు చాలా మంది మీడియాలో చేరి దౌర్జన్యం చేస్తున్నారు.కొంత కాలం వీళ్ళ చేష్టలు ఇలాగే కొనసాగితే జన వీళ్ళందరినీ నడి రోడ్డులో గుడ్డలిప్పి చెట్టుకట్టేసి కొట్టడం ఖాయం.

Rajendra Devarapalli said...

రాముగారు," స్టూవర్టుపురం బ్యాచులు"నేను మీరు వాడిన ఈ పదప్రయోగంపట్ల నా నిరసన తెలియజేస్తున్నాను.మీరు కూడా బుర్రతక్కువ సబ్బుల్లాగా అలా రాయటం శోభస్కరం కాదు.ఒకప్పుడు ఆ ఊరు దొంగలదే,అదీ బ్రిటీషుజమానాలో.కాలక్రమంలో చాలామార్పులొచ్చాయి.అన్ని ఊర్లలాగానే ఆ ఊరిలో కూడా ఇంకా కొందరు దొంగలున్నారు.బహుశా భవిష్యత్తులో కూడా ఊంటారు.అంతమాత్రాన ఆ ఊరందరినీ దొంగలనటం మాత్రం సమంజసంగా లేదు.ఈ మధ్య వార్త దినపత్రిక సంపాదకుడు టంకశాల్ అశోక్ గారు ఆ ఊరువెళ్ళి ఒక సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ రాసారు వీలుంటే ఒకసారిచదవండి.ఇంకా ఓపికుంటే స్టూవర్ట్ పురం వారితో దొంగతనాలు ఎవరు చేయించేవారో,ఆ దొంగసొత్తును ఎవరు,ఎంతకుకొనేవారో,కొన్నసొత్తును ఎక్కడపెట్టుబడులుపెట్టి ఎలా కుబేరులయ్యారో ఒక పరిశోధనాత్మక వ్యాసం రాయండి.

Ramu S said...

స్టూవర్టుపురం దోపిడీకి సూచ్యంగా వాడానే తప్ప అక్కడి వారని నొప్పించడానికి కాదు. తప్పుగా అనుకోకండి.
ఇక ముందు దీనిని నివారిస్తాను.
రాము

తెలుగు వెబ్ మీడియా said...

నేను కూడా ఇదే విషయం చెప్పాలనుకున్నాను. మీరు నా కామెంట్ పబ్లిష్ చెయ్యలేదు. బ్రిటిష్ వాళ్ళ టైమ్ లో నేరస్త జాతుల చట్టం అనే చట్టం ఉండేది. ఆ చట్టం జాబితాలో మన రాష్ట్రానికి చెందిన ఎరుకల, తెలగపాముల లాంటి కులాల పేర్లు కూడా ఉండేవి. రాష్ట్రంలో ఎక్కడ గజ దొంగతనం జరిగినా పోలీసులు ఈ కులాలవారిని అనుమానించడం జరుగుతుంది. స్టూవర్టుపురంలో ఎక్కువ మంది ఎరుకల కులస్తులు. వీళ్ళు దొంగతనాలు మానేసినా వీళ్ళకి పోలీస్ కేసులు తప్పడం లేదు. విలేఖరి అయిన మీకు ఈ వార్తలు తెలియవా?

Ramu S said...

శర్మ గారూ...
మీరు చెప్పిన విషయం నాకు తెలిసిందే కానీ పదం పొరపాటున పడిపోయింది. మా గురువు గారు...బూదరాజు గారు స్టువర్టు పురం గురించి చెప్పి..అది అవాయిడ్ చేయమన్నారు. ఆ పోస్టు రాసేటప్పుడు దొర్లిపోయింది. సో సారి...
రాము

Anonymous said...

ABN ఆంధ్రజ్యోతి మీద కూడా వేరే మీడియా గ్రూప్ స్టింగ్ ఆపరేషన్ చేస్తే బాగుండేది . దొరికితేనే కదా దొంగలు , దొరక్కపోతే అందరూ దొరలే. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దొర

Rajendra Devarapalli said...

అవును గానీ ప్రవీణూ నా కామెంటు ఇంకా పబ్లిష్ చెయ్యలేదు నువ్వు??ఇక్కడ రాముగారిని అంటున్నావు?

Saahitya Abhimaani said...

Media conducting sting operation on their brethren! I hope this kind of activity would bring out the "invisible pollution" out into the open.

Anonymous said...

chala vichitramaina vishayam entante chala mandi baitiki vachaka nichudu,nikrushtudu ani titte basulne pani chese samayamlo indrudu, chandrudu ani pogidi kaka padataru.wat a hypocrisy! (ramu garu hope this comment wud be published).

kovela santosh kumar said...

jounralistlanu.. management lanu oke gatana katti ikkada charcha jarugutondi... ramoji, vemuri, suryaprakash, raviprakash.. veellanta managementlu maatrame.. vaalla vyavaharalato mottam medianu jata cherchi journo landarini tittadam sari kaadu.. konni patrikallo, chanallalo jeetalu ivvaka, ads target lu pedite em cheyalo tochaka nana avasthalu paduthunna journolu unnaru.. vaarini gurtinchandi.. medialo managementla policy prakarame journo lu pani cheyalsivastundanna vastavaanni grahinchali. managementla dhoranini vimarshinchandi. entire medianu journo lanu kadu.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి