Saturday, April 10, 2010

భోలక్ పూర్ విషాదం పై TV-9 లో సూపర్ 'ఫాలోఅప్' స్టోరీ

ఏదైనా విషాదం/ ఘటన జరిగిన కొన్నాళ్ళ తర్వాత మళ్ళా దానిపై దృష్టి సారించడాన్ని జర్నలిస్టుల పరిభాషలో 'ఫాలో అప్' చేయడం అంటారు. అలాంటి స్టోరీ లను 'ఫాలో అప్ స్టోరీలు' అంటారు. భారతీయ జర్నలిజంలో ఫాలో అప్ స్టోరీలు పెద్దగా కనిపించవు. కారణం...మన జర్నలిస్టులకు తీరికా, ఓపికా లేకపోవడం, బాసులలో ప్రొఫెషనలిజం కొరవడడం. 

ఈ రోజు TV-9 ఒక మంచి ఫాలో అప్ స్టోరీ అందించింది. దాదాపు ఒక ఏడాది కిందట హైదరాబాద్ లోని భోలాక్ పూర్ ప్రాంతంలో 15 మంది కలుషిత నీరు తాగడం వల్ల మరణించిన ఘటనను ఈ చానల్ మరొక సారి స్పృశించింది. ఈ సారి ఈ ఛానల్ వారే అక్కడి బోరు నీటిని రెండు ప్రయోగశాలలో పరీక్ష జరిపించి భోలాక్ పూర్ ప్రాంతంలో నీరు ఎంత ప్రమాదకరంగా ఉందో చూపించారు. ఈ కథనానికి 'హాలాజలం' అన్న తగిన శీర్షికను ఇచ్చారు. 

ఈ-కోలై తో పాటు కాల్షియం ఈ నీటిలో ఉందని తేలిందని రిపోర్టర్ చెప్పారు. దాని వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను వివరించారు. ఈ వార్తను ఫీల్డ్ నుంచి రిపోర్ట్ చేసిన మహిళా రిపోర్టర్ (సారీ, పేరు నోట్ చేసుకోలేక పోయాను) అద్భుతంగా దీన్ని ప్రజెంట్ చేశారు. కాస్త చదువుకున్న ఆమెలా ఉన్న ఆ రిపోర్టర్ సూటిగా...స్పష్టంగా విషయాన్ని చెప్పారు. పక్కా ప్రొఫెషనల్  రిపోర్టర్ లా అనిపించారు ఆమె. 

ఛానల్ వెంటనే జీవన్ రెడ్డి (పర్యావరణ వేత్త), వెంకట రావు (వైద్యుడు) గార్లతో ఒక చర్చ కూడా జరిపింది. అందులో పాల్గొన్న యాంకర్ విషయాన్ని చెత్తగా డీల్ చేసినా....మొత్తం మీద రొటీన్ కు, TV-9 తరహాకు భిన్నమైన ఈ కథనం ప్రసారం చేసినందుకు రవి ప్రకాష్ బృందానికి అభినందనలు. జనం సమస్యలు పట్టించుకోండి బాస్...నిజంగానే 'మెరుగైన సమాజం' నిర్మించవచ్చు.  

4 comments:

Saahitya Abhimaani said...

మెరుగైన సమాజం??? అంటే?? మూడు బ్రేకులూ అరవై ప్రకటనా కాలుష్యాలా!!! మా కు వ ద్దే వ ద్దు

Anonymous said...

* Malik gives different names of father

STAFF WRITER 16:34 HRS IST

Hyderabad, Apr 10 (PTI) Pakistani cricketer Shoaib Malik has given different names of his father in his divorce certificate with Ayesha Siddiqui and the wedding invitations for his marriage with Indian tennis star Sania Mirza but it turns out that both the names belong to the same man.

While the divorce certificate and the agreement which Shoaib signed with the Hyderabadi girl Ayesha Siddiqui on April 7, shows his father's name to be Malik Saleem Hussain, while the wedding Invitation card has Malik Faqeer Hussain named as his father.

According to police, the passport of Shoaib, which was taken by them during his questioning following the complaint by Ayesha, also carries the two names of his father.

"His (Shoaib) father's name has been given as Malik Faqeer Hussain alias Malik Saleem Hussain and both the names are of the same person," the police officer said.

After this story also nobody given the correct story, leaving the audience feel shoiab a cheater....

jara said...

ramu garu we need infarmation about the andhra chanal.....plese

Vinay Datta said...

There was a very satire on ABN Andhrajyothi channel on sunday on the entire media giving over importance with over enthusiasm on Sania-Shoaib's wedding. The programme is 'coffee with Kantham'.The anchor and actor of the programme, Jhansi, as usual, was successful in presenting the satire in the right way. I appreciate the guts of the channel for the selection of the topic and for the way it was presented though the channel itself was over enthusiastic about it. They should also have straight forwardly accepted their over curiosity, over enthusiasm.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి