Wednesday, April 21, 2010

'ఈనాడు' భువనేశ్వర్ విలేకరి... మిత్రమా..నీతోనే మేము

అన్ని ఇతర సంస్థలకన్నా ఎక్కువగా 'ఈనాడు' యాజమాన్యంలో ఒక దుర్లక్షణం ఉంది. బుర్ర, విలువలు, ఆత్మవిశ్వాసం ఉన్న జర్నలిస్టు ఎవరైనా...ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే వాడిని బుర్రతక్కువ, అహంకార బాసులు వెంటాడి వేధిస్తారు. అందులో భాగంగా ముందుగా రిపోర్టింగ్ లో ఉన్న వాడిని, డెస్క్ కు మార్చి సంఘంలో పలచన అయ్యేలా చేస్తారు. మరీ మొండి ఘటం అనుకుంటే...సదరు వ్యక్తిని పనికిరాని వాడు/ సున్నిత మనస్కుడు/ ఒత్తిడి తట్టుకోలేడు...వంటి ముద్ర వేస్తారు. ఈ పని చేయడానికి ఒక కుల సంఘం అక్కడ పనిచేస్తుంది...వేర్వేరు పేర్లతో. 

అయినా....సదరు జర్నలిస్టు పత్రికను వీడి వెళ్ళకపోతే....దూరప్రాంతాలకు బదిలీ చేస్తారు. పెళ్ళాం బిడ్డలకు దూరం చేస్తే సంస్థ వీడతాడని యాజమాన్యం కుటిల పన్నాగం. దీనికి చాలా మంది బలవుతారు. లొంగి పోతారు. కానీ కొందరు ఎక్కడికి బదిలీ చేస్తే అక్కడికి వెళ్లి యాజమాన్యాన్ని ఆడుకుంటారు...చక్కగా. అలా ఆడుకోవడం రాని నిజాయితీపరులైన అమాయకపు జర్నలిస్టులకు అండగా ఉండడం ఈ బ్లాగ్ ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఉదయం వచ్చిన ఒక మెయిల్ చూసి ఈ మాటలు రాస్తున్నాను. 
ముందుగా ఈ మెయిల్ చదవండి:

I would like to bring an issue relating to a journalist working for eenadu in Bhuvaneshwar (punishment transfer). He is fighting tooth and nail for his rights. He was denied even a single promotion in his entire career of 13 years and due to his frankness faced the wrath of management. He has put a number of complaints with labour commissioner and none have been pursued. On April 20th he was asked not enter the office premises. that is when he refused to sign on ETV register. Please inquire about him and make a post on the managements attitude and their misdeeds.

ఇది చదివి నాకు చాలా బాధేసింది. కడుపు రగిలిపోయింది. అప్పటి న్యూస్ టుడే ఎం.డీ., ఆ ఉజ్జోగం పొయ్యాక మొన్నటి దాకా 'తెలుగు దేశం' ఆఫీసులో పనిచేసిన రమేష్ బాబు గారు నన్ను కూడా నేను పనిచేసే డెస్కులోకి రానివ్వకుండా...సెక్యూరిటీ లో కూచోబెట్టారు...కోపంతో. దానిపై నేను రాసిన ఒక లేఖకు రామోజీ గారు, కిరణ్ గారు స్పందించి నన్ను బాగా పని చేసే మరొక చోటికి బదిలీ చేశారు. ఉద్యోగులను ఇలా హింసించడానికి రామోజీ గారు వ్యతిరేకమేమో, సెకండ్ రంగ్ బాసులు ఇలాంటి పిచ్చిపనులు చేస్తారేమో అని నాకూ అప్పుడు అనుమానం కలిగింది. అది నిజమో కాదో తెలియదు. 
 
సరే...ఈ పోస్టు చూసిన వారెవరైనా...ఆ భువనేశ్వర్ విలేకరి వివరాలు వెంటనే తెలియజేయండి. ఆ జర్నలిస్టు నీతిమంతుడైతే....తను నిజంగానే అన్యాయానికి బలైతే...'ఈనాడు' పై పోరాటానికి మేము సిద్ధం. ముందుగా...ఈ కేసును పరిశీలించి...కిరణ్ గారి దగ్గరకు వెళ్దాం. తర్వాత యూనియన్ ను సంప్రదిద్దాము. లేబర్ కమిషనర్ ను కలుద్దాం. అయినా న్యాయం జరగకపోతే...లీగల్ పోరాటం తో సహా అన్ని మార్గాలు పరిశీలిద్దాం. ఎం.పీ ఉండవల్లి అరుణ్ కుమార్ దగ్గరకు వెళ్దామని, ఈ పోరాటంలో ధన సహాయానికి సిద్ధమని కొందరు మిత్రులు ఇప్పటికే మాట ఇచ్చారు.  ఇది 'జర్నలిస్టు' అనే బిళ్ళ ఉన్న అందరికీ ఒక సవాల్. మన మిత్రుడిని మనం రక్షించుకుందాం. మన హక్కులు మనం కాపాడుకుందాం.
డియర్ రిపోర్టర్, don't suffer in silence. Fight back. We are with you.

9 comments:

Anonymous said...

రామూ గారు, ఈనాడు వ్యవస్థ గురించి మీరు చెప్పింది అక్షరాలా నిజం. అలాంటి కొందరు వ్యక్తులు ఈనాడు పాలిట వేరుపురుగుల్లా దాపురించారు. ఈ వేధింపులు స్టాపర్స్ కే కాదు, కంట్రిబ్యూటర్ల స్థాయిలోనూ అదే విధంగా ఉంటున్నాయి. ఇవన్నీ నిజంగా పెద్దాయనకి తెలియవా అని సందేహం వస్తుంది. పోరాటానికీ మాదీ మద్దతు ఉంటుంది. నాయకత్వం వహించండి. నాకు తెలిసినంతవరకూ ఇది అటు ఈనాడుకీ , ఇటు మొత్తం పాత్రికేయలోకానికే మేలు చేసే అవకాశం ఉన్న పోరాటం.
మధ్యలో వదలొద్దు.

Anonymous said...

ANONYMUS SAID...

EEnadu moodu padula pichiluku charitralo ilanti darunalu chalane unnai. Edirinche opika/ avakasam/ protsaham leni varu sarduku poyaru. Aite Gadiaram sarmadi Dharmagraham. Aayana monditaname srirama raksha. Yaajamanyaniki ontelu poistunna saramalanti vallu marikondaru ravali.

Anonymous said...

ఈనాడులో వ్యక్తుల ప్రతిభను గుర్తించి సానబట్టే మంచి వ్యవస్థ కూడా ఉంది. అసలు అదే ఈనాడు విజయాలకు ప్రాణం. కానీ మీరు ప్రస్తావించిన దుష్టవ్యవస్థ ప్రాబల్యం ఈ మధ్య బాగా ఎక్కువైనట్లు కనిపిస్తోంది. దాన్ని బయటపెట్టడం చాలా మంచి విషయం. ఈనాడులో పనిచేస్తున్న మిత్రులు ఎంత మంది దీనికి రహస్యంగా అయినా మద్దతునిస్తారో అనుమానమే. వారికున్న ఉద్యోగ అభద్రత(పైకి ఒప్పుకోకపోయినా), అలవాటు వల్ల వచ్చిన అలసత్వం దీనికి ముఖ్యకారణాలు. మీ ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆశిస్తున్నాను.

jara said...

yes we are also support him

Anonymous said...

రాము భాయ్.. మేము మీతోనే ఉన్నాము... పదండి ముందుకు

మీ

ఈనాడు మిత్రుడు

Anonymous said...

ayya...
eenadulo prasthutham chaala mandhi nijamgaa panikiraani vaallu / pressure thattukoleni valle vunnaru sir. veellu kudaa velli pothaaremonani bhayapaduthunnaru paapam. eemadhya okariddharu thirigi vachaaka dhairyam punjukoni... veellu eenadulo thappa verechota bathakalerane nirnayaaniki vachinatlunnaru.. andhuke malli employesni vedhinchatam start chesi vuntaaru....

Anonymous said...

Dear Ramu garu, this is Mr.S.Reddy known to u in Nalgonda(shuttle friend).
this is not uncommon in other departments and particularly in Govt.dept's. I am the best example: I've been transfered to 5 places in my short career of 5 years and presently kept idle in Hyderabad without any work.
why can't we try for a special blog/ forum for 'WHISTLE BLOWERS' from any dept.of A.P.

Anonymous said...

badhyatalu nirvarthinchakuda Hakkula kosam poratam cheesee vaariki miiru maddatu palukutaaraaa?

Ramu S said...

సర్...
భువనేశ్వర్ విలేకరి చరిత్ర చూశాకనే, కేసు పరిశీలించాకనే మద్దతు ఇస్తామని ఇప్పటికే స్పష్టం చేసాము. అవినీతిపరులకు మద్దతు ఇచ్చే ప్రశ్నే లేదు. బాధ్యతలు నిర్వహించాకుండా...హక్కులు మాట్లాడకుండా ఉంటె పరవాలేదా సార్?
హక్కులు మాట్లాడేవాడు ఎప్పుడూ బాధ్యతలు సరిగా నిర్వహించే అవకాశం ఉంది. లెట్స్ సీ.
రాము

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి