Friday, April 30, 2010

పీ.ఎఫ్.పై i-news సిబ్బంది దిగులు- పట్టించుకోని యాజమాన్యం

 i-news ఛానల్ లో ఉద్యోగులు....ఆలస్యమవుతున్న  జీతాలతోపాటు గోడకు కొట్టిన సున్నంగా మారినట్లు కనిపిస్తున్న తమ ప్రావిడెంట్ ఫండ్ (పీ.ఎఫ్.) గురించి తీవ్రంగా దిగులు పడుతున్నారు. యాజమాన్యం పే స్లిప్పులు ఇవ్వకుండా...పీ.ఎఫ్.కింద జీతంలో ఇతని కోతపెట్టడంతో జర్నలిస్టులు, సాంకేతిక సిబ్బంది కుమిలిపోతున్నారు. త్వరలో....ఈ అంశంపై మూకుమ్మడి పోరాటం చేయాలని, ముందుగా మానవ హక్కుల సంఘాన్ని కలవాలని  ప్రస్తుత ఉద్యోగులు, అక్కడ పనిచేసి వేరే ఛానెల్స్ కు మారిన మాజీ జర్నలిస్టులు భావిస్తున్నారు. 

ఇది ప్రవాస భారతీయుల ఛానల్ అని రాజశేఖర్ అనే జర్నలిస్టు  నమ్మబలకడంతో దాదాపు నాలుగు వందలకు పైగా ఉద్యోగులు పొలోమంటూ i-news లో ఏడాదిన్నర కిందట చేరారు. యజమానుల నిజస్వరూపం తెలిసి అందులో చాలా మంది వేరే చానెల్స్ కు వెళ్ళిపొయ్యారు....రాజశేఖర్ మహాశయుడితో సహా. డబ్బున్న మారాజు ఆయనకు పర్వాలేదు కానీ....మిగిలిన ఉద్యోగులు తమ జీతంలో నుంచి తమ వాటా కింద, యాజమాన్యం వాటా కింద....మానేజ్మెంట్ కోతపెట్టిన పీ.ఎఫ్.పై ఆశలు పెట్టుకున్నారు. 

"మీ పీ.ఎఫ్.ఎటూ పోదు," అని రాజా వారు నమ్మించడంతో ఉద్యోగులు కిమ్మనకుండా పనిచేసారు...పే స్లిప్లు ఇవ్వకపోయినా. అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న యాజమాన్యం ధోరణి చూశాక ...అసలు పీ.ఎఫ్. ఆఫీసులో సంస్థ అకౌంట్ లో ఈ మొత్తం నెలనెలా జమ అవుతుందా...అన్న అనుమానం కొందరికి కలిగింది. Integrated Broadcasting Company (P) Limited అన్న పేరుతో రాజశేఖర్ ఈ సంస్థను నెలకొల్పాడు. 

'ఇది పెద్ద స్కాం అని నా అనుమానం. ఎవరో ఒకరు దీనిమీద ఆరా తీయాలి, i-news యాజమానులను బుక్ చెయ్యాలి," అని ఆ ఛానల్ లో ఈ మధ్య వరకూ పనిచేసి N-TV లో చేరిన ఒక సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించాడు. ఆయన కట్టిన లెక్క ప్రకారం ఇప్పటి వరకూ i-news యాజమాన్యం రెండున్నర కోట్లకు పైగా ఉజ్జోగుల నుంచి పీ.ఎఫ్.కింద వసూలు చేసింది.
ఈ విషయంలో యాజమాన్యం ఉద్యోగులకు భరోసా ఇవ్వకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తంఅవుతున్నది. జర్నలిస్టు సంఘాలు దీనిపై స్పందించి న్యాయం చెయ్యాలని వారు కోరుతున్నారు.

14 comments:

Anonymous said...

Ramu garu,
Since a few days it seems you are deviating from the main track of your blog as you are concentrating more on the job problems of the staffers of media which is an internal,personal and employment problem of the media personnel which has to be settled either with the employers or court of law and the common viewer and reader is nothing to do with them.Let them fight through their various journalist organisations,labour courts etc.You can touch their job problems occassionally and can fight with and for them by mobilising various resources and man power but not expose regularly like a serial.In the last few items there is no mention of any programme of either channels or print media.Hope you understand our situation.
JP.

Anonymous said...

Swantham gaa katte PF paristhiti telusukoleni Journalist lu prajala samasyalni uddharistaara. Naakaithe nammakam ledu.

Anonymous said...

Eenadu thana chinna buddi marosari chupuchukundi. Yaduveer awardski sambandhinchi Marenna nu dismiss chesaru. Tappu rasina, pass chesina iddarini ventane dismiss cheyamani ramoji rao chebithe, rasina city reporter marenna nu bayataku pamparu. pass chesina vishnu paina charyalu lene levu. Bahusa ayanapi charya theesukunte eenadu kulipothundani bhayapaddaremo. bclu theraga dorikutaru MNR gariki, edhaina charyalu teesukodaniki. Adhe valla vallu ayithe charyalu vundavu, kaneesam memo kuda vundadu. god bless eenadu.

Ramu S said...

JP gaaru,
Namaste
I can understand that general readers don't have interest on such internal issues.
But our journalists don't have a proper forum to communicate among themselves. I thought such stories do expose the darker side of managements.
anyway, I am going to write the speech of Mr.Ramkaran, a fine journalist, on Paid News this evening.
Ramu

Saahitya Abhimaani said...

'ఇది పెద్ద స్కాం అని నా అనుమానం. ఎవరో ఒకరు దీనిమీద ఆరా తీయాలి, i-news యాజమానులను బుక్ చెయ్యాలి," అని ఆ ఛానల్ లో ఈ మధ్య వరకూ పనిచేసి N-TV లో చేరిన ఒక సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించాడు.

చిత్రంగా ఉన్నదండి రామూగారూ. తానొక జర్నలిస్టు అయ్యి ఉండి మరెవ్వరో అరా తీయాలి అనుకోవటమేమిటి? అటువంటి విషయాలు ఆరా తీసి కనీసం తోటి జర్నలిస్టులకు చెప్పలేరా. స్కూప్ మీద స్కూప్ అని ఉత్సాహపడుతున్న సోదరులు, తమ జీవితాల గురించి ఇలా నిరుత్సాహంగా వేరెవరో రావాలని అనుకోవటం.....

నాకు ఒకటి అనిపిస్తున్నది. చానెళ్ళు, పత్రికలూ ఒకరికొకరు ఎంత విరోధం ఉన్నాకూడా, ఇలాంటి విషయాలు ఒకరి దగ్గర జరిగే అన్యాయాలను మరొకరు ప్రచురించకూడదన్న ఒక కట్టడి చేసుకున్నట్టుగా ఉన్నది. ఆపైన ఒక్కో పత్రిక/చానెల్ ఉద్యోగి స్వంత అభిప్రాయాలు(కమ్యూనిస్టా,ఆర్ఎస్సేస్సా వంటివి) చూసిగాని తోటి ఉద్యోగులు కూడా స్పందిచరన్న మాట. ఆ ఉద్యోగికి జరిగినది అన్యాయమా కాదా అన్నది విషయం కాకపోవటం దారుణం.

ఇటువంటి విషయాలు మారితెగాని పత్రికా స్వేచ్చ ఎండమావే!

Anonymous said...

I support JP garu. Even if you think that journalists donot have a forum, you may offer this platform but should focus on the purpose of the blog and write such stories along with the main ones.

Anonymous said...

dear jp,
why u are so sad about jounalist's problems. we hope ramu blog is for, of, by the journalists. hope this one platform where they can express their problems.. if you are not interested leave it. if its internal problems there are many ways to solve them.. then why should u discuss the programmes beamed which is waste of time.. viewer know what to watch or not to..

Anonymous said...

yesteday two more employees from technical dept.. editing were removed without notice....in inews...

Anonymous said...

hello ramu garu,
oka journalistga meeru migatha journalist la badhalu telusukoni bloglo rayadam correct. kani mee vanthuga mari meeru em cheyadaluchukunnaru. i news sibbandiki meeru bharosa ivvachukada. valla tarupuna munduku vachi poratam cheyavachukada.

Anonymous said...

Ramu garu,
As per the views of one anonymous this blog is for,of and by the journalists.It looks the common man has nothing to do with this blog as the blog is meant for the problems of the journalists only.If this is the purpose of the blog dealing with the journalists,their proffessional,personal,PF,salary and other problems I feel I donot want to waste my time spending with this blog.If you agree totally with the anonymous my good bye to your blog as I can spend my time with other blogs which are entirely different with yours as they reflect the society as a mirror without centring on any one subject which is confined to one proffession exclusively.
JP.

Anonymous said...

Ramu garu,
As per the views of one anonymous this blog is for,of and by the journalists.It looks the common man has nothing to do with this blog as the blog is meant for the problems of the journalists only.If this is the purpose of the blog dealing with the journalists,their proffessional,personal,PF,salary and other problems I feel I donot want to waste my time spending with this blog.If you agree totally with the anonymous my good bye to your blog as I can spend my time with other blogs which are entirely different with yours as they reflect the society as a mirror without centring on any one subject which is confined to one proffession exclusively.
JP.

Ramu S said...

జే.పీ.గారూ
నమస్తే
నా మిత్రుడు రమణ లాగా మీరు కూడా నన్ను బెదిరిస్తున్నారు. సర్...ఇప్పటి వరకూ అందించిన అంశాలతో పాటు జర్నలిస్టుల జీవితాలు, ఈతి బాధలు కూడా మన బ్లాగ్ లో ప్రధాన అంశాలే. నేను ఆ విషయాన్నే మొదటి పోస్టులో చెప్పాను. అయినా...మీ లాంటి సదాలోచనపరులకు బోర్ కొట్టకుండా ఉండేలానే మధ్యేమార్గం చూస్తాను. అయినా కుదరదు అంటే...ఇక నేనేమీ చేయలేను.
థాంక్స్
రాము

Saahitya Abhimaani said...

రామూ గారూ,

అప్పుడప్పుడు జర్నలిస్టులు వారి ఉద్యోగ జీవితాల గురించి వ్రాయటం కూడా అవసరమే. వారి ఉద్యోగాల్లో యాజమాన్యపు ధోరణుల మీదే కదా వారి పని తీరు ఉండేది. యాజమాన్యం బెదిరించి, రక రకాలుగా ప్రలోభ పెట్టి వీరి చేత వ్రాయించే విషయాలు తప్పనిసరిగా పత్రికా స్వేచ్చకు గొడ్డలి పెట్టు.

అందుకని, యాజమాన్యాల ధోరణులు ఎప్పుడైతే శ్రుతిమించుతాయో అప్పుడు సమాజానికి తెలియాలి. తమ దగ్గర పని చేస్తున్న ఉద్యోగులను ఆ విధంగా ట్రీట్ చేస్తూ ఉన్న పత్రికలూ/చానెళ్ళు ప్రచురించే/ప్రసారం చేసే వార్తల విలువను బేరీజు వేసుకుని తెలుసుకునే ఆవకాశం ఉన్నది.

అలా అని, మీరు కాకుండా ఎవరో "అనామకంగా" ఈ బ్లాగు చేత, కొరకు అని అబ్రహం లింకన్ను అనుసరిస్తూ వ్యాఖ్య చెయ్యటం సరి కాదు. బ్లాగు మీది , అటువంటి ప్రకటన ఏమన్నా ఉంటే మీరు చెయ్యాలి.

Anonymous said...

Ramu garu,
It looks you misunderstood my viewpoint.My view is not a threat.Who am I to threat you?The lives and various problems of the journalist community are part of your blog but not "the only things" of blog as one of our anonymous friends written that this blog is of ,for and by the journalists.Then there is no place for people like us, the non journalists!This is my view point.It is most welcome to share
the lives,the problems and issues
of journalists though we cannot solve their problems but can understand and sympathesise with them.Hope you give equal importance to all the issues related to media,the people ,government and the life of the journalists.
JP.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి