Friday, April 16, 2010

ఒక ఢిల్లీ జర్నలిస్టు స్పందన...ఆవేదన...ఆహ్వానం

విపరీతమైన పని ఒత్తిడి వల్లనో, లేక మరే ఇతర వ్యక్తిగత కారణాల వల్లనో ఒక ప్రొఫెషన్ పైన, ఆ ప్రొఫెషన్ కు చెందిన వారిపైన ఏవగింపు ధోరణి కలిగి ఉండటం సాధారణంగా చాల మందిలో జరిగే విషయమే. బహుశా అలాంటి ఇబ్బందితో బాధపడుతుండటం వల్లనేమో శ్రీ శివ గారికి జర్నలిస్టు సమాజం పైన అక్కరకు రాని ఆగ్రహం పెల్లుబుకుతు ఉండవచ్చు. ఏది ఏమైతేనేమి...భావప్రకటన విషయంలో జర్నలిస్టు సమాజానికి ఎంత వెసులుబాటు ఉందొ, అంతే సౌకర్యం శ్రీ శివ గారికి కుడా ఉందనే కనీస స్పృహ నాకు కూడా ఉంది కాబట్టి ఆయన భావ ప్రకటన స్వాతంత్రాన్నిమనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను.


ఇక విషయం లోకి వస్తే..ఢిల్లీ ఆంధ్రా భవన్ లో తెలుగు మీడియా ప్రతినిధులు పడుతున్న అగచాట్ల విషయంలో ఈ బ్లాగ్ ఒక వ్యాఖ్య పోస్ట్ చేసింది...ఇందులో శ్రీ శివ గారికి అభ్యంతరకమైన అంశాలు ఏవి ఉన్నాయనే దాని మీద నా చిన్ని మెదడు ఎంత ఆలోచించినా ఏమీ అంతు బట్టడం లేదు...శ్రీ శివ గారికి ఒక విషయం మాత్రం వినమ్ర పూర్వకంగా మనవి చేయదలచుకున్నాను. మనకు నచ్చలేదు కాబట్టి అవతలి వాళ్ళందరూ వెధవాయిలు అనే ప్రమాదకరమైన ఆలోచనా ధోరణి నుంచి మీరు బయటపడండి..మీ వయసెంతో..మీరు ఏ వృత్తిలో ఉన్నారో నాకు తెలియదు...కానీ..ఇలా జర్నలిస్టు సమూహం మీద మీ పదునైన అక్షరాలతో దాడి చేసి, భుజాస్ఫాలనం చేసుకుంటే...అది మీ భుజాలకే నొప్పి కలిగించే విషయం.

మీకు ఎదురైన అనుభవాల వల్లనో, లేక మీరు చూసిన కొన్ని సంఘటనల కారణంగానో ...ఇలా ఒక నిశ్చిత అభిప్రాయానికి రావడం అనేది అప్రజాస్వామికం. ఉదాహరణకి మీరు గవర్నమెంట్ ఆఫీసర్ అయితే...ఎవరో ఒక అధికారి పాల్పడిన అవినీతికి మొత్తంగా ప్రభుత్వ వ్యవస్థనే కుళ్ళు పట్టిన చందాన చిత్రీకరిస్తే...మీ మనసుకెంత గాయమవుతుంది? ఇదంతా కూడా...మిమ్మల్ని సామజిక స్పృహ దిశా గా నడిపించే ప్రయత్నమే కానీ...ఏదో టార్గెట్ (మీకు లాగా) చేసినట్టు మాత్రం అనుకోకండి...


ఢిల్లీ మీడియా ప్రతినిధులే కాదు..ఆ మాటకొస్తే ఏ మీడియా మాన్ కూడా ఆకాశం నుంచో...లేక మీ గంధర్వ లోకం లో నుంచో ఊడి పడలేదు. స్థానికంగా ఇక్కడ ఇబ్బందులు పడుతున్న మీడియా ప్రతినిధులు ఎలాంటి దురవస్థలో ఉద్యోగం చేస్తున్నారో...కనీస పరిజ్ఞానం లేకుండా శ్రీ శివ గారు చేసిన తొందరపాటు వ్యాఖ్యల నేపధ్యంలో ఆయనకు నేనొక విషయం మనవి చేయదలచుకున్నాను.


మన్ని విమర్శించిన వాళ్ళందరూ మన శత్రువులు కారు అన్న విషయం గమనించుకోవటం అతి చిన్న విషయం అని మీరు రాశారు. తమాషా ఏమిటంటే అదే చిన్ని విషయాన్ని మీరు చాలా చాకచక్యంగా విస్మరించటం...లేదా మరో రకంగా చెప్పాలంటే...మనం చేస్తే లౌక్యం..ఎదుటి వాడు చేస్తే మోసం అనే చందాన మీరు మీ వ్యాఖ్యానాలు చేయటం...

"ఇక్కడ సమస్య ఏమిటి?? పోలీసులకు ఒక సమాచారం వచ్చింది మీడియాను వాడుకుంటూ ఒక పెద్దాయన మీద దాడి జరిగే ఆవకాశం ఉన్నది అని. అటువంటి "Intelligence Input" వచ్చినప్పుడు ప్రభుత్వం ఏమి చేయాలి? పత్రికా విలేఖరులతో సంప్రదించి తాము తీసుకోబోయే కొత్త "Security Measures" అమలు చేయటానికి వారి అనుమతి తీసుకోవాలా? లేదా ఇలా చేద్దామని అనుకుంటున్నాము అని వారికి చెప్పెయాలా? అలా చేస్తే, ఈ విషయాలు అన్ని చేరకూడని చోటుకి చేరవని నమ్మకం ఏమిటి" అని శివగారు అన్నారు. ఇది చాలా మంచి ప్రశ్న ఇది..ప్రభుత్వం జవాబుదారీ తనంతో వ్యవహరించాల్సిన ఒక వ్యవస్థ...నిజంగా ముఖ్యమంత్రి కి ప్రాణ హాని ఉంది...అది కూడా..మీడియా ముసుగులో ఉన్న మావో ఇష్టుల నుంచి అని నిఘా విభాగానికి సమాచారం అంది ఉంటె..అది మీడియా కి చెప్పటానికి వారికి ఉన్న అభ్యంతరమేమిటి? అలా మీడియా వారు అడగకూడదని ఏమైనా రూల్ బుక్ ఉందా? లేదా అలా అడిగిన నేరానికి మీడియా వాళ్ళను అర్రెస్ట్ చేయవచ్చుననే ఒక కొత్త జీ వో ఏమైనా శ్రీ శివ గారి చేత ప్రభుత్వం డ్రాఫ్ట్ చేయించింద?..ఒక వేళ అలా చేయించి ఉంటె...దాని గురించి తెలుసుకునే ప్రాధమిక హక్కు ఒక జర్నలిస్టు కె  కాదు శ్రీ శివ గారి లాంటి సాధారణ `అసామాన్యుల' కు కూడా ఉంటుందనే కనీస స్పృహ మాకు ..అంటే..ఢిల్లీ లో పని చేసే నిబద్ధులైన కొందరు జర్నలిష్టులకు ఉంది..


శ్రీ శివ గారితో వచ్చిన చిక్కల్లా ఏమిటంటే...తానూ టీ వీ లలో చూసిన కొన్ని విపరీత పోకడల్ని..మీడియా మొత్తానికి అన్వయించే ప్రయత్నం చేయటం..ఇదంతా కూడా పరిసరాల విజ్ఞానం లేకపోవటం వల్ల వచ్చే మరొక చిన్నిపాటి ఇబ్బంది. కాస్తంత మనసు చేసుకుంటే...దీన్ని అధిగమించవచ్చు. మీడియా ప్రతినిధులలో ఉన్న పాజిటివ్ కోణాన్ని చూసే ఒక పాజిటివ్ ప్రయత్నం చేయటం మంచిది. అలాంటి ప్రయత్నం చేయటానికి శ్రీ శివ గారికి ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటే...మేము ఆయన్ను ఢిల్లీ కి రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే..ఇదంతా కూడా పరిసరాల విజ్ఞానం పెంచుకునే క్రమం లో ఒక భాగమే...శ్రీ శివ గారూ...మీ బదులు కోసం ఎదురు చూస్తున్నాం...
----------------------------------------------------------
నోట్: బ్లాగ్ నడుపుతున్న రాము గారికి ఒక విజ్ఞప్తి..శ్రీ శివ గారు సార్వజనీకరించి చేసిన పరుష పదజాలానికి అసలు రెస్పాన్స్ ఇవ్వ కూడదనే అనుకున్నాను కానీ...శ్రీ శివ గారి విపరీత వ్యాఖ్యల వల్ల మనసు కష్టపడి మరీ ఈ బదులు రాస్తున్నాను.. దీన్ని వ్యాఖ్యలలో పడేయకుండా...కాస్తంత చదువరుల కంట పడే విధంగా ప్రచురించ ప్రార్ధన.....

24 comments:

Rishi said...

రాము గారు,నాకు శివా గారు అన్న దానిలో తప్పు ఏమీ కనపడలేదు.ఈరోజుల్లో జర్నలిస్టులు అంటే ఎంత చులకన భావం ఉందో మీరు కనుక తెలుగు బ్లాగులని ఫాలో అవుతూ వుంటే ఈపాటికి అర్ధం అయి వుండాలి.ఈ జర్నలిస్టులు,చానెళ్ళ తీరు ఎలా వుంది అంటే,అందితే కాళ్ళు లెదా జుట్టు.మొన్నటికి మొన్న సానియా మిర్జా కుటుంబం మీద ఒక్క వారం రోజుల లోనే ఎన్ని రకాలుగా చూపించారో చూసారుగా.షోయబ్ సంగతి వదిలేద్దాము ఇక్కడ.మీడియా ని లోపలకి రానీయలేదు అని సానియ కుటుంబం మీద ఎన్ని అవాకులు పేలారు?మొదటినుండీ ఆ అమ్మయి వెంట పడింది మీడియా,ఇప్పుడు ఆ అమ్మయి వద్దు అనుకుంది పిలవలేదు అంతే.దానికి ఇంత గొడవ చెయ్యాలా.పైగా నేమో ఎంగేజ్మెంట్ హక్కులు ఇంతకి అమ్ముకున్నారు ఇప్పుడు పెళ్ళికోసం ఎవరిని నమ్ముకున్నారో అంటూ వ్యాఖ్యలా?
అదే వీరిని పిలిచి వుంటే ఇంకొక రకమయిన కధనం చూసే భాగ్యం కలిగేది మాకు.నిజం గా మీరు వ్రుత్తి ధర్మానికే కట్టుబడి వుంటే,ఆరొగ్యదాయకమయిన రిపోర్టింగ్ ఎందుకు చెయ్యరు మీరు?ప్రజలలో మన మీద ఇలాంటి భావం ఉంది అని మీ అధిపతులకి ఎందుకు చెప్పలేరు?ఇప్పుడు ప్రతీ పత్రికా,చానెల్ కార్పొరేట్ సంస్థల లాగే వున్నాయి కాబట్టి తప్పకుండా మీ సూచనలు సలహాలు తీసుకుంటుంది యాజమాన్యం.

ఆహా,అలా చెయ్యకుండా మమ్మల్ని ఇలా అంటున్నారు అని అక్కసు ఎందుకు.ఒక ఉదాహరణ,మన టీం ఇండియ లో కొంతమంది ఆణిముత్యాలు ఉండవచ్చు కాని టీం ప్రదర్శన బాగా లేకపోతే టీం మొత్తాన్ని తిడతామా,ఒక్కొకళ్ళనీ తిట్టుకుంటూ కూర్చుంటామా? ఒక సంస్థ,లేదా వ్రుత్తి లో వున్న వాళ్ళు సగం పైన భ్రష్టు పట్టిపోతే అందరినీ కలిపి నిందించటం మామూలే,కాదంటారా?

కధానాయకుడి ఇంట్లో కాల్పుల కేసే తీసుకుందాము.ఒక చానెల్ ఏకంగా కధానాయకుడు కదిలాడూ,నిల్చున్నాడు అంటూ క్షణ క్షణం రిపోర్ట్ చేసి సడెన్ గా కాం అయిపోయింది అంటే మా లాంటి వారికి ఏమి సంకేతాలు అందుతాయి?రాత్రికి రాత్రి ఆయన నిరపరాధి అనటానికి సాక్ష్యాలు దొరికాయి అనుకుని మిమ్మల్ని ఏమీ అనకుండా నోర్మూసుకు కూర్చోవాలేమో,అవునా?

Prasad. Bondalapati said...

ఒక సందేహం...
"అది మీడియా కి చెప్పటానికి వారికి ఉన్న అభ్యంతరమేమిటి?"
మీడియా లో ఎవరు మావోయిస్టులో ప్రభుత్వానికి తెలియక పోతే, ప్రభుత్వం ప్లాన్ మావోఇస్టులకి చేరే అవకాశం ఉంది. ఈ విషయాన్ని శివ గారు ముందే చెప్పి ఉన్నారు దాన్ని మీరు ఎందుకని పట్టించుకోవటం లేదు?
శివ గారూ,
ఏదేమైనా మీకు అవకాశం ఉంటే ఒక సారి వెళ్ళీ చూసి రండి. :-)

kvramana said...

ఒక బ్లాగ్ లో రాసే అవకాశం వచ్చిన వెంటనే తన కలానికి పదును పెట్టిన శివ గారు నిజంగా మీడియలో ఒక రెపొర్టర్ గ పని చేయాల్సి వస్తే ఎలా ఉండే వారో?
కేవలం మీడియా అంటే టివి చానెల్స్ అని అనుకోకండి. నాకు అర్ధం ఐనంత వరకు శివ గారు చానెల్స్ ను ప్రాతిపదికగా తీసుకొని మీడియ మొత్తాన్ని ఆడి పొసుకున్నారు.

RAM SHANKAR said...

హలో ఢిల్లీ జర్నలిస్ట్ గారు, జర్నలిజం మాఫియా కంటే దారుణంగా తయారైంది, నిజం చెప్పాలంటే మాఫియా వాళ్ళు దేశాన్ని ఉద్దరిస్తున్నామని చెప్పరు, కానీ మీడియా అలాకాదు, ఫోర్త్ ఎస్టేట్ అని ఒక పెద్ద ముసుగు వేసుకొని,మీడియా స్వేఛ్చ పేరుతొ నానా రకాలుగా బొక్కుతున్నారు. ఇది సగానికి ఎక్కువ మంది జర్నలిస్ట్లులు చేస్తున్న జర్నలిజం. ఇది అక్షరాలా నిజం . కాదు కూడదు అంటే అది మీకు జర్నలిజం మీద ఉన్న ప్రేమ అనుకోవాలి తప్ప, ప్రజల ద్రుష్టి లో మీడియా మీద ఉన్న అబిప్రాయం ఇంత కంటే గొప్పగ ఏమి లేదు.

స్వర్ణమల్లిక said...

శ్రీ శివ ప్రసాద్ గారికి మా పూర్తీ మద్దతు తెలుపుతున్నాను. ఇక మీరు చేసిన ఈ కింద వ్యాఖ్యానం గురించి...

"స్థానికంగా ఇక్కడ ఇబ్బందులు పడుతున్న మీడియా ప్రతినిధులు ఎలాంటి దురవస్థలో ఉద్యోగం చేస్తున్నారో...కనీస పరిజ్ఞానం లేకుండా శ్రీ శివ గారు చేసిన తొందరపాటు వ్యాఖ్యల నేపధ్యంలో"

జర్నలిస్టులు మాత్రమె కాదు అన్ని రంగాల్లోను ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి ఉద్యోగాలు, వృత్తులు చేసుకుంటున్నారు. అలాగని కనీస విలువలు కూడా మర్చిపోవాలా. ఒక జర్నలిస్టుగా మీ బాధ్యత ఏమిటి? అనేది మీకు మా కన్నా బాగా తెలుసు అనే అనుకుంటున్నాను. ఎలాంటి నిజమైనా సరే నిక్ఖచ్చిగా ప్రజలకు తెలియచేయడం. మరి ఈ రోజు ఆ బాధ్యతని ఎవరు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ప్రతి వార్తాపత్రిక, లేక న్యూస్ ఛానల్ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీ గుత్తాధిపత్యంలో నడుస్తోంది. ఒక విషయాన్ని ఎంతమంది చెప్పినా ఒకే విధంగా చెప్పాలి. కానీ మన పత్రికలు చేస్తోంది ఏమిటి? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా.. అసలు విషయం ఏంటి అని సామాన్యుడు జుట్టు పీక్కోవలసిందే. ఎన్నికలకు ముందు ఆ ఫలానా పార్టీనే ఖచ్చితంగా గెలుస్తుంది అని ఫలానా సర్వే చెప్పింది అంటూ.. ప్రతి పేపర్ ఒక్కొక్క పార్టీ గురించి చెప్పింది. మొన్నటికి మొన్న తెలంగాణా ఉద్యమ విషయంలో టివి 9 వారి హడావుడి చూస్తె ఎవరికైనా అర్ధం అవుతుంది. ఒక పక్షం వారి గళాన్ని మాత్రమె ప్రజలకు చేరవేస్తున్నారు అని. నాణ్యమైన వార్తలు ఏ ఛానల్ వారు ఎన్ని చూపిస్తున్నారో లెక్కిన్చుకోండి ఒక్క సారి. ఒక ప్రధాన విషయాన్ని తీసుకుని గంటలు గంటలు మార్చి మార్చి చెపుతూ.... పోటీ ప్రపంచంలో ఈ మాత్రం చేయాల్సిందే అని సమర్దిన్చుకోడం సరి కాదు. ఇంతకన్నా పెద్ద వ్యాఖ్య రాయడం సమంజసం కాదు.

నండూరి సుబ్బారావు said...

ఇక్కడ పాత్రికేయవృత్తిలో లేనివారు గమనించాల్సిన ముఖ్యవిషయాలు కొన్ని ఉన్నాయి.
౧)అందరు పాత్రికేయులూ మీరు అనుకొనేంత చెడిపోయిలేరు. పత్రికలు, ఛానెళ్ళూ చెడిపోవడానికి కారణం యాజమాన్యాలేకానీ పాత్రికేయులు కారు. వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల కోసం రాజీ పడుతున్నారు. అలా రాజీపడటం, చూసీచూడనట్లు పోవడం అన్ని వృత్తులలోనూ ఉంది.
౩)పత్రికలు సమాజానికి అద్దం కనుక అద్దం చెడిపోగూడదని క్రితం టపా వ్యాఖ్యల్లో ఒక మిత్రుడు అన్నారు. అద్దం చెడిపోతే ముఖానికేమీ నష్టం లేదు. మన ముఖం మీద మనకు నమ్మకముంటే అద్దం లేకపోయినా పర్వాలేదు.
౪)ప్రజలు దేన్ని చదువుతారు, దేన్ని చూస్తారు? దేన్ని ఎలా చెపితే పత్రికకు ఆదరణ పెరుగుతుంది అనేదాని మీద సాధ్యమైనంత శాస్త్రీయ సమాచారంతో కోట్లాదిరూపాయలు పెట్టుబడి పెట్టి పత్రికలనూ, ఛానళ్ళనూ నడుపుతున్నవారు, జీతానికి పనిచేస్తున్న వాళ్ళు చెపితే తమ పద్ధతి మార్చుకోరు. దాన్ని వాళ్ళ వినియోగదారులే యజమానులకు అర్థమయ్యేలా చెప్పాలి.
౫) అందర్నీ ఒకేగాటన కట్టడం ఎప్పుడూ మంచిదికాదు. అది సరైనదనుకుంటే సమాజమంతా చెడిపోయి ఉందని ఒప్పుకోవాలి. మరి అప్పుడు పత్రికలు, ఛానళ్ళు (మీ దృష్టిలో ఇవే పాత్రికేయులు, నిజానికి రెండూ వేర్వేరు) చెడిపోతే వచ్చే నష్టం ఏమిటి?
౬) ఒక ఉపాధ్యాయుణ్ణి విమర్శిస్తే వాళ్ళంతా ఎదురుతిరుగుతారు, ఇంకా ఏ ఇతర ఉద్యోగిని విమర్శించినా ప్రతిఘటన సమష్టిగా ఉంటుంది, పాత్రికేయులలో అలా ఉండదు. వాళ్ళను విమర్శించేందుకు ఏకంగా బ్లాగులే నడుస్తాయి. సమర్ధించడానికి మాత్రం గొంతులు కలువవు.
ఆఖరిగా ఒక్కమాట. మీడియా చెడును చూపిస్తోందనీ, చెడును మాత్రమే ఫోకస్ చేస్తోందనీ అనేవారు, పాత్రికేయులలో చెడును మాత్రమే ఎందుకు చూస్తున్నారు?

రవిచంద్ర said...

శివ గారు సార్వజనీకరించి చెప్పినా తగలాల్సిన వాళ్ళకు తగిలితే చాలు. మీరు మీ వృత్తిపట్ల నిబద్ధతను ప్రదర్శిస్తూ ఉండవచ్చు గానీ మీ వృత్తికి చెడ్డపేరు తెచ్చే జర్నలిస్ట్ లను ఎవరైనా విమర్శిస్తే మాత్రం వెనకేసుకు రావద్దు.

నండూరి వెంకట సుబ్బారావు said...

అసలు పత్రికలూ, టీవీలు నచ్చనివారు, లేదా ప్రత్యేకంగా ఒక విలేకరి పనితీరు నచ్చనివారు దాన్ని సహేతుకంగా చూపుతూ, కనీసం పాతిక కాపీలు సర్క్లులేషన్ తగ్గించండి. మేమందరం మీ పత్రిక చదవడం/ మీ ఛానల్ చూడటం మానేస్తున్నాము అని వాళ్ళకు తెలిసేందుకు అదే సరైన మార్గం. అప్పుడు మాత్రమే యాజమాన్యాల పంథా మారుతుంది. పాత్రికేయులూ మారతారు (అవసరమైతే). ఇక్కడ తమ ఆక్రోశం వెళ్ళగక్కేవారిలో చాలామంది దాన్ని ఎక్కడ ఎలా వెళ్ళగక్కాలో తెలియక మాత్రమే వాఖ్యానాలు వ్రాస్తున్నారనుకుంటున్నాను. అలా కఠినమైన వాఖ్యానాలు వ్రాయడం వల్ల మీ ఆవేశం తీరుతుందేమోగానీ ఎలాంటి ఇతర ఉపయోగమూ ఉండదు. పాత్రికేయవృత్తిలో మా (ప్రజలు) సోర్సుల వద్ద, ఎలాగైనా (బెదిరించైనా) పనిచేయించగలిగే వారికే గౌరవం. సంపాదుకుల వద్ద రాత్రి పార్టీలలో పాల్గిని, రాజకీయనాయకులతో అంటకాగి అయినా సరే సెన్సేషల్ వార్తలు పట్టుకొచ్చేవారికే గౌరవం. ఓపికగా పూర్వాపరాలూ, సామాజిక ప్రయోజనాలు ఆలోచించి పనిచేసే జర్నలిస్టుకు బిళ్ళబంట్రోతుకు వచ్చే ఆదాయం కూడా రాదు. చివరకు పెళ్ళాం పిల్లలు ముఖాన ఊస్తారు. అంటే కుటుంబంలో కూడా గౌరవం ప్రేమా దక్కవు. అదీ సంగతి, ఆపైన మీ భావ ప్రకటనా స్వాతంత్ర్యం, మీ ఇష్టం..

Anonymous said...

Dear Delhi Journalist,

You've invited Sivs garu, that's fine. He can represent the place on behalf of bloggers and people who put in their valuable comments.

But there are several questions unanswered..the anti social elements in AP Bhavan..why you people have kept quiet about this for a long time, instead of exposing them...and many related and unrelated questions. Siva garu's comment was the first published comment. But did you read all the comments that followed? Did anybody support the media completely and whole heartedly?

Everybody accepts that you journalists, too, have problems. But they are vexed up with the behaviour of MANY in the field. Iam a small time reporter with a Telugu news paper. I've chosen to remain a contributor because that way I can choose my topics and I can work at my convenience.Moreover,I donot like the way media people behave and pass comments with half knowledge. I've seen cases where... the media reported that a mob of 100 clients went to a police station to complaint against a company, when the actual number was only 4.... the reporter of an English news paper demanded a LapTop computer from the chairman of a company for publishing about him....another reporter demanded an expensive, imported camera...a group from a TV channel asked and took money for the coverage of a new year bash at a club...These are only to name a few.

Your invitation to Siva garu is right. But you should have addressed the letter to the general public and waited for the response. But will you dare to do it?

Anonymous said...

We all support Mr.Shiva.
May be the truth is bitter...

Anonymous said...

తిన్నామా
పడుకున్నామ్మా
తెల్లారిందా
ఇంట కంటే ఇంకేమి కావాలి సార్

Anonymous said...

We all support Mr.Shiva.
May be the truth is bitter...

I second you brother

Anil Dasari said...

బాగుంది. అందర్నీ వేలెత్తి చూపే మీడియా మహానుభావులకి, తమని వేరెవరో తప్పుపడితే వళ్లు మండిపోయిందన్నమాట.

మీడీయాలో ఉన్న కొందరు వెధవాయిల్ని సార్వజనీకరించటం అన్యాయం అంటున్నారు, సరే. మరి మీడియావారు పోలీసుల్నీ, రాజకీయనాయకుల్నీ ఎంతగా జెనరలైజ్ చేసి పారేయలేదు? ఆ రెండు వృత్తులంటేనే ప్రజల్లో అసహ్యం ప్రబలటానికి మీడియా కాదా కారణం? వాళ్లలో మంచివాళ్లు లేకపోలేదా? తమదాకా వస్తేనే తెలిసేనా నొప్పి?

శరత్ కాలమ్ said...

నేను కూడా మీడియాలో పాజిటివ్ కోణాన్ని చూడాలనుకుంటున్నాను. ఎవరయినా నా టికెట్టు ఖర్చు పెట్టి పిలిస్తే ఇండియా కానీ, ఢిల్లీ కానీ వచ్చి చూస్తాను.

Anonymous said...

@ Nanduri SubbaRao:

I'm !st anonymous. Kindly read my comment once again. I've quoted very very few incidents.

You said that it is not good to put everybody in one category and asked without hesitation....' what's wrong in the media becoming a rot when the entire world is a rot'...I'm just stunned at your perception. Then why should the media be named 'the fourth estate'? Why should we consider the news authentic? Why not the Newspapers and the Channels openly declare themselves as business people?

Regarding your 5th point, please think again and again. Just think of the incidents that have occured over the last four years where a particular organisation in the media was backed by the entire media.

Saahitya Abhimaani said...

ఒక ఢిల్లీ విలేఖరి స్పందన అవేదన, ఆహ్వానం

రామూగారు కాచీగా పేరు పెట్టారు కాని ఇందులో అవేదన పడేది ఏమున్నది. స్పందన అన్నారు బాగున్నది. ఇక ఆహ్వానం. ఇలాంటి వ్యంగ్య ఆహ్వనాలు, ఆహ్వానలే కాదు. ఢిల్లీలో వీరి పరిస్తితి చూడటానికి ఒక బ్లాగరు రావాలా. తమ స్థితి గురించి తాము చూపించుకునే/వ్రాసే దశలో లేరేమిటి. ఇలా మీ కథనానికి స్పందించిన వాళ్ళ మీద వ్యక్తిగతమైన దాడులకి దిగే బదులుగా, అక్కడ వారి కష్టాలు ఏమిటో ఒక ప్రోగ్రాము బొమ్మలతో మంచి విజువల్స్‌తో చూపిస్తే మేము చూసి తరించే వాళ్ళం కదా, ఈ మధ్య పెళ్ళిళ్ళకి అలాంటి ఇతర కుటుంబ పరమైన కార్యక్రమాలను కూడ గోడల మీంచి జూం లెన్సులు పెట్టి మరీ చూపిస్తున్నారుగా, ఈ ఎ పి భవన్లోకి రానివ్వకపోతెనేం బయటనుండి తమ దగ్గర ఉన్న టెక్నాలజీతో ఆ అకృత్యాలేమిటో చూపరాదా.

తరువాత ఇలా ఆ గెస్టుహౌసు గట్లమీద పడిగాపులు దేనికండి. తమకంటూ ఒక చిన్న ఏర్పాటు చేసుకోలేరా ఇంత శక్తిమంతమైన మీడియా!! ఆశ్చర్యం.

నేను వ్రాసినదానిలో "ఆవేదన" చెందాలిసినది నాకు ఏమీ కనపడలేదు. పోనీ నా తప్పు నాకు తెలియదు అనుకుందాము, వ్యాఖ్యలు చేసిన అనేకమంది కూడ "తప్పెమిటి?" అని ప్రశ్నించారే మరి.

ఈయన గారి ఆక్రోశం చూస్తుంటే నేను ఈ ఎ పి భవన్ ఉదంతం గురించి మీరు వ్రాసిన కథనానికి నా స్పందన గురించి కాదనుకుంటాను. "గెస్టోపో" లేదా "కెజిబి" లాగ మీ బ్లాగును, అందులో ఏవరెవరు ఏ వ్యాఖ్య వ్రాస్తున్నారు అని ట్రాక్ చేస్తూ ఎక్కడా కూడ వారికి తగిన వ్యాఖ్యలు రాకపోయేప్పటికి వెళ్ళగక్కుతున్న ఆక్రోశమే గాని మరేమీ కాదన్న విషయం విదితమౌతున్నది. నేను మీ బ్లాగుకు వచ్చి నా స్పందనను నిర్మొహమాటంగా వ్రాసి అనవసరంగా ఎక్స్‌పోజ్ అయ్యానని నా శ్రేయోభిలాషులు నన్ను మందలిస్తున్నారు.

ఒక విషయం గురించి చర్చ జరుగుతున్నాప్పుడు ఆవతలివారి మీద వ్యక్తిగతమైన వ్యాఖ్యలు చెయ్యటం మంచి పధ్ధతికాదు, చర్చా పటిమ లేక చేసే పనులలో మొట్టమొదటిది అది. మచ్చుకు చూడండి ఈయనగారు చేసిన వ్యక్తిగతమైన వ్యాఖ్యలు!
"...విపరీతమైన పని ఒత్తిడి వల్లనో, లేక మరే ఇతర వ్యక్తిగత కారణాల వల్లనో.......ఇబ్బందితో బాధపడుతుండటం.............ప్రమాదకరమైన ఆలోచనా ధోరణి నుంచి మీరు బయటపడండి.............అది మీ భుజాలకే నొప్పి కలిగించే విషయం.........ఇదంతా కూడా...మిమ్మల్ని సామజిక స్పృహ దిశా గా.............ఏదో టార్గెట్ (మీకు లాగా) చేసినట్టు..............కనీస పరిజ్ఞానం లేకుండా శ్రీ శివ గారు చేసిన తొందరపాటు వ్యాఖ్యల నేపధ్యంలో...............శ్రీ శివ గారితో వచ్చిన చిక్కల్లా ఏమిటంటే..............ఇదంతా కూడా పరిసరాల విజ్ఞానం లేకపోవటం వల్ల వచ్చే మరొక చిన్నిపాటిఇబ్బంది...............మీడియా ప్రతినిధులలో ఉన్న పాజిటివ్ కోణాన్ని చూసే ఒక పాజిటివ్ ప్రయత్నం చేయటం మంచిది..........పరుష పదజాలానికి అసలు రెస్పాన్స్ ఇవ్వ కూడదనే అనుకున్నాను.............."

రామూ గారూ, మీరు ఎన్ని సార్లు ఈ మీడియా వ్యక్తుల గురించి మీ వ్యాసాల్లో చాలా పదునైన మాటలతో వ్రాయలేదు అప్పుడులేని ఈ "అవేదన" ఇప్పుడు ఇలా పెల్లుబికిందేమి? అంటే మీరు కూడ ఒకప్పుడు తమవారే అనా? భమిడిపాటి కామేశ్వర రావుగారు ఒక నాటికలో అన్నట్టుగా, "మాలో మేము తిట్టుకుంటాం లేదా దీవించుకుంటాం మధ్యలో మీరెవరు" అని ఒక పెడ ధోరణా? నాకు ఇదంతా చూస్తుంటే, మీరు నిర్వహిస్తున్న బ్లాగులో మీరు వ్రాసే విషయాల గురించి మిమ్మల్ని ఎమీ అనలేక ఇలా వ్యాఖ్యలు చేసిన వారి మీద పడుతున్నారనిపిస్తున్నది.

నేనేమీ నా వ్యాఖ్యలో ఎక్కడా ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచేవిధంగా వ్రాయలేదే మీ పాఠకులు లేదా ప్రేక్షకులు విమర్శ తెలియచేస్తే వెంటనే ఆ వ్యక్తిమీద వ్యక్తిగత విమర్శలకు దిగజారిపోతారా.

Saahitya Abhimaani said...

(నేను వ్రాసిన మొత్తం వ్యాఖ్యగా సైజు పెరగటం వాళ్ళ కాబోలు తీసుకోవటం లేదు అందుకని రేమ్డుభాగాలుగా పోస్టు చేసాను)

నా పేరుతో సంబొధించే ఈయనగారు, తన పేరు చెప్పే కనీస మర్యాదను పాటించకపోతిరి, పైగా నా వయస్సు, నేనేమి చేస్తుటాను కూడ కావాలట. అసలు, అన్నిటికంటె చిత్రమైన విషయం నా స్పందనలో నెను వేసిన ప్రశ్నకు, ప్రతిస్పందించిన నండూరి గారు కాని, ఈ పేరులేని వారుగాని, సమాధానం చెప్పనే లేదు. మిమ్మల్ని ప్రభుత్వ అతిధి గృహంనుండి బయటకు పంపెదాకా అక్కడ జరుగుతున్న అకృత్యాలాగురించి తెలియదా? వాటి గురించి పూర్తి వివరాలతో వ్రాయటానికి ఏమిటి అభ్యంతరం? రామూగారే తన ఒరిజినల్ వ్యాసంలో అన్న మాటలను ప్రాతిపదికగా తీసుకుని నేను స్పందించిన తీరు మీకు ఇంత కోపం తెప్పించింది అంటే, ఏమనుకోవాలి?

మరొకటి, ఒక విషయం మీద చర్చ జరుగుతున్నప్పుడు, ఒకరు ఒక దృక్కోణం విశదపరిచినప్పుడు, ఆ కోణం అక్కడున్న అనేకమందిలో ఏ ఒకరికో అనుకూలంగా కనబడవచ్చు. అది పట్టుకుని వారిద్దరినీ కలిపెయ్యటం ఏ విధమైన చర్చ? ఎందుకు అన్నానంటే వారు చేసిన ఈ వ్యాఖ ".............ఒక కొత్త జీ వో ఏమైనా శ్రీ శివ గారి చేత ప్రభుత్వం డ్రాఫ్ట్ చేయించింద?.........." అంటే నేను ప్రభుత్వం వేపున మాట్లాడుతున్నానని మీకు తోచిందా!! అక్కడ ఉన్న పరిస్తితి, తెలిసిన విషయాల మీద అసంబధ్ధంగా ఉన్న వాదనను తేటతెల్లం చెయ్యటమే నా వ్యాఖ్య ఉద్దేశ్యం. సెక్యూరిటీ విషయాలను ప్రబుత్వం మీడియాతో పంచుకోవాలా. అలా చేస్తే ఇక సెక్యూరిటీ ఏమున్నది?

ముంబాయి దాడుల సమయంలో మీడియా ఏ విధంగా ప్రవర్తించిందో దేశం మొత్తం చూసింది. అత్యుత్సాహం చూపించి టెర్రరిస్టులకు కళ్ళు, చెవులుగా పని చేసింది. ఇది చూసి వేలకొద్ది సామాన్య ప్రజలు సుప్రీం కోర్టులో పబ్లిక్ ఇంటరెస్టు లిటిగేషన్ వేశారుట. ఆ పిల్ అతీ గతీ తెలియదు, మీడియా అటువంటి "నెగెటివ్" విషయాలగురించి వ్రాయదు.

ఎవరికి విషయ పరిజ్ఞానం లేక కొట్టుకుంటున్నారో, ఎవరు భుజాలు నెప్పేట్టుగా చేతులు తెగ ఆడిస్తూ ఇతరులను వ్యక్తిగతంగా దూషించే స్థాయికి దిగజారిపోయారో వారి స్పందనే తెలుపుతున్నది. పరుష పదాలు వాడాను అన్నారు. చెప్పండి ఆ పరుష పదాలేమిటో, ఎక్కడ వాడవలసిన మాట అక్కడ వాడితే అది పరుషమా. నాకు ప్రస్తుతం పేపర్లలో వ్రాసే తెలుగు, టి.వి తింగ్లీషు రాదు మరి. మంచి తెలుగులోనో లేదా మంచి ఇంగ్లీషులోనో వ్రాస్తే పరుషంగానూ అనిపించటం చాలా చిత్రం! అవును సవ్యమైన భాష టి విల్లో ఎలానూ లేదు, పత్రికలలో కూడ క్రమంగా మాయమై పోతున్నది, అలా వ్రాస్తే పరుషంగా అనిపించదా మరి.

"సామాజిక స్పృహ", "పాజిటివ్ థింకింగు",మరొక్క మాట మరిచారు పాపం ఆయన, "మనో భావాలు గాయపడటం లేదా దెబ్బతినటం" వంటి పడికట్టు మాటలు, అవును పడికట్టు మాటలే, ఎంతగా దుర్వినియోగం అయ్యాయంటే వాటి అసలు అర్ధాలు తెలియకుండా పోయాయి, ప్రస్తుతం ఏ ఇద్దరు వ్యక్తులుకూడ వీటిమీద వీటి అర్ధం ఇదమిధ్ధంగా ఇది అని ఒప్పుకునే స్థితి లేదు , కారణం ఎవరిష్టమొచ్చినట్టుగా వారు ఈ మాటలను తమకు అనువైన రీతిలో వాడుకోవటమే. ఇంకా చిత్రం ఏమిటి అంటే ఒకే వ్యక్తి ఈ మాటలను తనకు కుదిరిన పధ్ధతిలో వేరు వెరు సందర్భాలలో వేరు వేరుగా తనకు అనుకూలంగా వాడుకోవటం

ఇక మీడియాని పాజిటివ్ గా చూడటం, పాజిటివ్ విషయాలమీద రిపోర్టింగు ఉంటే తప్పకుండా పాజిటివ్‌గానే తీసుకునే అవకాశం ఉన్నది. అటువంటి అవకాశం ఎప్పుడోకాని దొరకటంలేదు మాకు.

సరే పోనివ్వండి ఇక ఇంతకంటె నేను స్పందించాల్సిన అవసరం కనపడటంలేదు. చర్చ వ్యక్తిగత దాడులకు దిగుతూ చౌకబారు స్థాయి దిగజార్చిన తరువాత కొనసాగించటం హాస్యస్పదమవుతుంది, ఇక అది చర్చగా మనలేదు. ఇప్పుడు మీ బ్లాగులో వ్రాసిన మొదటి వ్యాసం (ఎప్ భవన్లో సెక్యూరిటీ కారణాలు...) ఆ వ్యాసం మీద వచ్చిన వ్యాఖ్యలు, ఈ "అవేదన" దీని మీద వచ్చిన మరిన్ని వ్యాఖ్యలు గుదిగుచ్చి ఎదైనా ఒక పత్రికలో ప్రచురించండి, అప్పుడు పూర్తి పాఠక లోకానికి విషయం తెలిసి, వారు ఎలా స్పందిస్తారో చూద్దాం.

సుబ్బారావు said...

అజ్ఞాత గారికి,
అభినందనలు. నేనూ అచ్చం మీలాగే చెడిపోవడం ఇష్టంలేక కంత్రిబ్యూటర్గా మిగిలిపోయిన వాడినే. కానీ అలా ఉండాలంటే సరైన ఇతర నైపుణ్యాలూ, ఆర్థిక నేపథ్యం, మానసిక స్థైర్యం కావాలి. ఇవి ఈ కాలంలో ఎంత మందికి ఉన్నాయి? ఎంతమందికి ఉండనిస్తున్నారు? ఏ ఉద్యోగమైనా దాదాపుగా అంతేకదా?
ఇక పత్రికలు, ఛానళ్ళూ వ్యాపారప్రయోజనాలకోసమే నడుపబడుతున్నాయనీ, ఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలే వాటికన్నిటికన్నా ముఖ్యమనీ తెలియనిదెవ్వరికి? ఇంకా సమాజంలో అంత అమాయకులెవ్వరున్నారు? సినిమాల్లో చూపించేదీ, టీవీసీరియళ్ళలో వచ్చేదీ ఎంత నిజమో, పత్రికల్లో వచ్చేదీ దాదాపుగా అంతే నిజం. నా పరిశీలనలో ఈ కఠోర వాస్తవం గ్రామీణులకు స్పష్టంగానే తెలుసు. కళ్ళెదురుగా కనబడుతున్న దాన్ని అర్థం చేసుకోవడానికి శక్తు లేకో, అంగీకరించడానికి మనసురాకో చదువుకున్న మధ్యతరగతి వాళ్ళు ఇంకా పత్రికలనుంచి ఏదో ఆశిస్తున్నారేమో?
మొత్తం నాలుగు ఎస్టేట్లలోనూ విక్రమార్కసింహాసనాలేమీ లేవని అందరూ గుర్తుంచుకోవాలి. అక్కడున్నదీ మనలాంటి మనుషులే. జర్నలిస్ట్ అనో, న్యాయమూర్తి అనో, కలెక్టరు అనో, మంత్రి అనో బోర్డు తగిలించుకోగానే వ్యక్తిగత నైతిక విలువలేం పెరిగిపోవు. ఇప్పటికే అక్కడున మురికి కారణంగా తరిగిపోకుండా ఉండటమే గగనం. అంచేత జర్నలిస్టు అనగానే ఒక ఆదర్శమూర్తిని ఊహించుకోవడం మానేయండి.
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే జర్నలిస్టులు, మీడియా చెడిపోవడం వల్ల సమాజానికి, అందులోని సామాన్యుఅలకూ వచ్చిన ప్రాక్టికల్ నష్టం, మిగిలిన మూడు వ్యవస్థలూ చెడిపోవడం వల్ల వచ్చిన, వస్తున్న ప్రాక్టికల్ నష్టం, కష్టం కన్నా చాలా చాలా తక్కువ. ఒక పత్రిక, ఒక పార్టీని భుజాన వేసుకుంటే, ఒకళ్ళని ఎండగడితే సామాన్యుని దైనందిక జీవనంలో దాని ప్రభావం ఎంత, ఎవరికి వారికి వాళ్ళు దాన్ని నమ్మినంత. మనం మన కళ్ళనీ, చెవులనీ నమ్మడం మానేసి, మన బుర్రలను ఉపయోగించడం మానేసి మీడియా కళ్ళతో లోకాన్ని చూస్తే, మీడియాకు ఇంత బలం వస్తుంది. లేకపోతే లేదు.
ఇప్పటికే తెలివిగల అధికారులూ, వ్యాపార వర్గాలూ, రాజకీయనాయకులూ అత్యవసరమైతే తప్ప మీడియా ఏం రాసినా ప్రతిస్పందించడం మానేసారు గమనించారా? గ్రామాల్లోనూ, కాలక్షేపానికో, దానివల్ల తమకు ప్రత్యేక ప్రయోజనముంటేనో తప్ప విలేకరులను గానీ, పత్రికల్లో వార్తలను గానీ ఎవరూ సీరియస్గా పట్టించుకోవడం లేదు. అందుకే పత్రికా యాజమాన్యాలు ప్రజలతోపత్రికలు చదివించడం ఎలా అన్నదానిమీద అనేక విన్యాసాలు చేస్తున్నాయి. మీరెవ్వరూ దీన్ని గమనించలేదా?
మీడియా చెడిఫోయింది నిజమే. బాగుచేయాల్సిన మాట వాస్తవమే. అందుకు ఏదైనా నిర్మాణాత్మకమైన సకారాత్మకమైన ముందడుగు వేసే ప్రయత్నం చేద్దాం. మొన్నెప్పుడో రామూ గారు సహకారరంగంలో పత్రిక అన్నపుడు కనీసం ప్రయత్నం చేద్దాం అన్నవారేరీ? రామూగారు కూడా తమ బ్లాగు లక్ష్య ప్రకటన వాక్యాలలో వరుస మార్చాలని నా ప్రార్థన. మంచిని ప్రోత్సహిద్దాం అన్న వాక్యాన్ని మిగిలిన రెండు వాక్యాలకు ముందుకు తెండి సార్ దయచేసి.

సుబ్బారావు said...

శివ గారూ, మీ ఆవేదనలో నిజం ఉంది. ఢిల్లీ విలేకరి స్పందన దురుసుగా ఉన్నమాట, అంతకన్నా ముఖ్యంగా తర్కబద్ధంగాలేనిమాట నిజమే. ఇలాంటి వాదనల వల్ల అసలు విషయం పక్కదారిపట్టడం సహజమే. మా ఇబ్బందులు మీకు తెలియనప్పుడు వాటిని సవివరంగా, సహేతుకంగా తెలియజేయాల్సిన బాధ్యత మాదే. రామూ గారు బ్లాగు ప్రారంభించినప్పుడు అలా వ్రాస్తారని ఆశించినవారిలో నేనూ ఒకణ్ణి. కానీ అలాంటి సకారాత్మక ప్రయత్నం తక్కువగా ఉంది. ఆ నొప్పి మీ మీద దాడిగా మారి ఉంటుదనే మీ ఊహ నాకూ తార్కికంగా కనబడుతోంది. అయితే సదరు ఢిల్లీ జర్నలిస్టు ఉద్దేశ్యం మాత్రం మా తిప్పలు మాకుంటాయి, వాటి గురించి రాసినప్పుడు మీరెందుకు విమర్శించాలి? (మా తప్పులు వ్రాసినప్పుడు ఎలాగూ విమర్శిస్తున్నారు కదా? తిప్పలు వ్రాసినప్పుడైనా సానుభూతి చూపవచ్చి కదా) అని. దాన్ని మీరే పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. మొత్తం మీద ఈ చర్చ బ్లాగు దశ-దిశలలో మైలురాయి అవుతుందని నేను ఊహిస్తున్నాను.

Anonymous said...

@ Nanduri SubbaRao:

I understand your agony. You'll have to stoop to the circumstances to keep going. I wish you prosperity and abundance that can give you the opportunity and strength to work constructively in cleansing the fourth estate, paving way for a bright Bhaarath.

Ramu S said...

సుబ్బారావు గారూ..
జర్నలిస్టుల ఇబ్బందులు చాలా సార్లు రాసానే? సకారాత్మక ప్రయత్నం అంటే ఏమిటో తెలియజెయ్యండి. తమ జీవితాల గురించి ప్రొఫైల్ చేస్తానంటే వద్దని బతిమాలుతున్న మంచి జర్నలిస్టులే అంతా. విలేకరుల గురించి వ్యక్తిగత మంచి రాస్తే..యాజమాన్యాలు ఇబ్బంది పెడతాయని వాళ్ళు అంటున్నారు. ఈ బ్లాగు ఇప్పుడు చేస్తున్న దానికన్నా మెరుగ్గా ఏమి చేయాలని మీరు అనుకుంటున్నారో నాకు మెయిల్ లో రాయండి. నా ప్రయత్నం నేను చేస్తాను.
రాము

Anonymous said...

రాము గారు ,
ప్రస్తుతం మీడియా లో లేని వారి గురించి మొదట రాయండి ... వారి అనుభవం మంచి ఓ కేసు తెసుకొని రాయండి .పది మంది కి ఉపయేగాపడుతుంది కదా....

Rushi varunn said...

hello Ramu garu...this is Rushivarunn(NEWS ANCHOR) from MAHAA NEWS. Nenu mee blog regular ga follow avutuunta, its good,but nakoka anumanam meeru MAHAA TV gurinchi tappa migata anni channels gurinchi matladutu untaru...May i know the reason?

Saahitya Abhimaani said...

చాలా కాలం ఎదురు చూసాను ఈ పేరూ ఊరూలేని అజ్ఞాత ఆవేదన చెందిన వారు మళ్ళి స్పందిస్తారేమోనని. నిరాశే. ఏ పి భవన్ లో జరిగే అకృత్యాలు ఏమిటి?? ఇంతవరకు వివరించలేదు. అంటే ఉన్నాయనుకోవాలా లేవనుకోవాలా. ఇంత ఆవేదన చెందిన పెద్దమనిషి అసలు విషయం మరిచి ఊరుకోవటం చూస్తుంటే, సామాన్య చదువరులు ఏమనుకోవాలి!?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి