Tuesday, April 13, 2010

మితిమీరిన ప్రచారంతో సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న జగన్

పత్రికల యజమానులకు ప్రచార కండూతి ఉండే అవకాశం పుష్కలంగా ఉందని, వారు ఆ దురద తీర్చుకునేందుకు ప్రెస్ ను వాడుకుంటారని మొదటి ప్రెస్ కమిషన్ 1952 లోనే ఊహించింది. పత్రికల యజమానులు...తమ వార్తలు, ఫోటోలు అచ్చేసుకోవడం అభిలషణీయం కాదని అది సూచించింది. 'సాక్షి' పేపర్లో, ఛానల్ లో ఆ గ్రూపు అధిపతి, కాంగ్రెస్ ఎం.పీ.జగన్మోహన్ రెడ్డి గురించి గత కొన్ని రోజులుగా భరించశక్యం కానివిధంగా ఊదర కొట్టడం చూసి ప్రెస్ కమిషన్ సిఫార్సు గుర్తుకు వచ్చింది. 

'ఈనాడు' కు దీటుగా వస్తున్నమంటూ దూసుకు వచ్చిన 'సాక్షి' ...నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ దుర్మరణం తర్వాత గతి తప్పి వీక్షకులకు, రీడర్లకు పరమ చీకాకు కలిగిస్తున్నది. ఆంధ్రుల అభిమాన నటుడు రామారావుకు 'ఈనాడు' పిచ్చపిచ్చగా కవరేజ్ ఇస్తే జనం ఇరగబడి చదివారు. ఇప్పట్లా కాకుండా...అప్పట్లో...ఆ పత్రికే మహా వృక్షం. పైగా..రామారావుకు ఉన్న కరిష్మా అలాంటిది. 

ఇప్పుడు కూడా అదే ఫిలాసఫీ ఆధారంగా 'సాక్షి' పోతున్నది. ఎంత పార్టీ మీడియా అయినా మరీ ఇంత దారుణమా? ఇరవై నాలుగు గంటలూ జగన్ ను చూపించి....బాకా కొడితే..అలనాటి సూత్రం పని చెయ్యకపోగా వికటించే ప్రమాదం ఉంది. 'సాక్షి' ఛానెల్ ఇస్తున్న నాసిరకం, మొరటు కవరేజ్ వల్ల...పాపం...ఈ యువనేతకు నష్టం జరుగుతున్నది. ఇది ఆయన గమనించే పరిస్థితిలో లేదు. కెమెరా తిమ్మిరి, అక్షరాల కిక్కు అలాంటిది. "తన పర్యటన మొదలైన నాటి నుంచి రికార్డు అయిన టీ.ఆర్.పీ.రేటింగ్ చూసినా...జగన్ కు వాస్తవం తెలుస్తుంది," అని ఒక విశ్లేషకుడు అన్నారు.


మీడియాను తెలివిగా వాడుకోవడం ద్వారా...జనంలో సానుకూల అభిప్రాయం సృష్టించుకోవడం ఒక కళ. ఆ విద్య తెలియకపోతే....అది  భస్మాసుర హస్తం అవుతుందని చాలా చోట్ల రుజువయ్యింది. 'సాక్షి' లో ఒక సీనియర్ మిత్రుడు అన్నట్లు...రాజీవ్ గాంధీ...మీడియా మిస్ మ్యానేజ్మెంట్ (దూరదర్శన్ ను భజన మండలి గా మార్చుకోవడం) వల్లనే అప్పటి ఎన్నికలలో బొక్కబోర్లా పడ్డారు.

వార్తలు జాగ్రత్తగా ప్లాంట్ చేసే మీడియా ప్రొఫెషనల్స్ లేకపోవడం 'సాక్షి'కి ప్రధాన లోపం. ఉన్న ఛానెల్స్ లో రెండో మూడో స్థానంలో ఉన్న వాళ్ళను...లాబీ చేయగలిగే వారిని...ఒక కులపోళ్ళను ఎక్కువ డబ్బు ఇచ్చి వాళ్ళు నియమించుకున్నారు. వాళ్ళు మీడియా ప్రాథమిక సూత్రాలు తెలియక....బండ కొట్టుడు కొడుతున్నారు. 

లైవ్ వ్యాన్లతో...జగన్ ను ఇంద్రుడు చంద్రుడు అని పొగడడం...పాటలు వినిపించడం...రిపోర్టర్ సార్లు కార్యకర్తల్లా...'అయన పర్యటన బ్రహ్మాండంగా సాగుతోంది' అని చెప్పడం! ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా ఇదే సీను, రొడ్డ కొట్టుడు. ఇది జనంలో వెగటు కలిగించే వ్యవహారం. ఇది తాత్కాలికగా భజనపరుల ఆహో..ఓహో...వల్ల జగన్ కు సంతోషం కలిగించినా...దీర్ఘకాలంలో కచ్చితంగా నష్టం కలిగిస్తుంది. 

నిజానికి మీడియాను దరి చేరనీయకుండా ఉంటేనే జగన్ కు మేలు. "ఇది ఆత్మీయ కలయిక...కాబట్టి...మీడియా అవసరం లేదు.." అని ప్రకటించి...చిత్తశుద్ధితో కలవాలనుకున్న వారిని కలిస్తే...ఎన్నో రెట్లు ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది. 'సాక్షి' లో కూడా వార్త వేసుకోకుండా వుంటే...ఇంకా మంచిది. దానికి భిన్నంగా...'సాక్షి' బృందం చేస్తున్న హడావుడి జగన్ పుట్టి ముంచే పనే. అతనిపై లోపల కోపంతో...తెలివిగా సలహాదార్లు చేయిస్తున్న...సెల్ఫ్ గోల్.

4 comments:

ప్రేమిక said...

పాపం జగన్ అన్నయ్య కు బుర్ర లేదు కదా?

Saahitya Abhimaani said...

".......పాపం...ఈ యువనేతకు నష్టం జరుగుతున్నది....."

నేత??? నిజమే "పాపం" కదా!!!!!!!

మరిప్పుడు టి వి 9 వాళ్ళు కూడా మొదలెట్టారు ఈ "భజన". సాక్షి చేసిన హడావిడికి ఆ చానెల్ రేటింగు ఏమన్నా పెరిగిందా ఏమిటి? వీళ్ళూ ఎగబడ్డారు. ప్రస్తుతానికి ఇదొక వార్తా? ఇలాంటిది చూపించోచ్చా అన్న ఇంగిత జ్ఞానం ఉన్న సంపాదలులు(!) ఉన్నారా అసలు?

Lumpen elements have usurped the media and making press freedom a mockery. What we are seeing is the effect of it.

chandu said...

ఈ క్రమం లొ చూస్తె కొంచం ఈటీవి 2 నయం అనుకుంట. అందులో కొంచం అయినా నియమాలు కనిపిస్తాయి.

raj said...

Hi,

sakshi lo Jagan vi kaakunda ..emi Chandra babu naidu gurinchi cheptaara..
Jagan people lo ki veltunnadu...ala velle vaadu evvaraina unnara ..jagan laaga
chandra babu laaga Fox kaadu ...

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి