Thursday, May 27, 2010

అనుక్షణం వెకిలి చూపుల దాడి: మహిళలకు రక్షణేదీ?

ఒక పాతికేళ్ళు టూ-వీలర్ మీద, మరొక పదేళ్ళు టూ-వీలర్ తో పాటు ఫోర్- వీలర్ మీద తిరిగి విసుగెత్తి...స్పాండిలిటిస్ తిరగబెడుతుందన్న భయంతో...ఈ మధ్య పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థను విపరీతంగా వాడుతున్నాను. బస్సు, రైలు ఎక్కుతుంటే...చాలా మంది పరిచయం అవుతున్నారు, చాలా విషయాలు తెలుస్తున్నాయి. వాళ్ళ జీవితాలు, అభిప్రాయాలు, బతుకు పోరాటాలు చాలా ఆసక్తికరంగా, విచిత్రంగా ఉంటున్నాయి. 'సిటిజెన్ జర్నలిజం' పేరిట అవి రాయడానికి వేరే బ్లాగ్ పెడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. 
అంతకన్నా ముందు...అన్ని బహిరంగ ప్రదేశాలలో రోజురోజుకు ఎక్కువవుతున్న ఒక పెద్ద బెడద గురించి ప్రస్తావించడం ఈ పోస్టు అసలు ఉద్దేశ్యం. ఇది పూర్తిగా ఈవ్ టీజింగ్ కాని ఈవ్ టీజింగ్, ఒక మానసిక దౌర్భల్యం, జబ్బు. ఒక సంస్కార రాహిత్యం లేదా కుసంస్కారం. మహా ఉన్మాదం.
 

ఈ బహిరంగ ప్రదేశాలలో...కనిపించిన ప్రతి అమ్మాయిని/మహిళను కొరుక్కు తినేట్లు చూసే మగ పిల్లలు, కాలేజ్ కుర్రోళ్ళు, పురుషపుంగవులు మరీ ఎక్కువయ్యారు. అసలీ అమ్మాయిలు ఎలా భరిస్తున్నారో కానీ...నాకైతే ఈ వారం లోనే రెండు మూడు సంఘటనలు ఒళ్ళు మండేలా చేసాయి. 


నిన్నటికి నిన్న ఒక బేవార్స్ గాడు రైల్వే స్టేషన్ లో రైలు ఆగినప్పుడు చలాకీగా వెళ్ళిపోతున్న ఒక అమ్మాయిని చూసి నా పక్కన వుండి విజిల్ వేసి వెకిలిగా నవ్వాడు. దానికి ఆ చిట్టి తల్లి అపరాధం చేసిన దానిలాగా తలవంచుకుని వెళుతుంటే...బాధేసింది. వాడు, వాడి చుట్టూ ఒక ఆవారా మూక ఉంది. అందరూ వెకిలి వెధవలే. 'ఇదేమి పని...' అందామా? అంటే అది ఒక గొడవకు దారి తీసేట్టు ఉంది. అపుడు వాళ్ళతో ఫైట్ చేసే బలం, టైం నా దగ్గర లేవు.  బాధ్యతాయుత పౌరుడికి అదొక నిస్సహాయ పరిస్థితి.

మొన్నామధ్యన ఇంకొకడు...సీటు ఉన్నా నిలబడి పక్క సీట్లో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న అమ్మాయిని తదేకంగా తొంగి తొంగి చూస్తూ...వేరే సీట్లో ఉన్న ఫ్రెండ్ తో సైగలతో మాట్లాడుతూ వెకిలిగా నవ్వుకుంటున్నాడు. అది మానసికి రోగం కాక మరేమిటి? వాడికి మాత్రం నవ్వుతూనే..."ఏమన్నా...తన్నులు తినకుండా రైలు దిగేట్టు లేవు," అని అన్నాను. వాడు గప్చిప్ అయిపొయ్యాడు.


కాస్త శుభ్రంగా, అందంగా ఉన్న అమ్మాయిలు ముస్తాబై తమ పాటికి తాము రోడ్డుపక్కన పోతుంటే.....అదే పనిగా కళ్ళార్పకుండా గుచ్చినట్లు చూసే చిత్తకార్తె శునక సంతతిని ఏమి అనాలి? భార్యా బిడ్డలతో షాపింగ్ కు వెళ్ళినా, హోటల్స్ కు వెళ్ళినా మనం  గమనించవచ్చు...ఇలాంటి కుసంస్కారులను. అదే పనిగా...కింది నుంచి పైదాకా అమ్మాయిలను ఎగాదిగా చూస్తుంటారు. ఆ పరిస్థితి వికారంగా ఉంటుంది..అది చూసే సంస్కారవంతులకు.  కాలేజ్ స్టూడెంట్స్ తో పాటు, కొందరు మధ్య వయస్కులు కూడా ఈ వెకిలి చూపులు చూస్తూ...ఆడ పిల్లలను ఇబ్బంది పెడుతున్నారు. యాసిడ్ దాడి చేస్తేనే హింస అనుకునే స్థాయికి దిగజారాము మనం. ఇప్పుడు జులాయిల చూపులతో అమ్మాయిలు నిత్యం పడుతున్న హింస అంతకన్నా ప్రమాదకరమైనది. అబలలు ఎప్పటికీ నిస్సహాయులుగా, బాధితులుగా మిగిలిపోయి... మానసికంగా కుంగిపోయే దారుణం ఇది.


అందంగా ఉన్నవాళ్ళను చూడడం...చూసి వదిలెయ్యడం మానవ సహజం కానీ...కసిగా, కామంతో చూడడం మరీ ఎక్కువైపోతున్నది. నా చిన్నప్పుడు ఎవడైనా...మా అమ్మ వంక అలా చూస్తే...బలంగా వెళ్లి గట్టిగా తగలడమో, 'ఏం...బే...' అన్నట్లు గుర్రుగా చూడడమో చేసే వాడిని. కాస్త దిట్టంగా ఉండే క్రీడాకారుడిని కాబట్టి...అవతలి జులాయి చూపు మరల్చుకొని తనదారిన తాను వెళ్ళిపోయే వాడు.


కాలేజిలో అలా అమ్మాయిలను తదేకంగా సినిమా లెవల్లో చూసే వాళ్లకు నేను, రఫీ (వీడి పేరు నా కొడుకు పేరులో ఒక భాగం) కొద్దిగా పాఠాలు నేర్పేవాళ్ళం. అమ్మాయిల వంక మరీ వెర్రిగా చూస్తున్న ఒకడు నా దృష్టిలో పడడం, రఫీ వాడిని పక్కకు తీసుకువెళ్లి 'హితబోధ' చేయడం నాకు గుర్తు. మా వీధిలో ఒక అమ్మాయి మీద సరసంగా ఒక చిన్నరాయి విసిరిన ఒకడిని నేనూ...నా మిత్రుడు మోహన్ రావు పట్టుకోవడం, శిక్షగా మేము వాడి సైకిలును మురికి కాలవలోకి విసరడం, వాడు గూండాలతో మా ఇంటి మీదికి రావడం, విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం నాకు గుర్తుంటాయి. ఇలాంటి కోతులు, కామాంధుల విషయంలో బలప్రయోగం తప్పదేమో కదా!


ఈ వెకిలి చూపుల సమస్య మనందరికీ అనుభవమే అయి ఉంటుంది.  ఎందుకో గానీ ఇలాంటి కీలకమైన అసభ్య అంశాల గురించి మనం మాట్లాడుకోం. ఈ సమస్య పరిష్కారానికి నడుంబిగించం.  మన ఆడపిల్లలకు స్వేచ్ఛ లేని అభివృద్ధి అదేమి అభివృద్ధి? అదేమి సివిలిజేషన్? ఈ సంస్కృతి ప్రబలడానికి....ఈ దుర్మార్గపు సినిమా జనం ప్రధాన కారణం అని...అనిపిస్తున్నది. నీతీ జాతీ లేని ఈ డబ్బు పిచ్చిగాళ్ళు....సృజనాత్మకత ముసుగులో....సినిమాలలో ఈ దొంగ చూపుల సీన్లు బాగా పెడుతున్నారు. అది ఈ మూర్ఖపు యువత, చంచల స్వభావులు ఒంటపట్టించుకుంటున్నారు.  


అలాంటి సీన్లను....బుద్దితక్కువ టీ.వీ.చానెల్స్ వాళ్ళు చాలా ఎక్కువగా వాడుతున్నారు. పైగా...ఈ తతంగాన్ని నిస్సిగ్గుగా గ్లామరైజ్ చేస్తున్నారు. ఈ పోకడను అనుకరించడానికి యువతరం పోటీ పడుతున్నది.  

ఈ బెడద మరీ వెర్రి తలలు వేస్తున్నట్లు నాకు బోధపడింది....పలువురు తెలిసిన అమ్మలక్కలతో మాట్లాడాక. మీరు ఒక్క క్షణం ఆలోచించండి లేదా మీ పక్కన ఉన్న మీ సతీమణినో, కూతురునో, తోబుట్టువునో అడిగి చూడండి....ఈ సమస్య ఎంత తీవ్రంగా మారిందో తెలుస్తుంది. ఇది నిజానికి ఆడ పిల్లలపై జరుగుతున్న కనిపించని అమానుష దాడి, చిత్ర హింస. దీనికి అర్జెంటుగా నివారణోపాయం చూడాలి. నాకు తోచిన సలహాలు ఒక ఐదు...చర్చ కోసం. 


1) సినిమా వాళ్ళు, టీ.వీ.వాళ్ళు కాస్త సంఘాన్ని, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకోవాలి. ఆడ పిల్లలను టీజ్ చేసే ప్రోగ్రామ్స్ ను నిలిపివేయాలి. అవి పరోక్షంగా స్త్రీలపై ప్రభావం చూపుతున్నాయని గమనించాలి.

2) వెకిలి చూపులతో హింసించే వారిపై అక్కడికక్కడ ఫిర్యాదు చేయడానికి ప్రతి ప్రధాన రహదారి పైనా ప్రత్యేక పోలిస్ పోస్టులు ఏర్పాటు చేయాలి. దీని కోసం ప్రత్యేక సిబ్బంది ఉండాలి.

3) రోడ్ల మీద జులాయి వెధవలు చూస్తున్నారు కదా...అని తాను అందగత్తెనో, అతిలోక సుందరినో అని అనుకోవడం ఈ ఆడపిల్లలు కూడా ఆపెయ్యాలి. ఇలాంటి దుర్భ్రమతో...జులాయిలను ఓర కంటచూడడం, తిక్క నవ్వులతో కవ్వించడం, వారిని పక్కనున్న ఫ్రెండ్స్ కు నవ్వుతూ చూపించడం ఆపాలి. జులాయిలను చూసి...మాటి మాటికీ పైట లేదా చున్నీ సర్దుకోవడం...ప్రమాదానికి దారితీస్తుంది. ఇలాంటి ఆక్వర్డ్ పరిస్థితిలో కాజువల్ గా ఉండడం అవసరం.

4) తల్లి దండ్రులు ఇళ్ళలో పిల్లలకు ఈ విషయంలో శిక్షణ ఇవ్వాలి. అలా పదే పదే చూడడం తప్పని మగ పిల్లవాడికి నూరిపోయాలి. అలాంటి ఇబ్బందికర పరిస్థితి వస్తే ఎలా ఎదుర్కోవాలో ఆడపిల్లలకు టిప్స్ ఇవ్వాలి.   


5) ఈవ్ టీజర్లను మన తోటి ప్రయాణికుడు/ప్రయాణీకురాలు ఒంటరిగా నివారిస్తుంటే లేదా అడ్డుకుంటూ వుంటే...అతనికి/ఆమెకు మనం మద్దతు పలకాలి. ఉమ్మడి గళం తో ఈ జబ్బును నివారించవచ్చు. 

అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగితే స్వరాజ్యం వచ్చినట్లు...అన్న ఆ పెద్దాయన మాట అలా వుంచండి...మన ఆడ పిల్లలు పగలే రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. కాదంటారా?
(Note: Image courtesy www.stumbleupon.com)

36 comments:

శరత్ కాలమ్ said...

అందుకే ఆడపిల్లలందరికీ బురఖాలు వెయ్యాలి. మగవాళ్లందరి కళ్ళకూ గంతలు కట్టాలి. లేకపోతే మగవాళ్లందరికీ ఊర్లల్లో ఎద్దులకు చేస్తారే ఆ పని చేస్తే ఇలాంటివి సులభంగా తగ్గుతాయి.

ఇక, ఆడవారూ తక్కువ తినడం లేదు కాబట్టి అంటే వాళ్ళూ సరాసరి సూటిచూపులు చూడకపోయినా ఓరకనులతో మగాళ్లని తినేసేలా చూసేవారుంటారు కాబట్టి మగాళ్ళందరికీ బురఖాలు వెయ్యాలి. అలాగే ఆడవారికందరి కళ్లకీ గంతలు కట్టుకొని తిరగమని ఫత్వాలు జారీచేయాలి. ఇంకా ఆడవారికి ఆఫ్రికా దేశాల్లోనో ఎక్కడో చేసినట్లుగా ఓ చిన్న భాగం తొలగిస్తే ఇలాంటి ప్రకోపాలకు ఆస్కారం తక్కువ వుంటుంది. అప్పుడు ప్రపంచమంతా శాంతి వెల్లివిరుస్తుంది.

Anonymous said...

I thought this blog is meant for focusing on a degenerating profession called Journalism !

నరేష్ నందం (Naresh Nandam) said...

మంచి చర్చకు తెర తీశారు రాము గారూ..

బయట వాళ్లతోనే కాక, ఇంట్లో వాళ్లతో..
చుట్టాలు, మిత్రులతో..
ప్రతి మగాడితో స్త్రీకి ఇబ్బందులే!

నాకు తెలిసిన అమ్మాయిలలో చిన్నప్పుడే సెక్సువల్ హెరాస్‌మెంట్‌కి గురయిన వారున్నారు. మరి వాళ్ల సంగతేం చేద్దాం?

అందుకే ఎవరి నిజ స్వరూపమైనా చీకట్లోనో, ఆ వ్యక్తితో ఉండాల్సి వచ్చినప్పుడో తెలుస్తుందనుకుంటా అమ్మాయిలకు.


---
ఇలా ముందుకు వచ్చే వారికి తప్పని సరిగా మద్ధతివ్వాలి.
http://www.youtube.com/watch?v=Kk6Bi23Q7-E


---
http://janaj4u.blogspot.com/2009/01/blog-post.html

Anonymous said...

http://thatstelugu.oneindia.in/news/2010/05/26/jagan-telangana-tour-person-die-260510.html

హైదరాబాద్: వైయస్ జగన్ వరంగల్ జిల్లాలో తలపెట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకుంటున్నారని మనస్తాపానికి గురై వరంగల్ జిల్లాలో ఓ వ్యక్తి హఠాన్మరం చెందాడు. జగన్ యాత్రను అడ్డుకుంటామనే వార్తలను టీవీల్లో చూసిన బచ్చన్నపేటకు చెందిన యాదగిరి అనే వ్యక్తి మనస్తాపానికి గురై గుండెపోటుతో ఆత్మహత్య చేసుకున్నాడు.

యాదగిరి కూలీపనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని మరణంతో కుటుంబం అనాథ అయింది. అతనికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అతని భార్య కూడా కూలీపనులు
చేస్తుంది

> గుండెపోటుతో ఆత్మహత్య చేసుకున్నాడు
is that correct?

Malakpet Rowdy said...

చూడడం ఆపలేము సార్. దీనికి పరిష్కారం Culture లో మార్పు. మీ 4వ point సరైనది.

అలా చూసేవాళ్లని సినిమాల్లో విలన్లకన్నా కమేడియన్లగా చూపిస్తే మేలు - people are scared of being projected as jokers (They take pride in being villains)

Anonymous said...

వ్రుద్ధ నారీ పతివ్రత....అని వెనకటికి ఒక సామెత ఉంది లెండి.....

Anonymous said...

ఇది పోలీసుల వైఫల్యం.

Saahitya Abhimaani said...

రామూ గారూ మంచి విషయం గురించి వ్రాసారు. ఇటువంటి సివిక్ సెన్సు గురించి మన మీడియా అస్సలు ప్రయత్నం చెయ్యటం లేదు. ఇదొక ఉద్యమం లాగ అన్ని టివి చానెళ్ళు ఈ ఈవ్ టీసింగ్ ఎంతటి ఘోరమైన చండాలపు అలవాటో ప్రతి అరగంటకు ఒక 10 సెకన్ల సందేశం చూపిస్తూ ఉండే ఏర్పాటు చెయ్యగలరా. అలాగే అన్ని వార్తా పత్రికలలోనూ ప్రతి ఆదివారం మొదటి పేజీలో ఒక కార్టూన్ ఈ విషయం మీద మన కార్టూనిస్టు సోదరులు వేసి సమాజానికి చురకులు అంటించగలరా. అలా చేస్తే మీడియాకు వీళ్ళు ప్రతి క్షణం ఆ మాటకు అర్ధం తెలియకుండా గంబీరంగా వాడే మాట "సామాజిక స్పృహ" ఉన్నదన్న విషయం పాఠకులు/ప్రేక్షకులు గ్రహించి ఆ సమూహంలో ఉన్న LUMPEN ELEMENTS వాళ్ళు చేసేది "తప్పు" అని తెలుసుకునే ఆవకాశం లేకపోలేదు.

ఈ దిశగా ఆజ్-తక్ ఒక చక్కటి వీడియోని తీశారు. స్పాన్సర్ చేసేవారు లేక కాబోలు ఈ అద్భుత వీడియోని అంతగా చూపట్లేదు. ఈ కింది లింకు నుండి ఆ వీడియోని చూడవచ్చు.
http://www.youtube.com/watch?v=Kk6Bi23Q7-E

వీలయితే వ్యాసంలో EMBED చెయ్యండి. మీరు జర్నలిస్టులకు క్లాసులు తీసుకునేప్పుడు మీడియాకి ఉన్న సామాజిక బాధ్యతని తరచూ గుర్తుచేయండి. ఊరికే వ్యాపార ప్రకటనలే ధ్యేయం కాకుండా, పైన ఉన్న వీడియో లాంటివి ఏదో మొక్కు తీర్చుకున్నట్టు కాకుండా తరచూ చూపాలి. మీడియా ఒక బలమైన సాధనం ఆ సాధనం, లేకి వార్తలు, పనికిరాని సమాచారాన్ని ఇవ్వటం మాని, సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలను చేయటం మొదలెట్టాలి. ముందు వారి వారి ఎంఖర్ల వేష భాషలు సంస్కరించాలి. "వాంపు" లను తలదన్నే వేషాలు, హావ భావాలను అరికట్టాలి.

Ramu S said...
This comment has been removed by the author.
karthik said...

పాత సినిమాలలో హీరో అంటే ఒక కష్టపడే గుణం వాడు, మంచి దక్షత ఉన్నవారిని చూపేవారు.. ఇపుడు హీరో అంటే ఆకు రౌడీలు, గూండాలుగా చూపుతున్నారు.. ఒక సమాజం గా మనం ఎంత దిగజారాం అనేదానికి ఇంత కంటే పెద్ద కొలమానం కావాలా???
మీరు చెప్పిన సమస్య దీని ఫలితమే.. అదేదో రాత్రికి రాత్రి జరిగింది కాదు. కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న దాన్ని మీరు ఇప్పుడు బ్లాగులో ప్రస్తావించారు..

Kathi Mahesh Kumar said...

http://parnashaala.blogspot.com/2008/07/blog-post_1778.html

Kathi Mahesh Kumar said...

http://parnashaala.blogspot.com/2008/07/blog-post_07.html

Ramu S said...

మంచి వీడియో క్లిప్ పంపిన నరేష్ కు, శివ గారికి థాంక్స్. నరేష్ పంపిన కవిత కూడా ఆలోచనాత్మకంగా ఉంది.
శరత్ కాలం..శరత్ కాలమే, యెంత మండే ఎండాకాలమైనా. చాలా ఉత్తమమైన ఆలోచన!!!

ప్రధాన పత్రికల వాళ్ళు ఈ కీలక అంశం పై సరిగా పట్టించుకోవడం లేదనే...మెయిన్ థీం కు భిన్నంగా వెళ్లాను. ముందే చెప్పినట్లు ఇలాంటి వాటి కోసం వేరే బ్లాగ్ ఆరంభిస్తా. జే.పీ.గారూ...ఒకే నా?

రాము

Anonymous said...

This problem has been there since ages.Most of the times when men go on two wheelers they definetely pay a look at the women who walk on the roads particularly at those who look pretty with good dress.Fair sex is the centre of attraction anywhere and everywhere whether the intention is good or bad.
In the bloggers choice of best anchor Roja got the best anchor prize.Why?s she proffessonally superior to all other senor anchors?Every one commented on her beauty ,looks,etc and it is clear that as I said in my coment she was selected not for her hundred percent proffessionalism but other points of her beauty,looks and sexy voice have added to get the prize.What what do you say about this trend of men towards the
beauty and looks of the ladies?
I am not aganst the choice of roja for prize but I would like to remind the mindset of men towards women who are more popular with beauty,looks etc along with their proffessional work and both these add to get good marks whereas in the men it is only the proffessional work that gets the prizes as there is no chance for them to get prizes for beauty as it is not counted which is a most disadvantage position in the situations like your contest for prizes.However thewre are many exceptions as there are many women who are popular with their proffession,service without any importance to their beauty and looks.

JP.

Praveen Mandangi said...

సినిమాలు చూసి కుర్రాళ్ళు వరస్ట్ గా చెడిపోతున్నారు. ఒకరోజు నేను కంప్యూటర్ రిపైర్ చెయ్యడానికి వేరే ఊరికి బస్ లో వెళ్తున్నాను. బస్సులో కాలేజి కుర్రాళ్ళు అమ్మాయిల వైపు వెకిలిగా చూస్తూనే అక్కా, చెల్లి అని వరస పిలుపులు కూడా పిలుస్తున్నారు. 'కడప బాంబు కన్నుల్తో వేసి కన్నె కొంప పేల్చేశారు' లాంటి బూతు పాటలు కూడా పాడుతున్నారు.

Anonymous said...

http://dirisena-diresenapushpaalu.blogspot.com/2010/04/blog-post_19.html
http://dirisena-diresenapushpaalu.blogspot.com/2010/04/blog-post_20.html

Anonymous said...

రామూ గారికి,
మంచి టపా రాసినందుకు అభినందనలు. ఈ టపా వ్రాస్తున్నప్పుడు మీరు ఉద్వేగానికి లోనయ్యారనడానికి సూచనగా మీ శైలిలో వాక్యాలు తడబడ్డాయి. పొరబడలేదు లెండి.
నేను జెపీ గారి వ్యాఖ్యానంతో ఏకీభవిస్తాను. అందం మగవారిదైనా, ఆడవారిదైనా ఆకర్షించేమాట నిజం. దాన్నెలా ప్రదర్శించాలి అనేది మనం పెరిగిన వాతావరణంలో మనకబ్బిన సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సమస్యలో ఆడవాళ్ళు కూడా కొంత ప్రోత్సాహక పాత్ర పోషిస్తున్నారు.(కావాలని కాకపోయినా, ఇలాంటి టీజింగులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు.)ఏమైనా మంచి సంస్కారాలు కుటుంబం నుంచే రావాలి. ఇప్పుడు తల్లిదండ్రులకు, గురువులకు అవినేర్పే తీరిక ఉండటం లేదు. ఇక మిగిలిన ఏకైకమార్గమైన టీవీలు, సినిమాలు, మీడియా ఏది నేర్పకూడదో అవి నేర్పుతున్నాయి.
మంచి సంస్కారాలను ప్రోత్సహించేందుకు, కుసంస్కారాలను (సంస్కారం అంటేనే బాగుపడినది అని లిటరల్ మీనింగ్ కనుక మంచి సంస్కారం, చెడ్డ సంస్కారం అనకూడదేమో) నిరోధించేందుకు పౌరులుగా మనవంతు కృశి చేయాల్సిందే. మీరు టపాలు రాయడం, మేము వ్యాఖ్యానాలు జోడించడంతో ఆగకుండా ఈ కృషి మరింత ముందుకుసాగుతుందనీ, భగవంతుడు మనకు ఆ శక్తీ, సమయం ఇస్తాడనీ ఆశిద్దాం.
సుబ్బారావు

priya said...

Precisely what I wanted to point out Sir. When selecting for best anchor, she was given importance for her looks first and professionalism next. And movies are most significant in influencing both men and women as there has been some serious influence on women too, in terms of the increasing need to look good on the outside. Is it not possible to see both men and women as normal human beings sans their dress and looks and physical appearance?

శ్రీనివాస్ said...

రాము గారు మంచి చర్చకు తెర తీశారు. అందమైన అమ్మాయి కనపడితే అందరం చూసి బాగుంది అనుకుంటాం. ఇది ఎవరు కాదనలేని సత్యం. కానీ అంతటితో ఆగకుండా ఏదో చెయ్యాలనే ఉద్రేకపడే చిత్తకార్తే కుక్కలతోనే అసలు ఇబ్బంది అంతా.


మొదటగా 'ఈడియట్' సినిమాలో తనకి రక్తం ఇచ్చి కాపాడిన అమ్మాయిని . చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే అని పాడుతూ మాటి మాటికి " సూచీ నేను చెపింది ఎం చేశావ్ " అని పబ్లిక్ లో అడగదాన్ని దాన్ని హీరోఇజంగా చూపించిన దర్శకుడి మానసిక దౌర్భల్యం ఒక ఉదాహరణ. ఇలాంటి దర్శకులు కోకొల్లలు. మనకి పెద్దగా ఏం అనిపించకపోవచ్చు కానీ టీనేజ్ కుర్రాళ్ళు ఇలాంటివి చూసి ఇన్స్పైర్ అవుతారు అనడం లో సందేహం లేదు.

బయట పిల్లవాడు ఎలా మేసలుకోవాలో తల్లిదండ్రులు కూడా ఎదిగే పిల్లవాడికి చెబుతూ మర్యాద నూరిపోస్తున్డాలి.

ఈవ్ టీసింగ్ చేసిన వారిని అడ్డుకున్నారనే కోపంతో అక్కడికక్కడే అడ్డుకున్నవారిని చంపేసిన ఘటనలు మా ఒంగోలు లో కోకొల్లలు . ఇటువంటి పరిస్థితిలో పబ్లిక్ అంతా ఒ౯కెసారి తిరగబడితే ఫలితం ఉండచ్చు

అన్నిటికంటే ముఖ్యంగా పనీపాటా లేకుండా తిరిగే వాళ్ళ మీద పోలీసులు ఒక కన్నేస్తే బాగుంటుంది.

Unknown said...

Ramu S గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

స్వర్ణమల్లిక said...

రాము గారు చాలా మంచి చర్చ మొదలుపెట్టారు. ఇలాంటి సమస్యల పరిష్కారం మౌలిక స్థాయి నుండే మొదలవ్వాలి. అలా వెకిలి చూపులతో ఆడవారిని తినేసే జులాయి వాళ్ళు తాము ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నామో ఆ చోట తమ వారిని నిలిపి ఆలోచించుకోవాలి. ఎంత రౌడీ అయినా తమ ఇంట్లో ఆడపిల్లలని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు అంటే హఠాత్తుగా హీరో అయిపోతాడు. ఆ అల్లరి పెట్టిన వారిని కొట్టో, తిట్టో, భయపెట్టో మందలిస్తాడు. అదే బుద్ధి పరాయింటి ఆడవారిని అల్లరి చేసేపుడు ఎందుకు ఉండడంలేదు.

తెలుగు వెబ్ మీడియా said...

అమ్మాయిని వెకిలి చూపులు చూస్తూనే అక్కా, చెల్లి అని పిలిచే తార్పుడుగాళ్ళని చూశాను. వీళ్ళకి తమ సొంత అక్కాచెల్లెళ్ళ గురించి చెప్పినా మారరు.

శ్రీనివాస్ said...

వదిన మీద మరిది మనసుపడే కధలు రాసి యువతని పెడద్రోవ పట్టించేవారు కూడా ఒక కారణం.

Anonymous said...

Chala manchi vyasam... Asalu mana youthki manchi vishayalu ela cheppina, entha cheppina ardham kadu. Vallanu ela convince cheyyalo kuda ardham kani paristhithi. Thappu ani chepthe pattinchukone nadhude ledu. Edi mancho, edi chedo thelusukoleni common sense ledu mana vallaki. Bloglo Chala mandi manchi suchanalu icharu. Vallandariki kruthagnathalu.

Vinay Datta said...

Appreciating beauty is different from wanting to possess it and passing filthy comments. Though I've always loved Hyderabad, I've found peace after moving to Chennai because I'm free from such situations. The people here agree that Eve Teasing in Chennai is very rare, though the number of drunkards is high. I'm able to come back home alone even at 11 o' clock in the night.
Projecting eve teasers as comedians in movies is a good idea.

martialarts said...

మిత్రమా!
సరిగ్గా నెల రోజుల క్రితం నేను నా బైక్‌ని మరమ్మతుకు ఇచ్చాను. నాలుగు రోజుల పాటు బస్‌లో వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలోనే మీ మాదిరిగా స్పందించాను. అందుకే ఓ ప్రత్యేక బ్లాగ్‌ను ఏర్పాటు చేశాను. పైన ఎవరో మిత్రుడు ఆడవారూ ఏమాత్రం తక్కువ తినలేదన్నారు. అందులో నిజం లేకపోవచ్చు. కానీ మహిళలను గౌరవించడం భారతదేశ సంప్రదాయం. యత్రనార్యంతు పూజ్యంతు తత్ర రవంతు దేవతాః అన్నారు. పోనీ ఆ విషయం వదిలేద్దాం. నేను కూడా ఇదే అంశంపై మథనపడుతూ ఓ బ్లాగ్‌ను రూపొందించాను. ఒక్కసారి ఇక్కడి మిత్రులంతా దాన్ని విజిట్‌చేసి, అభిప్రాయం చెబితే... తప్పక ఈ సమస్య సమసిపోతుందనుకుంటున్నా. ఇది జర్నలిస్టు మిత్రులకూ పనికి వస్తుంది.

martialarts said...

మిత్రమా!
సరిగ్గా నెల రోజుల క్రితం నేను నా బైక్‌ని మరమ్మతుకు ఇచ్చాను. నాలుగు రోజుల పాటు బస్‌లో వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలోనే మీ మాదిరిగా స్పందించాను. అందుకే ఓ ప్రత్యేక బ్లాగ్‌ను ఏర్పాటు చేశాను. పైన ఎవరో మిత్రుడు ఆడవారూ ఏమాత్రం తక్కువ తినలేదన్నారు. అందులో నిజం లేకపోవచ్చు. కానీ మహిళలను గౌరవించడం భారతదేశ సంప్రదాయం. యత్రనార్యంతు పూజ్యంతు తత్ర రవంతు దేవతాః అన్నారు. పోనీ ఆ విషయం వదిలేద్దాం. నేను కూడా ఇదే అంశంపై మథనపడుతూ ఓ బ్లాగ్‌ను రూపొందించాను. ఒక్కసారి ఇక్కడి మిత్రులంతా దాన్ని విజిట్‌చేసి, అభిప్రాయం చెబితే... తప్పక ఈ సమస్య సమసిపోతుందనుకుంటున్నా. ఇది జర్నలిస్టు మిత్రులకూ పనికి వస్తుంది.

martialarts said...

డియర్‌ ఫ్రెండ్స్‌,
క్షమించగలరు.. ఇందాకటి పోస్ట్‌లో నా బ్లాగ్‌ అడ్రస్‌ ఇవ్వడం మరిచిపోయాను. అది http://aathmarakshana.blogspot.com/

Anonymous said...

dear siva garu, please open your eyes. first change your good openion on telugu tv channels. ceo's choose anchors only who has breast in big size. cinema field, politics and tv channels are the places where women are exploited. they do telecast social messages but they are name sake. never expect toomuch from this bad society. remove your glasses first. sorry fo the facts.

Anonymous said...

interesting debate. once prothima bedi acompanies her husband kabir bedi in a party in mumbai. one bada producer, having seen prothima, asked her husband immediatly when he goes out of city to share the bed with her. prothima is stunned not at the open comments of the producer but of her huband's silence. mr.badi asked to take it in lighter manner. infact she expected her hubby gives a big slap to the rogue. she felt that the men are alike in treating a woman. to the shame of the men's world, she did a stiptese in juhu beach in mumbai by saying all women has the same flesh and blood. many years gone... men did not change anything. she dreamt a new world where a woman stylishly stops her byke at a shop and buy a cigarette with out shy, lit it puff out smokey rings. recently i saw this at mid night at city centre in hyd. ramu comment pl.

Ramu S said...

I was not talking about minuscule minority of girls/women, who enjoy their freedom (sometimes they can embarrass men with their behavour). I was writing about common people.
cheers
ramu

Saahitya Abhimaani said...

Mr. Anonymous,

Please read my comment once again with your eyes wide open and with your mind properly working. Did it mean that I have good opinion about present media. I was expressing my anguish on the present status of the media.

Anonymous said...

siva garu, sorry if you hurt. i humbly submit my ire is on media only, not on you. i mistook your ideas. good, we are of the same opinion.

Saahitya Abhimaani said...

Thank you Mr.Anonymous for your understanding.

maa godavari said...

రాము గారు
మీతో చెప్పాను కదా అనుక్షణం వెకిలి చూపులు....వ్యాసాన్ని ఆగష్ట్ భూమిక లో రిపబ్లిష్ చేసాము.
భూమిక ఆన్ లైన్ ఎడిషన్లో చూడండి.మీ చిరునామా ఇస్తే పోష్ట్ చేస్తాను.మీకు ధన్యవాదాలు.

www.bhumika.org
http://maagodavari.blogspot.com

Sitaram said...

Ramu is a good boy--saidulu

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి