Sunday, April 25, 2010

మీడియా-ఆత్మశోధన: వేమూరి వారి దివ్య ప్రవచనం

వేమూరి రాధాకృష్ణ గారు మానవుడు, పైగా ఒక పత్రిక, ఛానల్ ఓనర్...కాబట్టి 'దయ్యాలు వేదాలు వల్లించినట్లు..." అనడం పాతకం కానీ...'ఆంధ్రజ్యోతి' పేపర్ లో ఈ రోజు ఆదిత్య అనే పేరుతో 'కొత్త పలుకు' అనే కాలంలో ఆయన పలికిన పలుకులు ఆ నానుడిని గుర్తుకు తెస్తున్నాయి. 'మీడియాకు ఆత్మశోధన అవసరం' అని శీర్షిక పెట్టి మరీ...ఆయన చాలా గొప్ప విషయాలు ప్రవచించారు. ఇంకేమీ పట్టించుకోకుండా...అన్ని పత్రికలు/ఛానెల్స్ యజమానులు ఈ రోజు నుంచి మన వేమూరి గారు రాసిన మాటలు విని తు.చ.తప్పక ఆచరిస్తే...తెలుగు జనం మీడియా ను 'థూ..థూ..ఛీ...ఛీ..' అనడం (అంటే వుమ్మేయ్యడం) వెంటనే ఆపేసి...జర్నలిస్టుల కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిన చల్లుకుంటారు. 

మీడియాను స్వప్రయోజనాలకు, స్వకులస్థుల రాజ్యాభిలాషకు, వ్యాపార వృద్ధికి, శత్రుసంహారానికి వాడుకున్న విద్య ఎవడు మొదలుపెట్టగా, ఎవడు(రు)  ఆచరించి కోట్లకు పడగలెత్తాడో (రో)....తెలుగు నేల మీద పుట్టిన ప్రతి అక్షరాస్యుడికి తెలిసిందే. ఇప్పుడు జనమంతా ఈ అంశం గురించే చర్చించుకుంటున్నారు. 


'సూర్య' అధిపతి నూకారపు, TV-5 విలేకరి వల్ల 'మీడియాలో ఉన్న వారికే రోత' పుడుతున్నట్లు ఈ ఆదిత్యుడు రాసాడు. ఒకప్పుడు విలేకరి అంటే...కొంత గౌరవం ఉండేదని...ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాడు. రెండు దశాబ్దాల కిందట 'బ్లాక్ మెయిలింగ్' అన్న పదమే జర్నలిస్టులకు తెలిసేది కాదని సూత్రీకరించాడు. ఇక ఈ వ్యాసంలో మూడో కాలంలో రాసిన ఒక వాక్యం చూసి నాకూ దిమ్మతిరిగింది. అది:
"సమాజాన్ని చదివిన వారు, సామాజిక సమస్యలను ఆకళింపు చేసుకున్న వారు మాత్రమే ఉండవలసిన మీడియాలో వాణిజ్య దృక్పథం మాత్రమే కలిగిన వ్యక్తులు ప్రవేశించడం వల్ల పరిస్ధితులు మరింత వేగంగా క్షీణిస్తున్నాయి." అబ్బ...ఎంత గొప్ప మాట! ఇలా వాణిజ్య దృక్పథం కలిగిన దరిద్రులు, నీచ నికృష్టులు ఐస్లాండ్ వాల్కనోలో పడి మాడిమసై పోవుగాక!?


తాను ప్రసారం చేసిన/ ప్రచురించిన వార్తపై నూకారపు పరివారం 'సూర్య'లో రెచ్చిపోయి దాడి చేయడాన్ని వేమూరి అంతర్లీనంగా మూడు, నాలుగు కాలమ్స్ లో ప్రస్తావించారు, మూగగా రోదించారు. "మీడియా ఆరోపణలకు గురవుతున్న వారు తలదిన్చుకోవలసింది పోయి ఎదురు దాడికి దిగేందుకు సాహసం చేస్తున్నారు. ఇది దుష్ట సంస్కృతి..." అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాసంలో ఒకొక్క లైను ఒకొక్క ఆణిముత్యం. ఒక గౌతమబుద్ధుడు, ఒక గాంధీ, ఒక టీ.ఎన్.శేషన్, ఒక జే.పీ. వంటి వారు...మాత్రమే మీడియా గురించి ఇలా ఆలోచించగలరు. ఇప్పుడు మన వేమూరి ఆలోచిస్తున్నారు, రాస్తున్నారు. ఇది తెలుగు నేలకు శుభ పరిణామం.


"మీడియాలో పరిణామాలు ఇలాగే కొనసాగితే అంతిమంగా నష్టపోయేది సమాజం-ప్రజలే. ఈ ముప్పును నివారించగలిగేది జర్నలిస్టులు మాత్రమే. ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది...పరిస్ధితులు మరింత విషమిస్తే జర్నలిస్టులను అంతరించిపోతున్న జాతిగా గుర్తించవలసిన పరిస్ధితులు ఏర్పడడం తథ్యం,"అని ఆయన ముక్తాయిపు ఇచ్చారు. 

"ఓహ్...రాధాకృష్ణా! అన్నయ్యా...ఎంత గొప్ప మాట చెప్పారు? ఏమిటి మీలో ఈ పరివర్తన? మీరు ఈ వ్యాసం ఏ బోధివృక్షం కింద కూచొని రాసారు?," అని అబ్రకదబ్ర అడిగితే...నవ్వొచ్చింది. జర్నలిస్టులు ఆత్మవిమర్శ చేసుకోనవసరం లేదు బ్రదర్, ఈ రోజు అన్నం తినే ముందు...మీరు ఒక్కరు ఆత్మవిమర్శ చేసుకోండి. సంస్కరణ మన ఇంటి నుంచే ఆరంభిద్దాం. మీరు ఒక్కరు గుండె మీద చేయివేసుకుని....విశ్లేషించుకుని....ఇవ్వాళ మారితే...అంతరించి పోతుందని మీరు బాధ పడుతున్న జర్నలిస్టుల జాతి అజరామరం, ఆచంద్రతారార్కం అవుతుంది. ఆల్ ది బెస్ట్.
నోట్: 'ఆంధ్రజ్యోతి'లో వచ్చిన ఈ వ్యాసంలో...కనీసం పది చోట్ల 'పరిస్ధితులు' అన్న మాట కనిపిస్తూ...వేమూరి రాధాకృష్ణ గారు ఎంత బాధపడుతూ దీన్నిలిఖించారో తెలియజేస్తుంది.

22 comments:

తెలుగు వెబ్ మీడియా said...

నూకారపు గారికి నిజంగానే కులగజ్జి ఉంది. తన కులంవాళ్ళ చేత ఆంధ్ర జ్యోతి పేపర్లు తగలబెట్టించి ఆ ఫొటోని ముఖ పేజిలో వేశాడు.

Anonymous said...

Asalu ee AJ patrike kaadu..inka RK gurinchi maatladukovadam manaku time waste....

Anonymous said...

Asalu ee AJ patrike kaadu..inka RK gurinchi maatladukovadam manaku time waste....

తెలుగు వెబ్ మీడియా said...

ఈ ఇమేజ్ వీక్షించండి: http://stalin-mao.net/wp-content/uploads/2010/04/surya_aj.png సూర్యప్రకాశరావు ఈ రోజు కూడా ఆంధ్ర జ్యోతి మీద విమర్శలు చేశాడు.

Ravikrishna said...

Radha krishna is one of the waste fellow....." Ayana cheste samsaram ga, ade pakkana vallu cheste vyabhicharam " ga feel avutadu...

Anonymous said...

నీతి చెప్పడం జర్నలిస్టుల ప్రథమ కర్తవ్యం. అది తప్పేమీ కాదు. కేవలం జర్నలిజం పాడైపోతోందని బాధపడడం తప్పేమీ కాదే?

Anonymous said...

ఒక్క రాధాక్రిష్ణని అని లాభం ఏమిటి? నిజానికి ఉన్నవాళ్ళలో అతనే కొంత నయం.

Anonymous said...

Baaaasuuuu antha scene ledu. Radha krishna gurinchi maaku cheppaku. Gatha 14 elluga pakkane vundi chusthunnanu. Gatha enimidelluga maree pakkanundi chusthunnanu. Athaniki antha scene ledu. Okka mukkalo cheppalante anni vidhaluga waste fellow. +vega, -vega rendu rakaluga aalochinchanu athani gurinchi... labham ledu. No doubt he is one dirty fellows.

Anonymous said...

Dayachesi Radhakrishnanu pogadakandi babulu. J.P.ne antha scene ledu ani thittinavadu. Okasari oka Tv channel lo J.P. ki ivvalsina danikanna ekkuva publicity ichamu ayanaku antha scene ledu ani rechipoyadu. J.P.lo kaneesam 0.0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000001% commitment gani, loka gnanam kani R.K.ki vunte ade padivelu. R.K. gurinchi nakante ekkuvaga thelisina vallu maha ante oka mugguro, naluguro vuntaremo. R.K. gurinchi antha apohalu pettukokandi. Ramu raasindi inka chala thakkuva.

చిలమకూరు విజయమోహన్ said...

ఎందుకు మీ బ్లాగులో ఎక్కువగా అజ్ఞాతలుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు? పేరు చెప్పుకోలేనంత పిరికివాళ్ళా వాళ్ళు!

Ramu S said...

విజయమోహన్ గారు,
ఈ బ్లాగును ఎక్కువగా జర్నలిస్టులు చదివే అవకాశం ఉంది. వారు పిరికివారు. మీడియా బాసులకు వారు భయపడతారు. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే బ్లాగ్ విజిట్ చేసే వాళ్ళే ఎక్కువ. నిజానికి మీడియా హౌజ్ లలో ప్రజాస్వామ్యయుతమైన వాతావరణం లేదు.
అందుకే నేను అనామికలను అనుమతిస్తున్నాను.
ఇంతకూ నేనే కామెంట్స్ రాసి పెట్టుకున్టున్నానని అనుకుంటున్నారా ఏమిటి? ఆ పనిచేయాల్సి వస్తే నీతిసూత్రాలు మొదటి పేజీ నుంచి తీసేస్తాను.
రాము

సుజాత వేల్పూరి said...

జర్నలిస్టులకు అజ్ఞాతంగానైనా తమ బాధల్ని ఒక చోట చెప్పుకునేందుకు, ఆగ్రహాన్ని ప్రకటించేందుకు ఒక వేదిక దొరికినందుకు సంతోషించాలి. ఒకవేళ నులుగురూ ఒకచోట చేరినా ఎవరికి ఎవరు గూఢచారో చెప్పలేం కనుక ఇటువంటి వేదిక ఒకటి తప్పక ఉండాలి. ఉండాలి.

Anonymous said...

Why are we now dragging the complete topic on to andhra jyothi. This has become a big strategy these days for everyone not to clean up their shit but pointing towards others. I think now surya better try to clean up allegations made on him or just shutup. If you get a zero in your progress report, dont tell your dad that even sunil has got zero like you. Dad will slap you !

Anonymous said...

I request every one to go through an article in The Hindu,dt24/4/10 titled "This journalism requires no sweating" by Vidya Subramanyam in OPEN ED page.
JP.

Anonymous said...

I have seen many sensible/serious comments from Anonymous than open IDs!
Open IDs come only to 'cheer-up' :P

Unknown said...

is adithya none other than RK ?

Saahitya Abhimaani said...

There is one more good article in The Hindu on April 17, 2010 entitled "How to feed your billionaires" on the IPL imbroglio. The article very well dealt with as to how Media conveniently forgot to ask all the relevant questions right from the beginning. One sentence in the article is quite good "...........and to avoid induced amnesia........" I recommend the article to be read by all those who love free media.

Anonymous said...

కుల గజ్జి పరాకష్టకు చేరింది ఆ పేపర్ కులపోళ్ళ కారణం గానే. వారు ఆ రోజులలో కమ్యునిస్ట్ పార్టి లో చేరి దానిని బ్రష్టు పట్టించారు. ఇప్పుడు మీడియాలో చేరి దానిని అధొగతి అంచుకు తీసుకు పోయారు.

Vinay Datta said...

@JP garu:

The page you asked us to read could not be opened on the net. Can you pleas give details of the article or download it and attach?

Anonymous said...

Ramu garu,
Andhra Jyothi has started discussion on the artcile of Aditya,"Media ku aathma shodhana avasaram" from the readers.I request you to kindly send a detailed letter to AJ what have been expressing on media in particular AJ definetely.
JP.

Anonymous said...

Madhuri garu,
Please visit the site of thehindu.com and click archives/datewise which is on left side and you cam select the date APRIL 24TH and can see the article by clicking opinion on left side.
JP.

Unknown said...

Ramu S గారూ...,వేమూరి రాధాకృష్ణ గారు మానవుడు, పైగా ఒక పత్రిక, ఛానల్ ఓనర్...కాబట్టి 'దయ్యాలు వేదాలు వల్లించినట్లు..." అనడం పాతకం కానీ...'ఆంధ్రజ్యోతి' పేపర్ లో ఈ రోజు ఆదిత్య అనే పేరుతో 'కొత్త పలుకు' అనే కాలంలో ఆయన పలి_____________________ఆసక్తికరంగా వుండి చక్కగా పండింది. తాజా సమాచారం కోసం ప్రతీ రోజు మీ పోస్టులు చదువుతాను

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి