Sunday, April 25, 2010

'ఈనాడు'కు బాండు ఇచ్చి ఇరుక్కున్న జర్నలిస్టులూ.....

ఎంతమంది జర్నలిస్టులు వెళ్ళిపోయినా లెక్క చెయ్యం....లిఫ్టు బాయ్ లతో, కార్ డ్రైవర్ లతో పేపర్ నడుపుతాం....అని బీరాలు పలికిన 'ఈనాడు' గ్రూపు ఇప్పుడు ఆ ఆత్మస్థైర్యం కోల్పోయింది. ఇన్నాళ్ళూ తాను వద్దనుకున్న జర్నలిస్టులను పొమ్మనకుండానే పొగబెట్టి పంపిన 'ఈనాడు'...ఇప్పుడు సంస్థ నుంచి  వలసలను నిరోధించేందుకు 'బాండు' మీద ఆధారపడుతున్నది. 

ఈ 'బాండు' ప్రకారం...సంస్థ నిర్వహించే 'ఈనాడు జర్నలిజం స్కూల్' లో సీటు వచ్చిన వారు...మూడేళ్ళు సంస్థ కోసం పనిచేస్తామని రాసివ్వాలి. ఈ నిబంధన పాటించడంలో విఫలమైతే...లక్ష రూపాయలు చెల్లించాలి.
'మార్గదర్శి' చిట్ పాడుకున్నప్పుడు/ వడ్డీవ్యాపారి దగ్గరకు వెళ్ళినప్పుడు అడిగినట్లు ఈ సంస్థ కొన్ని స్యూరిటీలు అడుగుతుంది.... బాండ్ లో భాగంగా. ప్రభుత్వ ఉద్యోగుల గ్యారెంటీ తీసుకుని...ఉద్యోగులను బంధించి మరీ పనితీసుకుంటుంది. ఇలా బాండు మీద సంతకం చేసి అక్కడ పనిచేయలేకనో...మంచి అవకాశాలు దొరికటంవల్లనో బైటికి వచ్చిన వారు దాదాపు యాభై మందిని 'ఈనాడు' కోర్టు నోటీసులతో ఇబ్బంది పెడుతున్నది. 

'నన్ను డెస్కు లో వేశారు. డీ.టీ.పీ.ఆపరేటర్ లాగా పనిచేయించుకున్నారు. నాకేమో రిపోర్టింగ్ ఇష్టం. ఇక అక్కడ పనిచేయలేక వేరే పత్రిక చూసుకుని జాయిన్ అయ్యాను. ఇప్పుడు నాకు నోటీసులు ఇచ్చి ఈ సంస్థ మానసికంగా వేధిస్తున్నది," అని ఇప్పుడు ఒక ఛానల్ లో పనిచేస్తున్న ఒక మిత్రుడు వాపోయాడు. ఇతనితో పాటు...ఇతనికి స్యూరిటీ ఇచ్చిన వారికి కూడా నోటీసులు పంపుతున్నది...'ఈనాడు.' 

ఇలా బాండు లు రాయించుకోవడం...ఐ.టి.సంస్థలలో కూడా ఉంది కానీ...ఫక్తు రాజకీయ అజెండా తో పనిచేసే ఏ సంస్థ తో అయినా...జర్నలిస్టులు చచ్చినట్లు పనిచేయాల్సిన పనిలేదు. ఈ సంస్థ నిష్పాక్షిక జర్నలిజం ఆచరించడంలేదు కాబట్టి...బాండు ను ఉల్లంఘిస్తున్నట్లు వాదించవచ్చు. అందుకు సాక్ష్యాలు కోకొల్లలు చూపించవచ్చు. 

"శ్రీధర్ అనే వాడు కక్షగట్టి నన్ను పొరుగు రాష్ట్రానికి బదిలీ చేయించాడు. అక్కడికి పోకుండా...నేను వేరే ఛానల్ లో జాయిన్ అయ్యాను. నాకు నోటీసులు ఇచ్చి హింసిస్తున్నారు," అని ఒక మహిళా జర్నలిస్టు చెప్పారు. ఈ నేపథ్యంలో కొన్ని సూచనలు చేయడానికి ఈ పోస్టు రాస్తున్నాము. 

నిజానికి జర్నలిస్టు బాండుకు కట్టుబడి ఉండాలని పట్టుబట్టడం International Federation of Journalists (IFJ) నియమావళికి వ్యతిరేకం. వందకు పైగా దేశాలలో లక్షల మంది జర్నలిస్టులు సభ్యులుగా ఉన్న ఈ సంస్థను ప్రభుత్వాలు, కోర్టులు గౌరవిస్తాయి. ఇందులో మూడో క్లాజ్ ప్రకారం... రాజకీయంగా, సైద్ధాంతికంగా, మతపరంగా పత్రిక యజమానిలో మార్పు వస్తే...ఉద్యోగి ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ఉద్యోగం మానెయ్యవచ్చు. పైగా నష్టపరిహారం కూడా డిమాండ్ చేయవచ్చు. అందుకు సంబంధించిన పూర్తివివరాలు http://www.ifj.org/en లో వెతికి సాధించవచ్చు. 


మీ లాయర్లకు ఈ విషయం తెలియకపోవచ్చు కాబట్టి వెంటనే...ఈ విషయాన్ని కోర్టులో వాదనకు ఉపయోగించేందుకు ఉన్న అవకాశాన్ని పరిశీలించమని వారిని కోరండి. అక్కడ పనిచేసే వాతావరణం లేకపోయినా...బలవంతాన పనిచేయాలని బాండు బూచి చూపితే...మీరు పలు అంతర్జాతీయ సంస్థల సహకారం పొందవచ్చు. IFJ మూడో క్లాజ్ ఈ కింది విధంగా ఉంది.

3. CLAUSE OF CONSCIENCE

3.1 Journalists must have the right to act according to their conscience in the exercise of journalism. In case of fundamental change in the political, philosophical or religious line of the employer, a journalist may put an end to his or her contract, without notice, and be paid compensation equivalent to what he or she would have received in case of termination of his or her contract by the employer.

3.2 No journalist should be directed by an employer or any person acting on behalf of the employer to commit any act or thing that the journalist believes would breach his or her professional ethics, whether defined by a code of ethics adopted by journalists collected at national level or that would infringe the international Code of Principles for the Conduct of Journalism as adopted by the IFJ. No journalist can be disciplined in any way for asserting his or her rights to act according their conscience.

19 comments:

Anonymous said...

Dear Ramu
As a journalist i am sorry to post this comment, but for the sake of journalist friends i am posting this message...
Corruption allegations against Surya Journalists creating waves in media circles...
But the same shameful allegations araising again on one CEO..
Every one can asses who will be the CEO...
Yesterday, dated 24th April, 2010
one of the journalists in NTV went to Women Entrepreneur Kanneganti Ramadevi. She was the past chariman for ALEAP., and blackmailed her for exposing her illegal properties list.
According to some sources their conversion is like this:

Journo: Medam meEku bInaaMi aSthulu unnaTlu NForce dHrustiki vacchiMDI... MAA sIR MatLAADAmamdutunnaru.

Ramadevi: eVaru mEE sir. eM maatlaadaali...

Journo: tEleeda TV9lo cheshAAru gadaa Rajasekhar sir...

Ramadevi: oKasaari Ayanaki phone kAlapamdi

Journo rings Rajasekhar:
Tring Tring ( No Answer)

Journo: sIR lift chEyyaDamledu busygaa umtaaru... mEEru alochimchukomdi.. idi sir number ... kalustaa...

-------------------------
The above conversation is sensations in NTV Management.
Ramadevi belongs to same NTV Management community.
She had talk with management through their community circles.
Management shocked.
Management recollects Rajasekhar old incidents, which occurs in TV9, aswell as iNEWS...

----------------------------------
Ramu sir we are not sending this message to blame raj....
But, these conversations goes to Radhakrishna's hands. Once again our journos corruption will arise

pls alert with your writing skilss and save tElugu mEdia...

You can have talk with Ramadevi and Check these issues...
98490 22397

Sathish said...

Ramu garu,

Thanks for the info.
I am one of them.

Anonymous said...

It is not proper to say that a journalist could leave before the completion of the bond period. The clause (in the code you have mentioned) that they can leave anytime is questionable. They are ethically supposed to work with the organization that had trained them, paying stiphend, atleast for a fixed period.Eenadu's school of journalism is not a regular college, where students can get trained and 'opt' their employers. They join there only after deciding to work with Eenadu.

Moreover, journalists could also escape for better payment if a certain period is not specified in the bond. They are not the descendants of Satya Harischandra and you cannot trust anybody in any field, not only software.

Iam not an employee of Eenadu.

SHAM... The Inspiration said...

ThanQ Ramu Garu...! Mee salahanu patinchi nyaya poratam chestham... E poratam lo mee saayam thappaka kaavali....

Anonymous said...

Dear Ramu,

Your post would definitely help those journalists who are really suffering from these kind of problems.

Anonymous said...

Evarokani... ethics gurinchi chala baga matladaru. Antha training ichinappudu employees freega manasphoorthyga work chese vathavaranam kalpisthe vache nashtamemiti? Ala kalpinchakunada himsinchadam ea ethics kindaku vasthayo mari. Eado okadu cheppina dantlo thappulu vethakalani prayathninchakandi. Oppu oppe... Thappu thappe.

Anonymous said...

one side bond lu chellavu... 2 and pro bonds chellu taayi.. nannu kudaa EEnadu elaane ibbandi pettindi..


but nenu political influence tho tappinchukunna


sivudu
rajahmundry

తుంటరి said...

I feel its a moral question than legal question, when there is a bond to work for eenadu for 3 yrs why would someone join eenadu journalism school if they are not willing to work for eenadu for 3 yrs. If at all they want to leave before 3 yrs they have to pay 1 lakh penalty or wht ever is there in the bond. thats how IT industry also works.before asking your employer to follow morals you should follow it.

Anonymous said...

Sir, we are more moral and ethical but the problem is with unexpected transfers, unexpected punishments and unexpected demotions without any promotions or hikes. Are all these looking as ethics and morals for you? Don't to be proud with your believed morals and ethics and do not make others fools.

Anonymous said...

థ్యాంక్స్ రాము గారు..

ఈనాడు బాధితుల్లో నేనూ ఒకడినే. ప్రస్తుతం న్యాయపోరాటం చేస్తున్నాం. హైకోర్టు నుంచి ఆర్బిటరేటరీ వరకూ వచ్చింది. ఎవరెవరం ఎందుకు వదలాల్సి వచ్చింది.. ఏ ఏ పరిస్థితుల్లో సంస్థను వదలాల్సి వచ్చిందన్నదానిపై పోరాటం చేస్తున్నాం. ఈనాడును అంటున్నందుకు ఇక్కడ కొంతమంది బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. కానీ.. పీజీ డిప్లోమా ఇన్ జర్నలిజం అని ఊదరగొట్టిన ఈనాడు.. రెండున్నరేళ్లపాటు ఈటీవీలో గొడ్డుచాకిరీ చేసినా డిగ్రీని ఇవ్వలేదు. అసలు ఇవ్వడానికి గుర్తింపే లేదు. ఓ గుర్తింపులేని కోర్సు కోసం మాతో బాండ్ రాయించుకొన్న సంస్థను ఏమనాలో మీరే చెప్పండి..

Wit Real said...

it reminds me the following funny conversation that I had with a friend.

ఒక బ్యాంక్ దగ్గర 3రూ. వడ్డీకి అప్పు తీసుకున్నా.
కాయితం మీద సంతకాలెట్టా.
డబ్బంతా ఖర్చెట్టేసా!
ఇప్పుడు నాకు 3రూ. వడ్డీ అన్యాయం అనిపిస్తాంది

ఏటి సేసేదీ?

బ్యాంకోడెమో తాను సమాజ సేవ సేత్తన్నా నంటాడు
నాకేమో ఆడు మన్ని దోసుకు తింటన్నాడనిపిస్తాంది!

సరే, అసలు మొత్తం కట్టేస్తా అంటే, 4% పెనాల్టీ కట్టమంటన్నాడు

ఏటి సేసేదీ?

కొంచెం ఏ జర్నలిస్టు సంఘం రూలు ఫేవరు గా వుంటదో సెప్పి పుణ్యం కట్టుకోండి సారు!

Ramu S said...

ఏటి సేయ్యాలనిపితే అదే చేసెయ్యి. కాదంటే...ఒక పని సేయ్యి. ముందు బస్సెక్కి పిలిం సిటీకి పో. ఒక ముప్పై రూపాయలు పెట్టి...ఫిలిం సిటీ లోపలకు పో. అక్కడ తెల్ల డ్రెస్సు రామోజీ ఎవరని అడుగు. వాళ్ళు చెబుతారు. చూపెడతారు. ఆయనను అడుగు. మంచిగా సేప్తాడు. అదే ఫాలో అయి పో.
ఉంటా
రాము

Anonymous said...

very good reply Ramu...:))))

Anonymous said...

రామూ గారి టపా ఏకపక్షంగా ఉంది. ఈనాడు జర్నలిజం స్కూలు శిక్షణలో నాణ్యత గురించి, వ్యక్తులలోని నైపుణ్యాలను సానబట్టే వ్యవస్థ గురించీ చెప్పలేదు. ఆ శిక్షణలో విలువ ఉండబట్టే కదా వేరే వాళ్ళు ఎక్కువ డబ్బులిచ్చి ఎగబడి తీసుకుంటోంది. కేవలం ఆర్థికేతర వ్యక్తిగత కారణాలతో మానేసిన వారు ఎందరు?
ఇక్కడ ఇంకో ముఖ్యమైన మానసిక రుగ్మత అందరం గమనించాలి. మనం ఏదో సామాన్యంగా బతికేస్తూ ఉంటాం. ఎవరో మనలో ఉన్న ఒక నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహిస్తారు, దానికి సానబడతారు. మనకి గుర్తింపు, డబ్బు వస్తాయి, కనీసం డబ్బు సంపాదించగలననే ధీమా వస్తుంది. అహం బలుస్తుంది. మనల్ని ప్రోత్సహించినవారిని మరుస్తాం. వాళ్ళు మన టాలెంటుని వాడుకొని(దోచుకొని) పెద్దవాళ్ళైపోదామనుకుంటున్నారని విమర్శించడం మొదలు పెడతాం. అసలు వాళ్ళు గుర్తించకపోతే మనం దేనికి పనికివస్తామో మనకే తెలియదన్న సంగతి మర్చిపోతాం. ఇదంతా మానవసహజం.
ఇప్పుడు మీ టపా దాన్నే బలపరుస్తోంది.
ఒక సంస్థగా ఈనాడు తీసుకొనే జాగ్రత్తలు అనివార్యం అని నేను భావిస్తున్నాను. తప్పొప్పులు ఎవరి ప్రమాణాలను బట్టి, అనుభవాలను బట్టి వారు నిర్ణయించుకోవచ్చు. నైతిక జర్నలిజానికి మద్దతుగా అంటూ మీరు డబ్బుకోసం, డబ్బుకోసమే జండా మార్చేవారిని సమర్ధించడం బాగో లేదు. అందులోనూ కనీసం రెండో పక్షం వాదన, బాధ చెప్పకుండా. మీ నుంచి ఇలాంటి ఏకపక్ష టపా ఊహించలేదు.

Anonymous said...

రామూ గారి టపా ఏకపక్షంగా ఉంది. ఈనాడు జర్నలిజం స్కూలు శిక్షణలో నాణ్యత గురించి, వ్యక్తులలోని నైపుణ్యాలను సానబట్టే వ్యవస్థ గురించీ చెప్పలేదు. ఆ శిక్షణలో విలువ ఉండబట్టే కదా వేరే వాళ్ళు ఎక్కువ డబ్బులిచ్చి ఎగబడి తీసుకుంటోంది. కేవలం ఆర్థికేతర వ్యక్తిగత కారణాలతో మానేసిన వారు ఎందరు?
ఇక్కడ ఇంకో ముఖ్యమైన మానసిక రుగ్మత అందరం గమనించాలి. మనం ఏదో సామాన్యంగా బతికేస్తూ ఉంటాం. ఎవరో మనలో ఉన్న ఒక నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహిస్తారు, దానికి సానబడతారు. మనకి గుర్తింపు, డబ్బు వస్తాయి, కనీసం డబ్బు సంపాదించగలననే ధీమా వస్తుంది. అహం బలుస్తుంది. మనల్ని ప్రోత్సహించినవారిని మరుస్తాం. వాళ్ళు మన టాలెంటుని వాడుకొని(దోచుకొని) పెద్దవాళ్ళైపోదామనుకుంటున్నారని విమర్శించడం మొదలు పెడతాం. అసలు వాళ్ళు గుర్తించకపోతే మనం దేనికి పనికివస్తామో మనకే తెలియదన్న సంగతి మర్చిపోతాం. ఇదంతా మానవసహజం.
ఇప్పుడు మీ టపా దాన్నే బలపరుస్తోంది.
ఒక సంస్థగా ఈనాడు తీసుకొనే జాగ్రత్తలు అనివార్యం అని నేను భావిస్తున్నాను. తప్పొప్పులు ఎవరి ప్రమాణాలను బట్టి, అనుభవాలను బట్టి వారు నిర్ణయించుకోవచ్చు. నైతిక జర్నలిజానికి మద్దతుగా అంటూ మీరు డబ్బుకోసం, డబ్బుకోసమే జండా మార్చేవారిని సమర్ధించడం బాగో లేదు. అందులోనూ కనీసం రెండో పక్షం వాదన, బాధ చెప్పకుండా. మీ నుంచి ఇలాంటి ఏకపక్ష టపా ఊహించలేదు.

Anonymous said...

రామూ గారూ మీ పోస్టు చూడగానే నెత్తిన పాలు పోసినట్లు అనిపించింది. ఈనాడు బాధితుల్లో నేనూ ఉన్నాను.మీ సలహాలు, సూచనలు మాకు ఎంతో ఉపయోగపడతాయి. ప్రస్తుతం మా కేసు ఆర్బిటేటర్ వరకూ వచ్చింది. వాస్తవానికి అంతర్జాతీయ జర్నలిస్టు నిబంధనలు ఉన్నట్లు నాకు తెలియదు. మాకు మీరు మరో అస్త్రాన్ని అందించారు. ధన్యవాదాలు.

Unknown said...

అందరికీ నీతులు చెప్పే ఈనాడు యాజమాన్యం, తన సంస్థలో ఎంత నింయతృత్వంగా వ్యవహరిస్తుందో అందరికీ తెలియాలి. ఎవరో బ్యాంకు నుంచి వడ్డీ తీసుకున్నానంటూ కామెంట్ చేశారు.. అప్పు తీసుకుని ఎగ్గొడితే తప్పే.. కానీ మేం అప్పు తీసుకోలేదు. వన్‌సైడ్ అంటూ మరొకరు ఈనాడుపై ఉన్న అవాజ్యమైన ప్రేమను చాటుకున్నారు. సంస్థలో చేరకముందూ నేనూ ఈనాడంటే పడిచచ్చేవాడిని. కానీ..గుర్తింపు లేని స్కూల్‌లో చదివితే.. ప్రైవేటుగానైనా ఎగ్జామ్ కట్టి పాస్ అయ్యి సర్టిఫికెట్ తెచ్చుకోవచ్చు. కానీ.. ఈనాడు నిర్వహించే పీజీ డిప్లోమా ఇన్న జర్నలిజం కోర్సుకు ఆ అవకాశం కూడా లేదు. కోర్సు అవ్వగానే సర్టిఫికెట్ ఇవ్వాల్సిన ఈనాడు.. ఎందుకని ఇవ్వడం లేదు? వారు బండబూతులు తిట్టినా.. సిగ్గును, ఆత్మాభిమానాన్ని చంపుకొని అక్కడే పనిచేయాలా.. ఏడాది కోర్సులో ట్రైనింగ్ ఇచ్చింది గట్టిగా మూడు నెలలు మాత్రమే. మూడు నెలలు నేర్పినందుకు నాలుగేళ్లు శిక్ష అనుభవించాలా? పరిస్థితులకు తగ్గట్లుగా జీతాలు పెంచకుండా ఇచ్చిన దానితో తృప్తిపడమంటే కష్టమైనా నష్టమైనా పడాల్సిందేనా? అయినా.. ఈనాడు,ఈటీవీలు ఒకే సంస్థకు చెందినవైనప్పుడు.. ఒకే తరహా ట్రైనింగ్ ఇచ్చిన వారికి.. రెండు సంస్థల్లో వేరు వేరు జీతాలు ఇస్తున్నారన్న విషయం సదరు కామెంట్ రాసిన వ్యక్తి తెలుసా? ఇది అన్యాయంపై పోరాటం. ఆక్రందనతో చేస్తున్న పోరాటం. మాలా మరొకరు ఈనాడు బాండులో చిక్కుకోకూడదని చేస్తున్న ప్రయత్నం. వీలైతే సహకరించండి.
- సతీశ్

Wit Real said...

మేనేజ్ మెంటు కోర్సులో థియరీ-X అని ఒక అంశం వుంది. పంతులు గారు ఆ పాఠం చెపుతున్నప్పుడు, ఛా! మేనేజర్లు & వర్కర్లూ ఇలా కూడా వుంటారా అనిపించింది.


మీ బ్లాగు చదివిన తర్వాత, కాన్సెప్టు బాగా అర్థం అయ్యింది!


కానీ ఇంకా ఒక విషయం నాకు అర్థం కావటం లేదు.
మన బుడ్డోల్లు పైన కిందా సూడకుండా బాండు పేపర్ల మీద సంతకాలెట్టెసారా??
ఆ బాండు పేపెర్లలో ఈళ్ళకి 5-స్టారు సౌకర్యలేమైన ఇస్తామని వున్నయ్యా?

జాగర్త గా సదివితె, ఫైను ప్రింటు లో.... సెప్పిన పని సెయ్యాలి, సెప్పిన సోటికి అన్ని మూసుకొని యెల్లాలి..ఇల ఒక 10-15 కండీషన్లు వుండె వుంటాయె?

Naagarikuda Vinu said...

LOL, what's all this fuss about??? Reading all the discussion reminds me of a scene from the movie Pokiri. "Prakash raj pinches the vamp--> she makes a sound out of discomfort--> then the villain says--> "గిల్లితే గిల్లించుకొవాలి అరవకూడదు". I feel nothing wrong with the Eenadu people because, it's the way the corporate world works. As far as my knowledge goes, Eenadu is a private establishment which makes money out of its News paper, t.v channels, finance etc etc businesses. It isn't a charitable or government agency. Regarding this issue, they haven't gone beyond the legal limits.They give u seat, give you some training and sharpen your skills, in return for which ask you to sign a bond for some period. For all those who have watched the movie, "Ghost rider", once you sign the contract with evil, you are bound to abide by it. My two cents!!!
Disclaimer: I am in no way associated with Eenadu, my sympathies to the poor jurnos.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి